Saroja
-
సీఎం జగన్ సమక్షంలో YSRCPలో చేరిన పోలసపల్లి సరోజ
-
జనసేనలో మహిళలకు జరిగేది ఇదే..!
-
పవన్ కళ్యాణ్ గురించి పోసపల్లి సరోజ ఫేస్ టు ఫేస్
-
జనసేనకు దక్కిన 21 సీట్లలో ఎంత మంది మహిళలు ఉన్నారు? అందుకే గుడ్ బై
-
పార్టీలో అందరి డబ్బు వాడుకున్న పంతం నానాజీకి సీటు ఇచ్చారు.
-
జనసేనకు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ రాజీనామా
-
తిరుగుబాటు ‘సేన’
కాకినాడ రూరల్/సాక్షి, కోనసీమ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఆయన సైన్యం తిరుగుబాటు జెండా ఎగరేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సీట్ల కేటాయింపుపై నిరసన వ్యక్తం చేస్తోంది. తమను పార్టీ కోసం వాడుకుని కరివేపాకులా తీసిపడేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాజాగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ మహిళా నేత, కాకినాడ మాజీ మేయర్ పోతసపల్ల సరోజ చెరియన్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్థానిక సర్పవరం జంక్షన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్‌కు రాసిన రాజీనామా లేఖను ప్రదర్శించారు. ఆమె మాట్లాడుతూ, తన ఆత్మగౌరవాన్ని పార్టీ దెబ్బ తీసిందన్నారు. జనసేన తీసుకున్న ముష్టి 21 సీట్లలో ఒక్కటీ శెట్టిబలిజలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోయేచోట ఒక్క మహిళకు మాత్రమే సీటు ఇవ్వడంపై మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ కోవర్టు అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నట్టుగా పోల్, బూత్ మేనేజ్మెంట్లు లేకపోవడానికి కారణం కేవలం నాదెండ్ల మనోహరే అని ధ్వజమెత్తారు. వారాహి యాత్రలో కత్తిపూడి నుంచి కాకినాడ వరకూ ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ శెట్టిబలిజలకు ఎందుకు సీటు ఇవ్వలేదని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ పవన్‌ను, జనసేనను ముంచేశారని, ఇప్పటికైనా పవన్ కళ్లు తెరవాలని హితవుపలికారు. పవన్ చుట్టూ ఉండే కోటరీలో హరిప్రసాద్, కేకే, చక్రవర్తి, మనోహర్ తదితరులే మాట్లాడతారని విమర్శించారు. తాను కాకినాడ రూరల్ సీటు ఆశించి మోసపోయానని చెప్పారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని, జనసేన కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీకి వ్యతిరేకంగా పని చేస్తానని సరోజ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆమె భర్త చెరియన్ కూడా పాల్గొన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లా! అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పోటీ చేసే రెండు సీట్లలోనూ కొత్తగా పార్టీలో చేరిన వారికే టికెట్లు ఇవ్వడంపై ఆ పార్టీ ఇన్చార్జులు మండిపడుతున్నారు. పి.గన్నవరం అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ స్థానికుడే అయినా తెలంగాణ క్యాడర్ ఉద్యోగి. జనసేన నుంచి టికెట్ హామీ వచ్చిన తరువాతే ఉద్యోగానికి జనవరి 31న వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు. పార్టీలో రెండు నెలల నుంచి మాత్రమే చురుగా>్గ ఉన్నారు. రాజోలు అభ్యర్థి దేవ వరప్రసాద్‌ను అధికారికంగా ప్రకటించకున్నా ప్రచారం చేస్తున్నారు. ఈయన పార్టీలో చేరి రెండేళ్లు కావస్తున్నా స్థానికంగా పెద్దగా పరిచయాలు లేవు. స్థానికంగా రాపాక రమేష్‌బాబు, బొంతు రాజేశ్వరరావు పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. వీరిద్దరికీ పార్టీ మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. అమలాపురం పార్టీ ఇన్చార్జిగా ఉన్న శెట్టిబత్తుల రాజబాబు, పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న డి.ఎం.ఆర్.శేఖర్, బీసీ నేత, శెట్టిబలిజ వర్గానికి చెందిన పితాని బాలకృష్ణలనూ పవన్ పక్కనపెట్టారు. గత ఎన్నికలలో బాలకృష్ణ ముమ్మిడివరం నుంచి పోటీ చేశారు. మండపేట, కొత్తపేట, రామచంద్రపురం పార్టీ ఇన్చార్జిలుగా ఉన్న వేగుళ్ల లీలాకృష్ణ, బండారు శ్రీనివాసరావు, పోలిశెట్టి చంద్రశేఖర్‌కూ పవన్ ఝలక్ ఇచ్చారు. వీరి భవిష్యత్తుపై పవన్ నుంచి ఎలాంటి హామీ లేదని సమాచారం. దీంతో వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చుచేస్తే ఇప్పుడు కరివేపాకులా తీసిపడేశారని మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో జనసేనకు 29శాతం ఓటింగ్ వచ్చినా పవన్ కేవలం రెండుస్థానాలతో సరిపెట్టుకోవడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. -
జనసేనకు మాజీ మేయర్ సరోజ రాజీనామా
సాక్షి, కాకినాడ: జనసేనకు మాజీ మేయర్ పోలసపల్లి సరోజ రాజీనామా చేశారు. పార్టీలో అందరి డబ్బు వాడుకున్న పంతం నానాజీకి సీటు ఇచ్చారంటూ ఆమె మండిపడ్డారు. ‘‘జనసేన అనేది రెసిడెన్షియల్ కాలేజీ లాంటిందని.. ఒక కార్పోరేట్ ఆఫీస్‌లా నడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు. ‘‘జనసేనలో మహిళలకు విలువ లేదు. నాదెండ్ల మనోహర్ టీడీపీకి కోవర్ట్. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి వంటి నేతలతో మేము చాలా ఇబ్బందిపడ్డాం. బీసీలకు కూడా జనసేనలో విలువ లేదు. జనసేనలో బీసీలు ఇప్పటికైనా మేల్కోవాలని సరోజ అన్నారు. ఇదీ చదవండి: రూల్స్ ఫర్ ఫూల్స్.. రాజకీయాల్లో చంద్రబాబు నైజమిదే..! -
ఉద్యోగాల పేరిట మోసం.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి
సాక్షి, చెన్నై(తమిళనాడు): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సరోజ, ఆమె భర్త అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. వివరాలు.. నామక్కల్ జిల్లా రాశీపురానికి చెందిన అన్నాడీఎంకే నేత సరోజ గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ, పౌష్టికాహార శాఖామంత్రిగా పనిచేశారు. పౌష్టికాహార విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి రూ.70 లక్షల వరకు తీసుకుని మోసగించినట్లు ఆమె బంధువు గుణశీలన్ పోలీసులకు కొన్నినెలల క్రితం ఫిర్యాదు చేశాడు. దీంతో మాజీమంత్రి సరోజ, ఆమె భర్త లోకరంజన్ తదితరులపై నేర విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సరోజ, లోకరంజన్ నామక్కల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై ఈనెల 15వ తేదీన మళ్లీ విచారణ చేపట్టనున్నారు. కాగా ముందస్తు బెయిల్ పొందడంలో జాప్యం చోటుచేసుకోవడంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే సరోజ, లోకరంజన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పిటిషనర్ గుణశీలన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, పౌష్టికాహారశాఖ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాజీ మంత్రి సరోజ చెప్పడంతో తాను, భార్య పలువురి వద్ద నుంచి రూ. కోటి వరకూ వసూలు చేసి అందజేశామని అన్నారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వంలో కొలువులు కల్పించకపోవడంతో పోలీసుకు ఫిర్యాదు చేశామన్నారు. మరో రెండురోజుల్లో (15వ తేదీన) కేసు విచారణకు వస్తుండగా సరోజ, లోకరంజన్, వారి కుటుంబ సభ్యులు కలసి ఎక్కడికో వెళ్లిపోయారు. పోలీసులు స్పందిస్తూ.. మాజీ మంత్రి సరోజ, ఆమె భర్తపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణ నిమిత్తం వారింటికి వెళ్లగా లేరని, కోర్టులో వారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసిన తరువాత చర్యలు తీసుకుంటామ్నారు. రాజేంద్ర బాలాజీ పై ఫిర్యాదు తిరువొత్తియూరు: ఆవిన్ పాల సంస్థలో ఉద్యోగం తీసిస్తామని మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ స్నేహితుడు, వెంబకోటై యూనియన్ అన్నాడీఎంకె కార్యదర్శి అయిన విజయ నల్లతంబి రూ.30 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఫిర్యాదులందాయి. కానీ తాను పలువురి వద్ద తీసిచ్చిన రూ.3 కోట్లు నగదును రాజేంద్ర బాలాజీ తిరిగి ఇవ్వలేదని విజయ నల్లతంబి విరుదునగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. విరుదునగర్ జిల్లా సాత్తూరు వెంబకోటై రోడ్డుకు చెందిన రవీంద్రన్ (49). ఇతని సహోదరి కుమారుడికి విరుదునగర్ ఆవిన్ సంస్థలో మేనేజర్ ఉద్యోగం కోసం వెంబకోటై అన్నాడీఎంకే యూనియన్ కార్యదర్శి విజయ నల్లతంబికి రూ.30 లక్షలు ఇచ్చినట్టు తెలిసింది. కానీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఎస్పీ మనోహర్ వద్ద ఆగస్టు 28న ఫిర్యాదు చేశాడు. రవీంద్రన్ విజయ నల్లతంబిల వద్ద 2021 సెప్టెంబర్ 25న ఇన్స్పెక్టర్ గణేష్ దాసు విచారణ చేశారు. ఈక్రమంలో తాను పలువురు వద్ద తీసుకొచ్చిన రూ.3 కోట్ల నగదును మాజీమంత్రి రాజేంద్రన్ బాలాజీ తిరిగి ఇవ్వలేదని నల్లతంబి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కళే బతికించింది
తూర్పుగోదావరి, కొత్తపల్లి: తనలో ఉన్న కళే తనను బతికించిందని ప్రముఖ నాటక, బుల్లితెర, సినీ నటి ఏలూరి సరోజ తెలిపారు. తనలో ఉన్న నటనా కళ నాటక రంగం నుంచి అంచెలంచలుగా సినీ రంగంలోకి ప్రవేశించి పేరు ప్రఖ్యాతులు సాధించేలా చేసిందని చెప్పారు. కొండెవరంలో వేంచేసియున్న శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీల్లో ‘కథ’ నాటికలో ఆమె శ్యామల పాత్రను పోషించారు. ఈ సందర్భంగా ఆమెను శ్రీ వేంటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీ, కళా పరిషత్తు చైర్మన్ మేడిశెట్టి శ్రీరాములు, మారిశెట్టి బుజ్జి, చెలికాని జగదీష్, వాసిరెడ్డి కాశీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆమె సినీ పరిశ్రమలో పనిచేస్తూ కూడా రామచంద్రపురం కళాపరిషత్తు నిర్వాహకురాలిగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆమెతో నిర్వహించిన ఇంటర్వ్యూ... ప్ర: నటనా రంగానికి ఎలా వచ్చారు? జ: మా పిన్ని నాటకాల్లో నటించడం వల్ల ఆమె ప్రోత్సాహంతో ఈ రంగంలోకి వచ్చాను. ప్ర: నాటక రంగంలోకి ఎప్పుడు ప్రవేశించారు? జ: నాటక రంగానికి నా 12వ ఏట ప్రవేశించాను. ప్ర: మొదటి నాటకం పేరు? జ: గాలివాన నాటకంలో సుందరి పాత్ర పోషించాను. రామచంద్రపురంలో ఈ నాటకం ప్రదర్శించాము. ప్ర:ఎన్ని సినిమాల్లో చిత్రాల్లో నటించారు? జ: ఇప్పటి వరకూ 70కు పైగా చిత్రాలలో నటించాను. వాటిలో అవును వాళ్లు ఇద్దరూ ఇష్టపడ్డారు, మాస్, కబడ్డీ, దొంగరాముడు అండ్ పార్టీ, టచ్‌లో ఉంటే చెబుతా, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఎంఎల్ఏ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. ప్ర:ఏయే హీరోల చిత్రాలలో నటించారు? జ: నాగార్జున, రవితేజ, కళ్యాణ్‌రామ్ చిత్రాలతో పాటు ఇంచుమించు నేటి హాస్య నటులందరితోనూ నటించాను. -
ఆ రెండింటికీ వయసుతో పనిలేదు!
తమిళసినిమా: లవ్కైనా, రౌడీయిజానికైనా వయసుతో పనిలేదు ఇది నిజం అని సీనియర్ నటుడు చారుహాసన్ నిరూపించడడానికి సిద్ధమయ్యారు. నటుడు కమలహాసన్ సోదరుడైన ఈయన గురించి ఇప్పుడు పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. నటి సహాసిని తండ్రి అయిన చారుహాసన్ ఇంతకు ముందు చాలా చిత్రాల్లో భిన్నమైన పాత్రలను చేశారు. ఈయన వయసిప్పుడు 80. ఈ వయసులో హీరోగా నటిస్తున్నారు. అదీ డాన్‌గా. చిత్రం పేరు దాదా 87. డాన్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇందులో ఆయనకు ప్రేమ సన్నివేశాలు కూడా ఉంటాయి. చారుహాసన్‌కు జంటగా నటించిందెవరో తెలుసా? యంగ్ హీరోయిన్ కీర్తీసురేశ్ బామ్మ సరోజ. అవును వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం దాదా 87. ఇది గ్యాంగ్‌స్టర్ ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం. ఇప్పుడర్థం అయ్యిందా లవ్కైనా, రౌడీయిజానికైనా వయసుతో పని లేదని. కలైసినిమాస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్శ్రీ.జీ దర్శకత్వం వహించారు. ఇతర పాత్రల్లో సీనియర్ కమెడియన్ జనకరాజ్, ఆనంద్పాండి, శ్రీ పల్లవి నటించారు. ఈ చిత్ర పాటలు, టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను పొందాయి. ఇప్పుడీ చిత్ర విడుదల హక్కులను తిరుఎంటర్టెయిన్మెంట్ సంస్థ పొందింది. త్వరలో తెరపైకి రానున్న ఈ దాదా 87 చిత్రంపై సినీ వర్గాల్లో చాలా ఆసక్తి నెలకొంది. -
శరణు
ఎండ మాడ్చేస్తోంది. టీవీలో కార్యక్రమాల్ని చూసి ఆనందిస్తూ భోజనం చెయ్యటమంటే నాకెంతో ఇష్టం. సన్ టీవీలో ఏదో పాత సినిమా వస్తోంది.ఆ సమయంలో వాకిట్లోకి ఎవరో అపరిచితుడు వచ్చి నిలబడి అటూ ఇటూ చూస్తున్నట్టున్నాడు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. తైల సంస్కారం లేని జుత్తు ఎండిపోయిన పొదలా కనిపిస్తోంది. ముఖం పెయింట్ కొట్టినట్టుగా తళతళమని మెరుస్తోంది. నల్లటి పెయింట్! మీసాలూ, గడ్డమూ లేవు. కళ్లల్లో ఎరుపు జీర! చూడ్డానికి పల్లెటూరి మనిషిలా ఉన్నాడు.మెట్లెక్కి వాకిలి దగ్గరకు వచ్చేశాడు. నాకు కంగారు పుట్టింది. ఒక ముద్ద మాత్రమే నా గొంతులోకి దిగింది. అరిటాకును పరిచి, దాని చివరన వేయించిన చేపల ముక్కల్ని పెట్టి, మధ్యలో అన్నం వడ్డించి, దానిమీద సాంబారును పోసి వెళ్లింది నా భార్య సరోజ. ఆమె ఇప్పుడు స్నానాలగదిలో స్నానం చేస్తోంది. మా రెండవవాడు పడగ్గదిలో మొబైల్లో ఏదో గేమ్ ఆడుకుంటున్నాడు.‘‘ఎవరయ్యా నువ్వు? నీకేం కావాలి?’’ అన్నం నమలటాన్ని ఆపి కూర్చునే గదమాయిస్తున్నట్టుగా అడిగాను.కొత్త వ్యక్తి కంగారుపడ్డట్టుగా అనిపించలేదు. వాకిట నిలబడే చూపుల్ని వంటగది వరకూ సారిస్తూ... మనుషులెవరూ కనిపించకపోయేసరికి ఓ క్షణం నిరుత్సాహపడి మళ్లీ సర్దుకున్నాడు. అతని ముఖంలో అమాయకత్వం కనిపిస్తోంది. నోట్లో నుండి మాటలు బయటికొచ్చాయి. ‘‘సరోజ ఇల్లే కదా ఇదీ?’’ ఎంతగా దాచాలని ప్రయత్నించినా అతని మాటలు అతను తాగి ఉన్నాడన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. నాకు కోపం నషాళానికెక్కింది. కొత్తగా ఒక ఇంటికి వచ్చేవాడు పూటుగా తాగి రావటమే కాక ఏమిటో వాడు తాళికట్టిన పెళ్లాంలా సరోజను పేరుపెట్టి పిలుస్తున్నాడేనని అసహనం పొంగుకొచ్చింది. ఒకవేళ సరోజకు బంధువేమోనన్న అనుమానంతో ఆలోచించాను. అతణ్ని ఎక్కడో చూసినట్టుగాను, చూడనట్టుగాను నాలో రెండు రకాల ఆలోచనలు కమ్ముకోసాగాయి.‘‘ఏ సరోజ?’’‘‘పెరుంగుళం సరోజ. నువ్వు దాని మొగుడివే కదా?’’‘‘ఔను.’’‘‘నేను తెలియటంలే నీకు? నా పేరు సేతు. నాదీ పెరుంగుళమే. మీరిద్దరూ పెరుంగుళానికి వచ్చిన ఎన్నో సందర్భాల్లో నేను ఆమె ఇంటికి వచ్చున్నాను.’’‘‘ఔను, ఇతనో గొప్ప మనిషి, ఇతని గురించి అందరికీ తెలిసుండాలనుకొని పొంగిపోతున్నాడు. శుద్ధ మొద్దులా వచ్చి నిలబడి పరాయి వ్యక్తి పెళ్లాం అని కూడా ఆలోచించకుండా, సరోజను ‘అదీ ఇదీ’ అంటూ ఏక వచనంలో పిలుస్తున్నాడు. అయినా, ఇతనికేంటీ ఎక్కువ వయస్సా ఉంటుంది? సరోజ కన్నా ఒకట్రెండేళ్లు ఎక్కువగా ఉండొచ్చు. కచ్చితంగా నా కన్నా వయసు తక్కువగానే ఉండొచ్చు. నన్నే మర్యాద లేకుండా ‘నువ్వు’ అంటూ పిలుస్తున్నాడే. ఏ ధైర్యంతో అలా పిలుస్తున్నాడు?’‘‘మీరెవరో తెలియదే!’’ ఒళ్లు మండిపోతుంటే అన్నాను.నాలో ఒక ఆలోచన స్ఫురించింది. వచ్చినప్పటినుండీ సరోజ గురించే అడుగుతున్నాడు. ఆమె ఇంట్లో ఉందని చెబితే గంటల తరబడి సుత్తికొట్టేలా ఉన్నాడనిపించింది.‘‘సరోజ ఇప్పుడు ఇంట్లో లేదు. బయటికెళ్లింది.’’‘‘బయటికి... అంటే?’’‘‘బజారుకు...’’‘‘ఇప్పుడే వెళ్లిందా? ఎప్పుడో వెళ్లిందా?’’ ‘‘ఇప్పుడే వెళ్లింది. రావటానికి ఎలాగూ రెండు గంటలు పట్టొచ్చు. ఏ విషయంగా ఆమెను కలవాలనుకున్నారు? నాతో చెప్పి వెళ్లండి. ఆమె రాగానే చెబుతాను.’’ ‘‘దళవాయిపురంలో ఒక ఇంటికి సున్నం కొట్టేందుకు వచ్చాను. ఇంటి యజమాని ఈరోజు వద్దనేశాడు. వచ్చే దార్లో ఉన్న వైన్‌షాప్‌లో నా దగ్గరున్న డబ్బంతా ఇచ్చేసి తాగేశాను. కడుపులో ఇప్పుడు అగ్గిలా మండుతోంది. ఒక వంద రూపాయలు ఉంటే ఇవ్వండి. నా కడుపులో ఇంతేసుకుని, బస్సుకూ టిక్కెట్ కొనుక్కుని ఊరెళ్లిపోతాను. అందుకే సరోజను చూసి వెళదామని వచ్చాను.’’‘‘చేతిలో డబ్బు లేదు కదా, మరెందుకు తాగారు?’’‘‘అంతా సరోజ ఉందన్న ధైర్యంతోటే.’’‘‘మీరు ఇంతకుమునుపు ఈ ఇంటికి వచ్చినట్టు లేరే? మరిప్పుడు ఈ ఇంటిని ఎలా కనుక్కున్నారు?’’‘‘మదురైకు మార్గం నోటితోనే చెప్పలా? మనుషుల్ని అడగ్గానే ‘కరెట్టుగా’ ఈ ఇంటికి చేరిపోయాను.’’‘ఇక్కడ నుండి దళవాయిపురం అర కిలోమీటరు దూరంలో ఉంటుంది. పెరుంగుళం పదిహేను కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. పెరుంగుళం నుండి బస్సు పట్టుకొని దళవాయిపురానికి రావాలి. అంత దూరం నుండి సున్నం కొట్టే పనికోసం వచ్చాడా ఇతను? లేదూ అబద్ధమాడుతున్నాడా?’ ఆలోచనలో పడ్డాడు.ఎండ తీవ్రతకు తనను పూర్తిగా రక్షించుకోలేక ముందుకు నీడలోకి వచ్చి నిలబడ్డాడు. కూర్చుని అలసట తీర్చుకునేందుకు చోటుకోసం అతని పాదాలు వెతుకుతున్నాయి. దీనంగా నా ముఖాన్ని చూడ్డమూ, తడబాటుగా పాదాలను ముందుకూ, వెనకకూ వేస్తూ అల్లాడిపోసాగాడు. అప్పుడు నేను ‘నిజమైన’ మనిషిగా మారవలసి వచ్చింది. సాటి మనిషి తన సాయం కోసం తపిస్తుండటాన్ని చూసి మనసు కరిగి అతనిమీద దయ చూపించాలనిపించింది. కొడుక్కు వినబడేటట్టుగా... ‘‘ఆయనకొక కుర్చీని పట్టుకొచ్చి వెయ్యరా!’’ అని గట్టిగా అరిచాను. నా ఆజ్ఞకోసం ఎదురుచూస్తున్నవాడిలా నా కొడుకు వెంటనే ఒక ప్లాస్టిక్ కుర్చీని తీసుకొచ్చి వాకిలి లోపలిగా గోడవారగా వేశాడు.ఆ కొత్త వ్యక్తి సునిశితమైన చూపులతో గదిలోని వస్తువులన్నింటినీ పరిశీలనగా చూస్తూ ఉండటాన్ని గమనించాను. గోడకు వేలాడుతున్న ఇంటి పెద్దల ఫొటోల మీద అతని చూపులు నిలిచాయి. అదే వేగంలో నన్నూ చూపులతో ఆశ్చర్యంగా చూడసాగాడు. ఫొటోల అంచులకు రంగురంగుల సరిగ కాగితాలు సరాలు సరాలుగా వేలాడుతున్నాయి. వేగంగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ గాలికి అవి సరసరమన్న సంగీతాన్ని వినిపిస్తున్నాయి. పెరుంగుళంలో కనిపించిన సరోజ పూరి గుడిసెకు, ఇక్కడ, ఇప్పుడు కనిపిస్తున్న – ఆమె పెళ్లి చేసుకుని కాపురానికొచ్చిన ఇక్కడి కాంక్రీట్ ఇంటికీ ఎంతో వ్యత్యాసం ఉందని భావించి అతను ఆశ్చర్యపడుతుండాలి.నేను నా భోజనాన్ని ముగించాను. వచ్చిన వ్యక్తితో మాట్లాడుతున్నప్పటికీ నా నోరు దాని పనిని అది పూర్తిచేసింది. కొడుకును అతనికి తోడుగా ముందు గదిలోని సోఫాలో కూర్చోమని చెప్పి, ఆకును మడిచి పెరట్లోకి వెళ్లాను.సరోజ స్నానం పూర్తిచేసినట్టుంది. స్నానాల గది తలుపు తీసుకొని ఠక్కున బయటికొచ్చింది. మండే ఎండలో వాకిట్లోకొచ్చి నిలబడ్డ వ్యక్తితో మాట్లాడిన మాటల ద్వారా చిరాకు పుట్టుకొచ్చిన నాకు, సరోజ తెల్లటి దేహాన్ని చూడగానే మనసుకెంతో హాయిగా అనిపించింది. తల వెంట్రుకలను తడి తువ్వాలుతో చుట్టుకుంది. చందనపు సోపు వాసన గుభాళించింది. అరిటాకును గంపలో పడేసి తొట్టెలో నుండి నీళ్లు ముంచుకొని చేతులు కడుక్కున్నాను.‘‘వాకిట్లో ఎవరితోనో మాట్లాడినట్టుగా శబ్దం వినిపించింది. ఎవరండీ ఆయన?’’‘‘మీ ఊరేనంట. పేరు అడిగితే ‘సేతు’ అని చెప్పాడు. నిన్ను చూడాలంట. ఎంతో ఆశతో వచ్చినట్టుగా తెలుస్తోంది.’’పరిహాసంతో కూడిన మాటల్ని సాగదీయకుండా సరోజతో అన్నాను. ఎప్పుడూ నా మాటలు ఇలాగే ఉంటాయి కనుక నా ఎగతాళికి నొచ్చుకోకుండా చిరునవ్వుతో ముందుగది వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. నేను ఆమె చెయ్యి పట్టుకొని ఆపాను. ‘‘నువ్వు ‘బజారుకు వెళ్లినట్టుగా’ చెప్పాను. నువ్వు అతని ముందుకెళ్లి నిలబడి నన్ను దోషిని చెయ్యకు తల్లీ!’’సరోజ ఠక్కున ఆగిపోయింది. అయినా ‘అతనెవరో’ తెలుసుకోవాలన్న ఆతృత ఆమెలో కనిపించింది. హాల్లో నిలబడే తలుపు సందులో నుండి చూసింది. అంతే! తేలు కుట్టినట్టుగా అదిరిపడింది. ఆమె పొత్తికడుపులో ఏదో పెట్టి తిప్పినట్టుంది. ఒంట్లో నొప్పి పెడుతున్నట్టుగా వణకసాగింది.‘‘ఈ దొంగ వెధవ ఇక్కడికెందుకొచ్చాడు?’’ అని నాకు మాత్రమే వినిపించేలా మెల్లగా అంది.‘‘దొంగ వెధవా వాడు? మీ ఊరి వాడేనా?’’‘‘ఔనండీ! ఇతనిది పెద్ద వీధి! రౌడీతనం చెలాయిస్తూ తిరుగుతుండేవాడు. మా వీధి మనుషుల్ని పట్టుకొని అదిలించి బెదిరించి డబ్బులు గుంజుకొని వెళ్లేవాడు. ఇదేంటని నిలదీయటానికి ఎవరూ సాహసించేవారు కారు. వీర పరంపర అట. ఒకటే హంతకుల గుంపు. ఇక్కడున్న మన ఇల్లు వీడికి ఎలా తెలిసిందబ్బా? ఇప్పుడెందుకొచ్చాడో? దొంగ సచ్చినోడు!’’ సరోజ మాటలుసణుగుడుగా దొర్లాయి. ముఖమంతా ఎర్రబడింది.అతను నాతో అన్న వాగ్దానాన్ని అలాగే సరోజతో చెప్పాను.ఉన్నట్టుండి ముందు గదిలో నుండి ‘‘నాన్నా... నాన్నా... పరిగెత్తి రండి. కిందపడిపోయాడు’’ అని హెచ్చు స్థాయిలో మావాడి గొంతు వినిపించింది. గబగబా ముందు గదిలోకి పరుగెత్తాం.అతను కూర్చున్న కుర్చీలో నుండి జారిపోయి వాకిలి దగ్గర అస్తవ్యస్తంగా కిందపడున్నాడు. భుజం చుట్టూ కట్టుకున్న డైమన్ తువ్వాలు పైకొచ్చి తలను మరుగుపరిచింది. నడుముకున్న పట్టుపంచె పక్కకు తొలగిపోయింది. అతని నోటి నుండి కారిన తాంబూలం ఉమ్మి వాకిలి నేలమీద కారి ఉంది.‘‘అయ్యో, ఏమయ్యిందో తెలియటం లేదే? వెళ్లి లేపండి!’’ సరోజ ఆదుర్దాతో గట్టిగా అరిచింది.నేనూ, మావాడూ గబగబా సేతును పైకెత్తి మళ్లీ అదే కుర్చీలో కూర్చోబెట్టాం. అతని ముఖం వికారంగా మారి ఉంది. అతని చేతుల్లో, కాళ్లల్లో బలం లేదు. అవి బలహీనంగా వేలాడుతున్నాయి. వాటిని దగ్గరకు చేర్చాడు మావాడు.‘‘ఏమండీ, ఇదిగో ఇటు చూడండీ...’’ అని అతణ్ని రెండు మూడుసార్లు గట్టిగా పిల్చాను. మత్తు నుండి బయటపడలేదు అతను. సరోజ వేగంగా వంటగదిలోకి పరుగెత్తుకెళ్లి ఒక చెంబులో మంచినీళ్లు తీసుకొచ్చింది.‘‘ఇదిగో, దీన్ని కాస్త అతనికి తాగటానికివ్వండి. చస్తాడో, ఏమిటో!’’ అని అసహనంగా ఆ చెంబును నా చేతికిచ్చింది.నాకు బెరుకుగా అనిపించింది. ‘‘వీళ్లు మన ఇండ్లల్లో పచ్చి మంచినీళ్లు అయినా తాగుతారంటావా? అతనికి తెలిస్తే గొడవైపోదూ?’’ ‘‘అవసరానికి తప్పులేదండీ. ‘అతనేం తాగాడో’ అతనికెలా తెలుస్తుందీ? మనలో ఎవరైనా చెబితేనే సరి! భయపడకుండా అతని నోటిని తెరిచి తాగించండి.’’ ఆమె చెప్పింది సరిగ్గానే అనిపించింది. అతని దగ్గరికెళ్లి తలను వెనక్కు వాల్చి నోట్లోకి నీళ్లను ఒంపేందుకు ప్రయత్నించాను. కొంతసేపటికి నూతనోత్సాహాన్ని తెచ్చుకున్న సేతు, మెల్లగా కళ్లను తెరిచి మమ్మల్ని ఆశ్చర్యంగా చూడ్డం మొదలుపెట్టాడు. అసంకల్పితంగా చెంబును అతని దృష్టిలో పడకుండా జాగ్రత్తపడ్డాను.‘‘ఉన్నట్టుండి ఏమైందండీ మీకు? బాగానే మాట్లాడుతూ ఉన్నారుగా?’’‘‘ఆకలి దహించటంతో కళ్లు తిరిగి పడిపోయినట్టున్నాను. మందు కొట్టిన కడుపుకు ఏదో ఒకటి మింగాలి కదా! ఖాళీ కడుపుతో మందు కొడితే ఇలాగే ఉంటుంది’’ మత్తు దిగని కళ్లతో మాట్లాడినా సరిగ్గానే బదులిచ్చాడు సేతు. అతని దృష్టి సరోజ మీద నిలిచింది.‘‘నువ్వు బజారుకెళ్లినట్టుగా నీ మొగుడు చెప్పాడే?’’‘‘నేను బాత్రూమ్లో స్నానం చెయ్యటం ఆయనకు తెలియదు’’ అబద్ధం చెప్పింది సరోజ.మళ్లీ అతడు తానుగా తన కోరికను తెలిపేటట్టుగా మాట్లాడాడు.‘‘సరోజా... నిన్ను నమ్ముకునే వచ్చాను. ఒక వంద రూపాయలుంటే ఇవ్వు. ఆకలి మంటై దహించేస్తోంది. హోటల్లో తినేసి అట్నుంచి అటే ఊరికి వెళ్లిపోతాను.’’‘‘వంద రూపాయలకు నేనెక్కడికెళ్లనూ? ఇప్పుడంతా వ్యవసాయంలో ఏం లాభం వస్తోందనీ? ఇప్పటికి మీకు పెట్టడానికి మా ఇంట్లో అన్నం మాత్రమే ఉంది. అయినా మీరు మా ఇండ్లల్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరుగా.’’అకస్మాత్తుగా నా చూపులు టీవీకేసి తిరిగాయి. పాత సినిమా క్లైమాక్స్కొచ్చింది.ముఖంలో దైన్యం కనిపిస్తుంటే సరోజనే చూడసాగాడు సేతు. అతని చూపులు చాలా నీరసంగా కిందికి వాలిపోతున్నాయి. ఆకలి బాధకు అతని ముఖం పీల్చుకుపోసాగింది. కుర్చీలో కూర్చోనుండటం కూడా అతనికి కష్టమైన కార్యంగానే అనిపిస్తోంది. పాములాగా మెలి తిరుగుతూ కూర్చుని ఉన్నాడు.‘‘నేను ఆకలిని తట్టుకోలేకపోతున్నాను. ఇంకేం చెయ్యను? కడుపుకు ద్రోహం చెయ్యకూడదు కదా? కొద్దిగా అన్నం పట్టుకొచ్చి ఇవ్వు. ఆకలినైనా అణచుకొని వెళతాను.’’సినిమా ముగిసింది.తర్వాత రాబోయే కార్యక్రమాలను చూసే ఆసక్తి లేకపోవటంతో టీవీ స్విచ్ ఆఫ్ చేశాను. తమిళ మూలం: అభిమాని అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ -
లంచం..కలకలం
► మంత్రి సరోజ ఓ లంచగొండి ► నాలుగేళ్లలో రూ.4వేల కోట్ల లక్ష్యంగా ముడుపులు ► బదిలీకి రూ.30 లక్షల డిమాండ్ ► పోలీసు కమిషనర్‌కు శిశుసంక్షేమశాఖ అధికారిణి ఫిర్యాదు ► రక్షణ కల్పించాలంటూ వేడుకోలు ఆమె ఓ సాధారణ స్థాయి అధికారిణి. లంచం విషయంలో చిర్రెత్తిపోయారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రిపైనే గురువారం పోలీస్ కమిషనర్‌కుఫిర్యాదు చేశారు.నాలుగేళ్లలో రూ.4 వేల కోట్ల ముడుపులు లక్ష్యంగా మంత్రికి సహకరించాలని కోరారని, తన బదిలీకి రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ధర్మపురి జిల్లా శిశుసంక్షేమ శాఖాధికారిణిగా పనిచేస్తున్న రాజామీనాక్షి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సరోజపై సంచలన ఆరోపణలు చేశారు. శిశుసంక్షేమ శాఖాధికారిణిగా కొనసాగాలంటే రూ.30 లక్షలు లంచంగా ఇవ్వాలని మంత్రి తనను డిమాండ్ చేసినట్లు రాజకీయాల్లో కలకలం రేపారు. ఈనెల 7వ తేదీన చెన్నైలోని తన ఇంటికి రప్పించుకుని బెదిరించినట్లు ఆరోపించారు. చెప్పిన మాట వినకుంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందనే భయంతో బైటకు వచ్చేసినట్లు ఆమె తెలిపారు. ధర్మపురి జిల్లాలో మీడియాకు ఈ విషయాలు వివరించి చెన్నైకి చేరుకున్నారు. గురువారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చి మంత్రి సరోజపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. లంచం అడిగి, బెదిరింపులకు గురిచేసిన మంత్రి సరోజపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులోని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మపురి జిల్లా శిశుసంక్షేమశాఖలో భద్రతాధికారిణిగా తనను జయలలిత స్వయంగా నియమించారు. విధుల్లో నేను ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను. అయితే జయలలిత మరణం తరువాత ఆ బాధ్యతల్లో నన్ను సరిగా పనిచేయనీయలేదు. మంత్రి సరోజ వల్ల తరచూ ఒత్తిడికి గురవుతున్నాను. ఈ విధులకు రూ.10లక్షలు తీసుకుని ఉత్తర్వులు ఇస్తానని చెబుతున్నారు. మంత్రి భర్త సైతం బెదిరింపులకు గురిచేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.10లక్షలు చెల్లించాను. అనారోగ్య కారణాలు, బిడ్డ పెంపకం కోసం చెన్నైలోనే ఉండి విధులు నిర్వర్తించేలా బదిలీ చేయాల్సిందిగా మంత్రికి వినతిపత్రం సమర్పించాను. ఈ వినతిపై మాట్లాడేందుకు రావాలని నన్ను మంత్రి ఇంటికి పిలిపించుకున్నారు. శాఖాపరమైన రికార్డులతో ఈనెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు చెన్నైలో మంత్రి ఇంట్లో కలువగా, ‘చెన్నైకి బదిలీ కోరుతూ నీ వినతిని పరిశీలించాను, బదిలీ చేయాలంటే రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది, ఇక నీకు అండగా నిలిచేవారు ఎవరూ లేరు, ఈ నాలుగేళ్లలో కనీసం రూ.4వేల కోట్లు సంపాదించాల్సి ఉంటుంది, వీలైతే ప్రస్తుత రేటు రూ.30లక్షలు ఇవ్వు, లేకుంటే అదే మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారికి నీ బాధ్యతలు అప్పగిస్తాను. ఈ ఆదేశాలను ధిక్కరించినా, లంచం విషయం బైట చెప్పినా నీ ఉద్యోగం ఊడగొట్టడంతోపాటు నిన్నుæ నామరూపాలు లేకుండా చేస్తాను’ అని మంత్రి బెదిరించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి వల్ల తరచూ వేధింపులకు గురవుతూ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నానని వాపోయారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని కలగకుండా రక్షణ కల్పించా లని కమిషనర్‌ను వేడుకున్నారు. కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించిన అనంతరం ఆమె మీడియాకు వివరించారు. విపక్షాల విమర్శల వెల్లువ: లంచం కోసం అధికారిణిని బెదిరించిన మంత్రి సరోజపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అక్రమార్జనలో మంత్రి విచ్చలవిడి తనం బట్టబయలైందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. మంత్రి వర్గం నుంచి సరోజను బర్తరఫ్ చేయాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రజలు పలు సమస్యలు, కనీసం తాగునీరు కూడాలేక అల్లాడుతుండగా అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతిపైనే పూర్తిస్థాయి దృష్టిపెట్టిందన్న తన ఆరోపణలు సరోజ రూపంలో రుజువయ్యాయని ఆయన అన్నారు. మంత్రి సుజాతపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ డిమాండ్ చేశారు. -
కాప్రా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన
హైదరాబాద్: నగరంలోని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరోజపై పర్యావరణ వేత్తలు నిప్పులు చెరిగారు. ఆమె నిర్లక్ష్యం కారణంగానే కాప్రా చెరువు అన్యాక్రాంతమైందని వారు ఆరోపించారు. అందులోభాగంగా శనివారం కాప్రా సర్కిల్ డిప్యూటి కార్యాలయం ఎదుట పర్యావేరణ వేత్తలు ఆందోళనకు దిగారు. కాప్రా పరిధిలోని చెరువులు అక్రమణలపై తాము ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఆమె నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని పర్యావరణ వేత్తలు మండిపడ్డారు. -
నా శ్రీశ్రీ
ఏప్రిల్ 30 శ్రీశ్రీ జయంతి ఆరోజు ఆగస్ట్ 25 (1956). మనసేం బాలేదు. ఏదో సాధించాలని ఉన్నా సరైన దారేదీ కనబడటం లేదు. తరచుగా పాటల్లో కోరస్‌గా వేస్తూ, సోలో బిట్స్ పాడిస్తూ ఎంకరేజ్ చేస్తోన్న సంగీత దర్శకుడు చలపతిరావుగారున్నారు కదా అన్న ధీమాతో లేని హుషారు తెచ్చుకుని కూర్చు న్నాను. అంతలో మర్నాడు వాహినీ స్టూడి యోలో ‘అమరదీపం’ డబ్బింగ్ పిక్చర్లో సోలో బిట్ రికార్డింగు ఉంది రమ్మని కబురు చేశారా యన. ఆనందానికి అవధులు లేవు. 26వ తేదీ ఉదయం... వాహినీ రికార్డింగ్ థియేటర్... నా పాట 2 గంటలకి వచ్చింది. నేను సోలో బిట్ పాడుతున్నాను. ‘మరొకసారి’ అన్నారు. పాడేను. ‘క్లీన్‌గా మరోసారి పాడ మ్మాయి’ అన్నారు. పాడేను. సరిగ్గా రావడం లేదు. ఇంతలో లోపల్నుంచి మాసిపోయిన షరాయీ లాల్చీ, కొద్దిగా పెరిగిన గడ్డం, స్నానం చేసి బహుశా మూడురోజులైనా అయివుంటుంది - ఎడంచేత్తో సిగరెట్ దమ్ము కొడుతూ, కుడి చేయి ఆడించుకుంటూ ఒకాయన వచ్చారు. ‘నువ్వు తెలుగు పిల్లవా అరవదానివా’ అని అడిగారు. ‘తెలుగుదాన్నే’ అన్నాను. ‘నేను రాసింది కై అని కాదు, కాయ్ - తలకాయ్ అని రాశాను. నువ్వు తలకై అని పాడుతున్నావు. ఏదీ ఓసారి సరిగ్గా పాడు’ అన్నారు. నాకెందుకో ఆ అవతారం చూసి చిరాకేసింది. నేను తర్వాత టేకులో కరెక్ట్‌గా పాడేస్తాను అనేసరికి వెళ్లిపోయారు. చలపతిరావుగారు వచ్చారు. ‘ఎవరన్నయ్యా ఆ పిచ్చాయన? స్నానం అయినా చేసినట్లు లేదు. ఆ బట్టలు, అవతారం’’ అన్నాను. వెంటనే అన్నయ్య... ‘‘ఆయనెవరను కుంటున్నావ్, మహాకవి శ్రీశ్రీ’’ అన్నారు. అంతే... కళ్లు తిరిగాయి. కాళ్లూ చేతులూ గడగడ వణికిపోసాగాయి. అక్కడే కూలబడిపోయాను. అదే శ్రీశ్రీతో నా పరిచయం. ‘‘నమస్కారం సార్’’ అన్నాను. సమా ధానం లేదు. ‘‘శ్రీశ్రీగారూ... నమస్కారమండీ’’ వెనక్కి తిరిగి ‘‘ఆ... ఎవరు?’’ అన్నారు. ‘‘నేనేనండీ... నా పేరు సరోజ. పాటలు పాడ తాను. మా చెల్లి కూడా పాడుతుంది. డ్యాన్స్ చేస్తుంది. మాకీ ఫీల్డులో ఏమైనా చాన్స్ ఉంటే ఇప్పించండి. నేను బాగా రాస్తాను, కష్టపడి పనిచేస్తాను’’ అంటూ గుక్క తిప్పకుండా అనేశాను. ‘‘నన్ను పట్టుకుంటే ఏం లాభం అమ్మాయ్. ఏ డెరైక్టర్నో ప్రొడ్యూసర్నో పట్టుకుంటే లాభం ఉంటుంది’’ అన్నారు. నాకు ఒళ్లు మండిపోయింది. ‘‘మీకు అవకాశం ఉంటే సహాయం చేయండి, లేకుంటే మానెయ్యండి. అంతేకానీ వీళ్లని పట్టుకో వాళ్లని పట్టుకో అంటారేంటి? మేం పరువు గలవాళ్లం’’ అన్నాను. ‘‘అయితే ఈ ఫీల్డుకెందుకొచ్చావ్’’ ‘‘బుద్ధిలేక. మీలాంటి పెద్దవాళ్లు ఇలాంటి సలహాలిస్తారని తెలీక’’ అని గట్టిగా అనేసి నోరు మూసేసుకున్నాను. ఆరోజు శుక్రవారం. ఇంట్లో ఎవరూ లేరు. స్నానం చేసి అందరు దేవుళ్లనీ ఆరాధించాను. గంట చప్పుడులో వీధి తలుపు కొడుతున్న చప్పుడు వినిపించలేదు. దాంతో వచ్చినవారె వరో విసిగిపోయి గట్టిగా బాదుతున్నారు. వెళ్లి తీశాను. ఎదురుగా శ్రీశ్రీ గారు! ఓవైపు సంతోషం, ఇంకోవైపు గాభరా! ‘‘మహాత్మా పిక్చర్స్‌వారు గంధర్వకన్య సినిమా తీస్తున్నారు. నన్ను మాటలు, పాటలు రాయమని బుక్ చేసుకున్నారు. స్క్రిప్ట్ అక్కడికి వెళ్ల్లి రాయాలి. ఏదైనా పనివుంటే ఇప్పించమని అడిగావు కదా! నాకు అసిస్టెంట్ కావాలి. స్క్రిప్టు అంతా ఫేర్ చేయాలి. ఆర్టిస్టులకి పోర్షన్ రాయాలి. డబ్బింగ్ జరుగుతూ ఉంటే నాతోపాటు ఫాలో అవ్వాలి. నీకిష్టమేనా’’ అని అడిగారు. ‘‘తప్పకుండా చేస్తా నండి. కానీ మీరు చెప్పిన పనుల్లో నాకెందులోనూ అనుభవం లేదు’’ అన్నాను. ‘‘నేను నీకు ట్రైనింగ్ ఇస్తాలే’’ అనేసి వెళ్లిపోయారు. ‘‘శ్రీశ్రీ దగ్గర పనిచేయడమేమిటమ్మా? ఇరవై నాలుగ్గంటలూ తాగుతాడు. పైగా స్త్రీ లోలుడు. ఊర్లమ్మట వెళ్లి ఆయన దగ్గర పర్మి నెంట్‌గా సెటిలయ్యావనుకో, ఎవ్వరూ నిన్ను మంచిగా అనుకోరు. ఆలోచించుకో’’ అన్నారు చలపతిరావు అన్నయ్య. ఆ తరువాత చాలా మందిని అడిగాను. అందరూ ‘‘శ్రీశ్రీ దగ్గర నీలాంటి అమ్మాయి పని చేయడం అంత మంచిగా తోచడం లేదమ్మా’’ అనే అన్నారు. శ్రీశ్రీగారి క్యారెక్టర్ గురించి ఒక్కరు కూడా మంచిగా చెప్పలేదు. కానీ నాలో ఒక గుణం ఉంది. చెప్పుడు మాటలు వినడం అంటే నాకు అసహ్యం. ఏదైనా కళ్లారా చూడాలి. అప్పుడే నిజం అని నమ్ముతాను. అసలంత గొప్ప వ్యక్తికి ఈ చెడ్డ పేరేమిటి? బాధ, జాలి కలిగాయి. ఇది పాడు ప్రపంచం. ఎవర్నీ మంచిగా బతక నివ్వదు. నిజానిజాలు దేవుడికే తెలియాలి. మహానుభావులు, గొప్పవారు అంటూనే ఆయన్ని ఆడిపోసుకుంటున్నారంతా. అన్న వాళ్లెవరైనా ఆయనకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారా, ఒక్కరైనా అండగా నిల్చున్నారా అంటే అదీ లేదు. ఆయన్ని బాగు చెయ్యడానికి ప్రయత్నిస్తాను. వ్యసనాల నుంచి మళ్లిస్తాను. బాగుపడితే ఇద్దరం బాగుపడతాం. చెడిపోతే ఇద్దరం చెడిపోతాం. ఇది నా నిశ్చయం. అర్థం లేని వాదన, చిరాకు, నిమిషానికో మూడ్... శ్రీశ్రీగారితో వేగడం కష్టమే. కానీ ఏం చేస్తాం? ఎవరి దగ్గరైనా పని చేయాల్సిందే కదా అని ఎప్పటికప్పుడు సర్దుకు పోయేదాన్ని. మూడ్ వస్తే ఆరు నెలల పని ఆరు రోజుల్లో చేసేసి ఆశ్చర్యపరిచేవారు. లేదా అసలు ఏమిటీ మనిషి అనిపించేలా ప్రవర్తించేవారు. పూర్తి నిరాడంబ రంగా ఉంటూ ఎవ్వరేమన్నా పట్టించుకోని తత్వం ఆయనది. బడాయిలు, గొప్పలు, గర్వం, అహంభావం, అహంకారం ఏ కోశానా కన బడవు. కానీ ఎవరైనా తనని కంట్రోల్ చెయ్య డానికి ప్రయత్నిస్తే మాత్రం ఎంత కోపమో! ఆరోజు ఆరు గంటల యాభై నిమిషాల కల్లా థియేటర్లో అడుగుపెట్టాం. మిగిలిన ఆర్టిస్టులంతా వచ్చేశారు. జగ్గయ్యగారి కోసం వెయిటింగ్. పదకొండు వరకూ ఆయన సోలో లూప్స్ తీస్తూ ఉంటే తర్వాత సావిత్రి, కన్నాంబ, రమణారెడ్డిగార్లు వస్తారు. అలా ప్లాన్ చేసుకుని కూర్చున్నాం. ఏదైనా ప్లాన్ చేస్తే శ్రీశ్రీగారికి అక్షరాలా అలా జరగాల్సిందే. అందులోనూ టైమ్ విషయంలో వారు చాలా స్ట్రిక్ట్. తొమ్మి దిన్నర అయ్యింది. ఆయన ముఖం కందగడ్డలా అయిపోతోంది. జగ్గయ్యగారు వస్తూనే ‘నమ స్కారం శ్రీశ్రీగారూ’ అన్నారు. ఆయన రిప్లై ఇవ్వకుండా జగ్గయ్యగారి దగ్గరకు వెళ్లి, తన వాచీ చూపించి ‘‘టైమెంత’’ అని అడిగారు. జగ్గయ్యగారు చెప్పారు. ‘‘నాక్కావలసింది అంతే, నేను వెళ్లిపోతున్నాను’’ అనేసి బైటికి వచ్చేశారు శ్రీశ్రీ. నేను వెళ్లి బతిమాలాను. ‘‘వాళ్లిప్పుడొస్తే నేను పని చేయాలా, నేను కరెక్టుగా వచ్చాను. తొమ్మిది వరకూ వెయిట్ చేశాను. అంతే. నేనీరోజు పని చెయ్యను. రా వెళదాం’’ అన్నారు. ఒకవైపు పెద్ద ఆర్టిస్టులంతా వచ్చేశారన్న హడావుడి, మరోవైపు శ్రీశ్రీగారు పేచీపెట్టి పేరు చెడగొట్టుకుంటున్నారన్న బాధ. ఇలా చేస్తే ఇంకెవ్వరూ పిక్చర్ ఇవ్వరు. అందుకే నేను కూడా మొండికేశాను. అంతే... ఆయన కోపం తారా పథాన్ని అందుకుంది. ‘సరోజా’ అని ఒక్క అరుపు అరిచారు. ప్రొడ్యూసర్లని పిలిచారు. ‘‘నేను పని చేయాలంటే ముందు ఈవిణ్ని బయటికి గెంటి, తర్వాత నాతో మాట్లాడండి’’ అని, నన్ను చూసి ‘‘గెటవుట్’’ అన్నారు. నాకు తల తీసేసినట్టయ్యింది. అందరి దగ్గరా శెలవు తీసుకుని బయలుదేరాను. ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. నేను ఏడ్చి ఏడ్చి తలనొప్పితో నడుం వాల్చాను. అమ్మ వచ్చి శ్రీశ్రీ వచ్చారని లేపింది. అందరిలో అవమానించినవారు వచ్చేసరికి ఏమనాలో తోచక లేచి వెళ్లిపోయాను. నా వెనకాల వచ్చి ‘సరోజా’ అని పిలిచారు. ఎందుకొచ్చారని అడిగాను. ‘‘నిన్ను చూడాలని’’ ‘‘బతికున్నానా చచ్చానా అనా?’’ ‘‘నేను స్టూడియోకి రావడం లేదు. నువ్వు వెళ్లకపోతే మనకీ పిక్చర్ పోతుంది. కింద కార్లో ప్రొడ్యూసర్లు కూర్చున్నారు. నేను వెళ్తున్నాను’’ అనేసి వెళ్లిపోయారు. ప్రొడ్యూసర్లు వచ్చారు. ‘‘మీరు వెళ్లిపోయారు, శ్రీశ్రీ చాలా ఫీలయ్యారు. మధ్యాహ్నం తనే వస్తుంది, నేను రాను అని చెప్పేశారు. త్వరగా వచ్చేయండి’’ అని చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడేం చేస్తావని ఇంట్లోవాళ్లు అడిగారు. ‘‘అవమానించినా దానికి తగిన గౌరవం వెంటనే ఇస్తున్నారు, ఇప్పిస్తున్నారు. ఆయన తిక్క ఏమిటో నాకు అర్థం కావడం లేదు’’ అంటూండగా సిగరెట్ దమ్ము చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే శ్రీశ్రీ! మా స్టార్ ప్రారంభమయ్యింది. ఒక్క క్షణం తీరిక ఉండేది కాదు. ‘ఈ అమ్మాయి అడుగు పెట్టింది మొదలు శ్రీశ్రీగారి జాతకమే మారి పోయింది’ అని చెప్పుకోవడం మొదలైంది. ‘‘ఈరోజు సాయంత్రం నిన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారమ్మా’’ అన్నారు నాన్న. నా గుండె జారిపోయింది. శ్రీశ్రీగారిని చూడకుండా, ఆయనతో మాట్లాడకుండా నేను ఉండగలనా? ఏదేమైనా మావాళ్లు పెళ్లి చెయ్యక తప్పదు. నేనీ సినిమా ప్రపంచంతో పాటు శ్రీశ్రీగారికి కూడా మంగళం పాడక తప్పదు. అందుకే సరే అన్నాను. కానీ శ్రీశ్రీగారికి చెప్పలేదు. ఆయనకు పైల్స్ ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. పది రోజులయ్యింది. శ్రీశ్రీ కోలుకున్నారు. ఓరోజు సాయంత్రం ఆరుగంటలప్పుడు వచ్చారు. నాన్న ఇంట్లోనే ఉన్నారు. ‘‘మా సరోజకి పెళ్లి చేయాలనుకుంటున్నామండీ, సంబంధం కూడా సెటిలయ్యింది’’ అన్నారు. ‘‘సరోజకి పెళ్లి చేస్తారా? వీల్లేదు. సరోజ నాకు కావాలి. అది లేకుండా నేను బతకలేను. సరోజ నాకే సొంతం. అది లేకుంటే నేను చచ్చి పోతాను. మీరు సరోజని ఇంకొకడికిచ్చి చేస్తే నేను సముద్రంలో పడిపోతాను’’ అంటూ లేచి చకచకా గేటుదాటి వెళ్లిపోయారు. ‘‘ఏవండీ’’ అని పిలుస్తూ ఆయన వెంటపడ్డాను. చెయ్యి పట్టుకొని ఆపాను. ‘‘నాతో బీచ్‌కి వస్తావా?’’ అని అడిగారు. ‘‘నేను రాను’’ అన్నాను. ‘‘నీ అభిప్రాయం నాకర్థమయింది. వీడెవడను కుంటున్నావు? శ్రీశ్రీ! వస్తావా రావా?’’ అని చాలా నెమ్మదిగా అడిగారు. వెళ్లి కూర్చున్నాం. ‘‘నీ కోసం ఏమైనా చేస్తాను. ఐ లవ్ యూ సరోజా. నువ్వు లేకుండా నేను ఉండలేను’’ అన్నారు. 1958లో శ్రీశ్రీగారు నా మెడలో తాళి కట్టారు. (‘శ్రీశ్రీ సంసార ప్రస్థానం’లో సరోజా శ్రీశ్రీ రాసిన విషయాలు) -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు కోల్‌సిటీ కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణం గంగానగర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సింగరేణిలో ఓసీపీ3లో అపరేటర్‌గా పనిచేసే గంపా వెంకటేశ్వర్లు (54) భార్య సరోజతో కలసి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. సమీప బంధువు ఒకరు చనిపోతే ఆ కార్యక్రమాల్లో పాల్గొని బైక్‌పై ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. గోదావరిఖని గంగానగర్ వద్ద గోదావరిలో స్నానం చేసి తిరిగి బైక్‌పై బయల్దేరగా... ఓ ట్రాక్టర్ ఢీకొంది. వెంకటేశ్వర్లు, సరోజల తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా, సరోజ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం
గూడూరు: కర్నూలు జిల్లా గూడూరు సమీపంలో ఆర్టీసీ బస్సులో ఓ మహిళ పండంటి బిడ్డను ప్రసవించింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు... గూడూరుకు చెందిన బోయ సరోజ(30) నిండు గర్భిణి. రెగ్యులర్ చెకప్ కోసం కర్నూలు ఆస్పత్రికి వెళ్లింది. కాన్పు కావడానికి ఇంకా వారం రోజులు పడుతుందని అక్కడి వైద్యులు చెప్పడంతో.. సరోజ ఆర్టీసీ బస్సులో తిరిగి గూడూరుకు బయలుదేరింది. బస్సు గూడూరు శివారుకు వచ్చేటప్పటికి ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు బస్సులోనే కాన్పు చేశారు. మగ బిడ్డ పుట్టాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. -
కలిసిరావడం లేదని.. కూతురినే కడతేర్చిన తండ్రి!
కాలితో తన్ని.. గొంతు నులిమి.. 13 నెలల చిన్నారిని చంపేసిన వైనం కోహీర్: కన్నతండ్రే కాలయముడయ్యాడు. చిన్నారిని గొంతునులిమి హతమార్చాడు. మెదక్ జిల్లా కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన దుర్గయ్య, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. మొదట ఇద్దరు ఆడపిల్లలు. తరువాత కొడుకు పుట్టాడు. మళ్లీ కొడుకు పుడతాడని భావించిన దుర్గయ్యకు నాలుగో సంతానంగా కూతురు జన్మించడంతో జీర్ణించుకోలేక పోయాడు. చిన్న కూతురు సరోజ పుట్టిన తరువాత ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారిందని, ఆ పాపను ఎలాగైనా కడతేర్చాలని భావించి, సమయం కోసం ఎదురుచూడసాగాడు. ఈ విషయాలేవీ తెలియని లక్ష్మి రోజూలాగే చిన్నారికి పాలిచ్చి బయటికి వెళ్లింది. అంతలోనే దుర్గయ్య వచ్చి ఆ చిన్నారిని చెంపలు వాయిం చాడు. కాలితో కసితీరా తన్నాడు. గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తల్లి తిరిగి వచ్చి చూసేసరికే కూతురు చనిపోయి ఉంది. -
పెళ్లిపేరుతో మోసం చేసిన ఖాకీ
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ ఎస్ఐ యువతిని ఆస్పత్రి పాలుచేసిన ఉదంతమిది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి సోదరుడు, కుటుంబ సభ్యులు శనివారం తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు.. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం చాదనకోటకు చెందిన ఏ.జయస్వామి తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో చిత్తూరు జిల్లా ములకలచెరువు ఎస్ఐగా పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండు నెలల క్రితం తిరుపతికి బదిలీఅయ్యారు. ఇతని సొంతగ్రామానికి చెందిన మద్దెల సరోజ(22)ను ప్రేమించాడు. యువతి తండ్రి తన కుమార్తెను పెళ్లిచేసుకోవాలని జయస్వాములు అన్న బాలస్వామిని అడిగాడు. అందుకు ఆయన కట్నం డిమాండ్ చేయడంతో మిన్నకుండిపోయాడు. ఆ తర్వాత 2013 ఆగస్టు 25న ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన కేశవయ్యకు ఇచ్చి వివాహం చేశాడు. అత్తగారింటికి వెళ్లిన సరోజకు జయస్వాములు తరచూ ఫోన్ చేసేవాడు. విషయం సరోజ అత్తకు తెలిసింది. పంచాయితీ పెట్టి సరోజకు విడాకులు ఇప్పించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తాను విధులు నిర్వర్తిస్తున్న ములకలచెరువుకు తీసుకెళ్లి మూడు నెలలు కాపురం చేశాడు. తరువాత ఆమె బంధువుల ఇంటివద్ద వదలి వెళ్లిపోయాడు. మళ్లీ ఫోన్ చేయడంతో సరోజ మనస్తాపానికి గురై ఆత్మహత్యకుయత్నించింది. ప్రస్తుతం బ్రాహ్మణకొట్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోం ది. ఆనంతపురం రేంజ్ డీఐజీకి ఫిర్యాదు సరోజ కుటుంబసభ్యులు అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణకు ఎస్ఐ జయస్వాములుపై ఫిర్యాదు చేశారు. ఆపై ములకలచెరువు సీఐ కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. తిరుపతికి వచ్చిన బ్రాహ్మణకొట్కూరు పోలీసులు ఎస్ఐ జయస్వాములును అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు శనివారం కర్నూలు జిల్లా బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ రాజా కుళ్లాయప్ప, కానిస్టేబుల్ తిరుపతికి వచ్చారు. అప్పటికే స్టేషన్లో ఎస్ఐ జయస్వాములు వెస్ట్ సీఐ నరసింహారావుతో కలిసి మాట్లాడుతున్నారు. బ్రాహ్మణకొట్కూరు నుంచి వచ్చిన ఎస్ఐతో వెస్ట్ సీఐ ఆవేశంగా మాట్లాడారు. అంతలో అక్కడికి వెళ్లిన ‘న్యూస్‌లైన్’ను బయటకు వెళ్లమని పురమాయించారు. నా చెల్లి రోడ్డున పడింది ‘పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడు నెలలపాటు సహజీవనంచేశాడు. తీరా కర్నూలులో బంధువుల ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన నా చెల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నా చెల్లెకు న్యాయం చేయండి సారూ’ అంటూ బాధితురాలి సోదరుడు గౌరీ ఈశ్వరయ్య కన్నీటిపర్యంతమయ్యాడు. -
బిడ్డకు కూడా లోకువేనా!
పొద్దున నేను పిలిచేవరకూ మంచం దిగదు మా అమ్మాయి. ఇంజనీరింగ్ అయిపోయింది. ఉద్యోగం వేటలో ఉంది. గట్టిగా కోప్పడితే ఎదురు సమాధానం చెబుతుంది. ‘ఇలాగైతే ఎలా సౌమ్యా? రేపు పెళ్లయ్యాక నీ ఇష్టం వచ్చినట్టు ఉండడం కుదరదు. ఇప్పటి నుంచే కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. పొద్దునే లేవడం, వంటింట్లో నాకు సాయం చేయడం వంటివి చేయకపోతే పెళ్లయ్యాక చాలా కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగం వచ్చినా పొద్దున్నే లేవాలి కదా!’ అని మెల్లగా నచ్చజెప్పి నచ్చజెప్పి విసుగొచ్చింది. ‘ఉద్యోగం వచ్చినపుడు చూద్దాంలే!’ అనేది. ఓ నాలుగు నెలలు గడిచాక ఉద్యోగం వచ్చింది. వచ్చిన జీతం వచ్చినట్టు ఖర్చుపెట్టేసేది. ‘అదేంటే...’ అంటే? ‘నా జీతంతో నీకు పనేంటమ్మా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా!’ అంటోంది. వాళ్ళ నాన్నగారి ద్వారా భయం చెబుదామనుకుంటే...ఆయన కారణంగానే అమ్మాయికి భయమన్నది పోయింది. సంపాదించింది సంపాదించినట్టు ఖర్చుపెట్టేయడం ఆయన నైజం. పెళ్లయ్యాక ఆయన వ్యక్తిత్వం తెలిసింది. తెలిసి ఏం చేయగలను! బిడ్డ పుట్టాకనయినా దారిలో పడతారనుకుంటే చిన్న మార్పు కూడా లేదు. ప్రతిరోజు ఇంట్లో గొడవలే. ఆడపిల్లను పెట్టుకుని విడిపోయి బతకడమంటే సమాజం సూటిపోటి మాటలతో, చూపులతో పొడుస్తుందని ఇంట్లోనే విడిగా ఉండడం మొదలుపెట్టాం. బిడ్డ గురించి ఆయన అస్సలు పట్టించుకునేవారు కాదు. నేనేమో దాన్ని చూసుకుని బతికేదాన్ని. చాలా గారాబంగా పెంచుకున్నాను. ఇంటి ఖర్చుల నిమిత్తం ఆయన కొంత డబ్బిచ్చేవారు. అంతే! నేను పడుతున్న ఇబ్బందులు చూస్తూ పెరిగిన అమ్మాయి నన్ను అర్థం చేసుకుంటుందంటే అంతా రివర్స్ అయింది. తన లోపాలకు సంబంధించి నేను మాత్రమే భయం చెబుతుండడంతో ‘నాన్న నన్నెపుడూ ఒక్క మాట కూడా అనలేదు. నీకు నన్ను తిట్టడం తప్ప వేరే పనిలేదు’ అంది ఒకరోజు. నాకు బుర్రంతా గిర్రున తిరిగినట్టయింది. ‘నువ్వు కష్టపడితే నీ బిడ్డకు కష్టం ఎలా తెలుస్తుందే! దానికి కూడా కష్టం రుచి చూపించాలి. అడిగిందల్లా కొనిచ్చి...అన్నదానికల్లా తలాడించడం వల్ల ఈరోజు నీ విలువ తెలియడం లేదు దానికి’ అని మా అమ్మ చెప్పిన మాటలు అక్షరాలా వాస్తవం. దానికితోడు తండ్రి నన్ను లెక్కచేయకపోవడంతో ‘అమ్మమాట వినకపోతే నన్నెవరేమంటారు...’ అనే భావన కూడా సౌమ్య మనసులో బలంగా ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యతలోపిస్తే పిల్లలు దాన్ని ఎంత లోకువగా తీసుకుంటారో అనడానికి నా జీవితం నిలువెత్తు నిదర్శనం. బంధువులు, ఇరుగుపొరుగువారికే కాకుండా బిడ్డకు కూడా లోకువైపోయానన్న బాధ, దానికితోడు భవిష్యత్తులో బిడ్డ జీవితం ఎలా ఉంటుందోనని దిగులుపట్టుకుంది. మన కష్టాలు పడడం వల్ల బిడ్డలు బుద్ధిమంతులైపోరు, వారిని కూడా కష్టపడనివ్వాలి. తోటివారిని అర్థం చేసుకునేలా చేసే శక్తి అది మాత్రమే ఇవ్వగలదు! - సరోజ, నల్గొండ -
'సరోజ'ను మరచిపోలేనంటున్న అనుష్క..!
-
మంత్రి వైద్యలింగానికి తప్పిన ప్రమాదం
సాక్షి, చెన్నై:సేలం జిల్లా ఏర్కాడు ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ పెరుమాళ్ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ విజయోత్సవాన్ని శనివారం రాత్రి తంబపట్టిలో నిర్వహించారు. ఇందులో మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, ఎడపాడి పళని స్వామి, ఆర్ వైద్యలింగం పాల్గొంటారని ప్రకటించారు. ముందుగానే అక్కడికి వైద్యలింగం మినహా తక్కిన మంత్రు లు చేరుకున్నారు. తంజావూరు నుంచి సాయంత్రం సేలం జిల్లా తంబం పట్టికి మంత్రి వైద్యలింగం బయలు దేరారు. తంజావూరు కలెక్టర్‌కు చెందిన వీపీఐలు పయనించే ఇన్నోవాలో మంత్రితో పాటుగా ఆరుగురు పయనించారు. తంజావూరులోనే ఈ వాహనం అతివేగంగా దూసుకెళ్లింది. రాత్రి ఏడు గంటల పుదూరు రోడ్డు గుండా తంబం పట్టికి ఇన్నోవా పయనిస్తున్న వేళ, ఆ మార్గంలోని ఎస్ సర్కిల్లో వాహనం అదుపు తప్పింది. డ్రైవర్ కళియమూర్తి వాహనాన్ని కట్టడి చేయలేక పోయాడు. చివరకు ఓ చెట్టును ఢీ కొట్టి ఇన్నోవా ఆగింది. అందులో ఉన్న వాళ్లు అదృష్ట వశాత్తు సురక్షితంగా బయట పడ్డారు. సమాచారం అందుకున్న మరో మంత్రి ఎడపాడి పళని స్వామి తన వాహనాన్ని సంఘటనా స్థలానికి పంపించారు. డ్రైవర్ ఉన్న వైపుగా వాహనం చెట్టును ఢీ కొన్నా, ముందు కూర్చొని ఉన్న మంత్రికి, వెనుక ఉన్న వాళ్లకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న మల్లియకరై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. త్వరితగతిన తంబం పట్టి చేరుకోవాలన్న ఉద్దేశంతో వాహనాన్ని డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. గతంలో చెన్నైకు త్వరితగతిన చేరుకోవాలన్న వేగంతో డ్రైవర్ అతి వేగంగా కారు నడపడంతో చోటు చేసుకున్న ప్రమాదంలో మంత్రి మరియం పిచ్చై బలైన విషయం తెలిసిందే. -
అన్నాడీఎంకే నేతల సంబరాలు
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: ఏర్కాడు ఉప ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా పెరియపాళెంలో అన్నాడీఎంకే నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఎలాపురం యూనియన్ పెరియపాళెం, పూచ్చిఅత్తిపేడు గ్రామంలో జిల్లా అమ్మపేరవై కార్యదర్శి ఎన్ కుళందవేల్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి బాణసంచా కాల్చా రు. ప్రజలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కుళందవెల్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుజేస్తున్న సంక్షేమఫథకాలవల్లే పార్టీ ఘన విజయం సాధించిందన్నారు .రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 40 స్థానాల్లో అన్నాడీఎంకే ఘనవిజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దయాళన్, గోపీ, ఆనందన్, పంచాయతీ అధ్యక్షుడు చొక్కళర్, పచ్చియప్పన్తో పాటు పలువురు పాల్గొన్నారు. -
‘అమ్మ’కే పట్టం
సాక్షి, చెన్నై: ఏర్కాడు ఉప ఎన్నికలోనూ ప్రజలు 'అమ్మ'కే పట్టం కట్టారు. 78 వేల ఓట్ల మెజారిటీతో తిరుగులేని విజయాన్ని అందించారు. ఏర్కాడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ పెరుమాళ్ ఘన విజయం సాధించడంతో పోయెస్ గార్గెన్ లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికలో నోటాకు పడ్డన్ని ఓట్లు కూడా స్వతంత్ర అభ్యర్థులకు లభించలేదు. ఎమ్మెల్యే పెరుమాళ్ మరణంతో ఖాళీ ఏర్పడిన ఏర్కాడు రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్ని క అనివార్యం అయింది. డీఎంకే అభ్యర్థిగా స్థానిక బలం, బంధుగణం మద్దతు కల్గిన మారన్ రంగంలోకి దిగడంతో తమ అభ్యర్థిగా సరోజ పెరుమాళ్‌ను అన్నాడీఎంకే ఎంపిక చేసింది. రాష్ర్టంలో ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న వాళ్లే గెలుస్తూ వచ్చారు. ఆ దిశగా ఈ ఎన్నికలో సరోజ గెలుపు నల్లేరు మీద నడకేనని సర్వత్రా భావించారు. వరుస విజయాలతో దూసుకొస్తున్న తమ హవాకు అడ్డే ఉండదన్న భావన అన్నాడీఎంకేలో నెలకొం ది. అయితే, సమరం హోరాహోరీ కానుందన్న ఇంటెలిజెన్స్ నివేదికతో రంగంలోకి మంత్రులు, నాయకులతో కూడిన జంబో జట్టును రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఆ పార్టీ అధినేత్రి జయలలితకు వచ్చింది. చివరకు స్వయంగా ఎన్నికల ప్రచారానికి సైతం ఆమె వెళ్లారు. లెక్కింపు ఓటింగ్ రోజున జరిపిన పరిశీలన మేరకు ఇక తమ హవాకు తిరుగులేదన్న ధీమా అన్నాడీఎంకేలో పెరిగింది. అయితే, విజయోత్సవానికి కౌంటింగ్ రోజు వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయాన్నే సేలం అనై పట్టిలోని సీఎస్ఐ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి అధికారులు, డీఎంకే, అన్నాడీఎంకే నాయకులు, అభ్యర్థులు చేరుకున్నారు. సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. తొలి రౌండ్ ముగియగానే, అధికార పూర్వకంగా ఫలితాన్ని వెల్లడించక పోవడం వివాదానికి దారి తీసింది. డీఎంకే అభ్యర్థి మారన్ నేతృత్వంలో నాయకులు ఆందోళనకు దిగడంతో కాసేపు కౌంటింగ్ ఆగింది. చివరకు గట్టి భద్రత, పరిశీలన నడుమ 21 రౌండ్ల కౌంటింగ్ సాగింది. రౌండు రౌండుకు అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ, డీఎంకే అభ్యర్థి మారన్‌పై 50 శాతం ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. చివరి రౌండ్ వరకు ఆమె ఆధిక్యతను ప్రదర్శిస్తూ రావడం తిరుగులేని విజయాన్ని అన్నాడీఎంకే సొంతమైంది. లక్షా 42,771 ఓట్లు సరోజకు, 68, 655 ఓట్లు మారన్‌కు పడ్డాయి. చివరకు 78,116 ఓట్లతో సరోజ విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక, నోటాకు అపూర్వ ఆదరణ లభించింది. తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలబడ్డా నోటాకు పడ్డ ఓట్లు కూడా వారికి పడ లేదు. నోటాకు 3,860 ఓట్లు రావడం విశేషం. ఆనందోత్సాహాలు తొలి రౌండులోనే యాభై శాతం ఓట్లు సరోజ ఖాతాలో పడటంతో ఇక తమ అభ్యర్థి గెలిచినట్టేనని అన్నాడీఎంకే వర్గాలు ఆనందంలో మునిగారుు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాల వద్ద బాణాసంచా మర్మోగింది. స్వీట్లు, లడ్డూలు పంచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ పరిసరాల్లో పండుగ సందడి నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఇంటి నుంచి అధినేత్రి జయలలిత బయటకు వచ్చారు. పుష్పగుచ్ఛాల్ని అందజేస్తూ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆన ందంతో కేరింతలు కొడుతున్న కార్యకర్తలకు ఆమె అభివాదం తెలియజేశారు. కృతజ్ఞతలు తమ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించిన ఏర్కాడు ఓటర్లకు జయలలిత కృతజ్ఞలు తెలియజేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ, తమ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు కట్టిన పట్టం ఈ గెలుపు అని అభివర్ణించారు. తాను ఇచ్చిన హామీల ప్రకారం ఆ నియోజకవర్గంలో అన్ని పనులు వేగవంతం చేయనున్నామన్నారు. రేయింబవళ్లు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమించిన మంత్రులు, నాయకులు, ప్రాణ సమానమైన కార్యకర్తలకు అభినందనలు తెలియచేస్తున్నట్టు పేర్కొన్నారు. తమ ప్రచారంతో అభ్యర్థి గెలుపుకు కృషి చేసిన మిత్ర పక్షాల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. -
వేడెక్కిన ఉప సమరం
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఏర్కాడు ఉప ఎన్నికల పోలింగ్‌కు 13 రోజులే గడువు ఉండటంతో నియోజకవర్గంలో ఎన్నికల వేడి పుంజుకుంది. అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ గెలుపుకోసం ఈనెల 28న సీఎం జయలలిత సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యూరు. ఏర్కాడు ఎమ్మెల్యే పెరుమాళ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అన్నాడీఎంకే తరపున పెరుమాళ్ సతీమణి సరోజ, డీఎంకే తరపున నాగమారన్ ప్రధాన అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. వీరుకాక మరో 9 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థి గెలుపుకోసం జయలలిత ఇప్పటికే మంత్రి వర్గ బృందాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. వారంతా ప్రచారంలో ముని గిపోయివుండగా 28వ తేదీన సీఎం స్వయంగా ప్రచారంలోకి దిగనుండడం పార్టీ శ్రేణులను ఆనందంలో ముంచెత్తుతోంది. కేవలం ఆ ఒక్కరోజునే ఏర్కాడు నియోజకవర్గ పరిధిలోని 9 చోట్ల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తారు. సీఎం సుడిగాలి పర్యటనకు పార్టీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి డీఎంకే తరపున పోటీ చేస్తున్న నాగమారన్ను ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కించాలని ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ప్రయత్నాలు చేస్తున్నారు. అరుుతే వృద్ధాప్యం వల్ల డీఎంకే అధినేత కరుణానిధి ఏర్కాడుకు వెళ్లకపోరుునా ఆయన కుమారుడు, పార్టీ కోశాధికారి స్టాలిన్ పర్యటించే అవకాశం ఉంది. అయితే ఇంకా తేదీ ఖరారు కాలేదు. సీఎం జయ పర్యటనలో డీఎంకేకు వ్యతిరేకంగా సాగే విమర్శలను తిప్పికొట్టేందుకు వీలుగా ఆ తరువాతనే స్టాలిన్ పర్యటనకు సిద్ధపడే అవకాశం ఉంది. మంత్రికి సంజాయిషీ నోటీసు రాష్ట్ర రహదారుల శాఖా మంత్రి ఎన్నికల నిబంధనలను ధిక్కరించారని ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఏర్కాడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ గత నెల 4 వతేదీన జారీ అయినందున ఆ నాటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన అన్నారు. ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన అధికారి ఈనెల 16న మంత్రి ఇంటికి వెళ్లి గంటకు పైగా గడిపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి మంత్రిపై చర్య తీసుకోవలసిందిగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై 48 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాల్సిందిగా మంత్రి పళనిసామికి ఎన్నికల కమిషన్ గురువారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారాలను వీడియోలో చిత్రీకరించే ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో 13 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌ను నియమించారు.