కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణం గంగానగర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
- భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
కోల్‌సిటీ
కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణం గంగానగర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సింగరేణిలో ఓసీపీ3లో అపరేటర్‌గా పనిచేసే గంపా వెంకటేశ్వర్లు (54) భార్య సరోజతో కలసి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. సమీప బంధువు ఒకరు చనిపోతే ఆ కార్యక్రమాల్లో పాల్గొని బైక్‌పై ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. గోదావరిఖని గంగానగర్ వద్ద గోదావరిలో స్నానం చేసి తిరిగి బైక్‌పై బయల్దేరగా... ఓ ట్రాక్టర్ ఢీకొంది. వెంకటేశ్వర్లు, సరోజల తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా, సరోజ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.