
తమిళసినిమా: లవ్‌కైనా, రౌడీయిజానికైనా వయసుతో పనిలేదు ఇది నిజం అని సీనియర్ నటుడు చారుహాసన్ నిరూపించడడానికి సిద్ధమయ్యారు. నటుడు కమలహాసన్ సోదరుడైన ఈయన గురించి ఇప్పుడు పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. నటి సహాసిని తండ్రి అయిన చారుహాసన్ ఇంతకు ముందు చాలా చిత్రాల్లో భిన్నమైన పాత్రలను చేశారు. ఈయన వయసిప్పుడు 80. ఈ వయసులో హీరోగా నటిస్తున్నారు. అదీ డాన్‌గా. చిత్రం పేరు దాదా 87. డాన్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇందులో ఆయనకు ప్రేమ సన్నివేశాలు కూడా ఉంటాయి.
చారుహాసన్‌కు జంటగా నటించిందెవరో తెలుసా? యంగ్ హీరోయిన్ కీర్తీసురేశ్ బామ్మ సరోజ. అవును వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం దాదా 87. ఇది గ్యాంగ్‌స్టర్ ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం. ఇప్పుడర్థం అయ్యిందా లవ్‌కైనా, రౌడీయిజానికైనా వయసుతో పని లేదని. కలైసినిమాస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్‌శ్రీ.జీ దర్శకత్వం వహించారు. ఇతర పాత్రల్లో సీనియర్ కమెడియన్ జనకరాజ్, ఆనంద్‌పాండి, శ్రీ పల్లవి నటించారు. ఈ చిత్ర పాటలు, టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను పొందాయి. ఇప్పుడీ చిత్ర విడుదల హక్కులను తిరుఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ పొందింది. త్వరలో తెరపైకి రానున్న ఈ దాదా 87 చిత్రంపై సినీ వర్గాల్లో చాలా ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment