సాక్షి, హైదరాబాద్: ఉత్తమ పారిశ్రామిక విధానంతోనే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని శాసన మండలి ప్రభు త్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రి కేటీఆర్‌కు ప్రశం సలు దక్కుతున్నాయనే కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తన అక్కసును వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ మంత్రిగా విఫలమైన షబ్బీర్.. మంత్రి కేటీఆర్‌ను మిస్టర్ ఫెయిల్యూర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.
గల్ఫ్ బాధితుల కోసం కాంగ్రెస్ హయాంలో చేసిందేమీ లేదని, కేవలం ట్వీటర్‌లో వచ్చిన ఒక్క ట్వీట్‌కే కేటీఆర్ స్పందించి ఎందరో బాధితులను కాపాడారన్నారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయనే అక్కసుతో కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందని, నాలుగైదు బతుకమ్మ చీరలు కాల్చి మహిళలు అసంతృప్తిగా ఉన్నారని దుష్ప్రచారం సాగించిందని మండిపడ్డారు. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న షబ్బీర్ ప్రభుత్వ పథకాల సమా చారం తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతానంటే కుదరదని ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ అన్నారు.