
వరినాట్లు వేస్తున్నకలెక్టర్ వెంకటేశ్వర్లు
సాక్షి, భూపాలపల్లి : ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడు బిజీగా ఉండే అధికారి రైతు కూలీగా మారి పొలంలో వరినాట్లు వేశారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. ఆ అధికారి పేరు వాసం వెంకటేశ్వర్లు. ఈయన భూపాలపల్లి కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రైతుల సమస్యలే ఎజెండాగా తీసుకొని వాటిని పరిష్కరిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు. భూ పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏన్నో ఏళ్లుగా రైతులు పడుతున్న సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూపించారు.
తాజాగా జిల్లాలోని ఘనపురం మండలంలో రైతు సమస్యల పరిష్కారం కోసం వెళుతున్న క్రమంలో దారి మధ్యలో రైతు కూలీగా మారి పొలంలో నాట్లు వేశారు. ఒక జిల్లాకు కలెక్టర్ అయి ఉండి ఎలాంటి బేషజాలకు పోకుండా మాతో కలిసి వరినాట్లు వేయడం తమకెంతో ఆనందం కలిగించదని అక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేశారు.