అన్నాడీఎంకే నేతల సంబరాలు | AIADMK's victory keeps cadre jubilant | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే నేతల సంబరాలు

Published Tue, Dec 10 2013 2:13 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

AIADMK's victory keeps cadre jubilant

 గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: ఏర్కాడు ఉప ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా పెరియపాళెంలో అన్నాడీఎంకే నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఎలాపురం యూనియన్ పెరియపాళెం, పూచ్చిఅత్తిపేడు గ్రామంలో జిల్లా అమ్మపేరవై కార్యదర్శి ఎన్ కుళందవేల్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి బాణసంచా కాల్చా రు. ప్రజలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కుళందవెల్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుజేస్తున్న సంక్షేమఫథకాలవల్లే పార్టీ ఘన విజయం సాధించిందన్నారు .రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 40 స్థానాల్లో అన్నాడీఎంకే ఘనవిజయం సాధిస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దయాళన్, గోపీ, ఆనందన్, పంచాయతీ అధ్యక్షుడు చొక్కళర్, పచ్చియప్పన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement