వెంకటేశ్వర్లు(ఫైల్)
సాక్షి,ఇల్లెందు (ఖమ్మం): పట్టణంలోని కాకతీయ నగర్‌కు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు గండమళ్ల వెంకటేశ్వర్లు(55) చెరువులో ఈత కొడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం మండలంలోని లలితాపురం చెరువుకు ఈతకు వెళ్లాడు. చెరువులో ఈత కొడుతున్న క్రమంలో అకస్మాత్తుగా నీట మునిగిపోయాడు. గమనించి సహచరులు ఒడ్డుకు చేర్చారు.
చికిత్స నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుదీర్ఘ కాలం ఏఐటీయూసీలో పనిచేసిన ఆయన కార్మిక నాయకుడిగా పట్టణ ప్రజలకు పరిచితుడు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరాడు. మృతదేహాన్ని జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్‌నాయక్, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు సందర్శించారు.
చదవండి: యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే..
Comments
Please login to add a commentAdd a comment