ఇద్దరు రైతుల బలవన్మరణం | Two farmers commit suicide in Prakasam | Sakshi
Sakshi News home page

ఇద్దరు రైతుల బలవన్మరణం

Published Tue, Apr 25 2017 11:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

Two farmers commit suicide in Prakasam

సంతమాగులూరు/పుల్లలచెరువు: ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరు, పుల్లలచెరువు మండలాల్లో అప్పుల బాధ తాళలేక  ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
 
ఈ క్రమంలో అప్పులు బాగా పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక మంగళవారం తెల్లవారుజామున పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే పుల్లలచెరువు మండలం ఐటీవరంలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వరరెడ్డి అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement