సిద్దిపేట/సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: ప్రధానంగా నీటిని ఆదా చేసేందుకు, నేల సారాన్ని కాపాడేందుకు వరికి బదులు ఇతర పంటలు సాగుచేయూలని సూచిస్తుంటారు. అయితే ఈసారి సవుృద్ధి గా కురిసిన వర్షాల వల్ల నీటి వనరులు కళకళలాడుతున్నాయి. సహజంగానే వరి వేసేందుకు ఆసక్తి చూపే రైతులు.. నీటి సౌలభ్యం కారణంగా వరి పండించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐఆర్ 64, ఎంటీయుూ 1010 వంటి విత్తనాలు విత్తేందుకు కసరత్తు చేస్తున్నారు.
సరిగ్గా ఈ సవుయుంలోనే సర్కారు నుంచి సబ్సిడీ విత్తనాలు లభించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం కనపడడం లేదని పెదవి విరుస్తున్నారు. సిద్దిపేట వ్యవసాయు డివిజన్‌లో కనీసం 15 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి వేస్తారని అధికారిక అంచనా. ఒక ఎకరాలో నారు పోసేందుకు దాదాపు 50 కిలోలు వడ్లు అవసరవువుతాయి. అంటే 7.50 లక్షల కేజీల విత్తనాలు(30 కేజీలవైతే పాతిక వేల బస్తాలు)సిద్దిపేట వ్యవసాయు డివిజన్‌కు కావాలన్నవూట.
ఆదాపై పరదా..
వ్యవసాయు, దాని అనుబంధ శాఖలు ఐఆర్ 64, ఎంటీయు 1010 రకాల వరి విత్తనాలను రైతులకు తగినన్ని నిల్వలు అందుబాటులో ఉంచితే కిలోకు రూ.5 చొప్పున ధర తక్కువవుతుంది. ప్రైవేటు సీడ్ షాపుల్లో ఐఆర్ 64 రకానికి 30 కేజీల బస్తాలు కనీసం రూ.750కి ఒకటి విక్రయిస్తున్నారు. ఎంటీయుూ 1010 కూడా ఇంచుమించు అదే రేటుకు అవుు్మతున్నట్లు తెలుస్తోంది. అంటే రైతులకు మొత్తంగా రూ.37.50 లక్షలయ్యే ఆదాపై ప్రస్తుతం పరదా పడుతున్నట్లు లెక్క! ఈ సీజన్‌లో 1010 రకం వరి విత్తనాల బస్తాలు 25 కేజీలవి రూ.585కు ఒకటి చొప్పున ఇస్తున్నట్లు వ్యవసాయు శాఖ వర్గాలు చెబుతున్నారుు.
ప్రైవేటుతో పోల్చితే బస్తాకు రూ.40 తగ్గుతుంది. అరుుతే అవి కూడా అందరికీ లభించడంలేదని, దాంట్లోనూ దాగుడువుూతలే కనిపిస్తున్నాయుని రైతులు వాపోతున్నారు. డివూండ్ ఉన్న విత్తనాలను సబ్సిడీపై వ్యవసాయు శాఖ, పీఏసీఎస్, డీసీఎమ్మెస్ వంటి వాటి ద్వారా ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. దీనిపై సిద్దిపేట ఏడీఏ వెంకటేశ్వర్లును ‘న్యూస్‌లైన్’ ఫోన్‌లో సంప్రదించింది. ఐఆర్ 64 రకానికి ఏవూత్రం రాయితీ ఉండదన్నారు. గతంలోనూ లేదన్నారు. ఎంటీయుూ 1010 రకం వరి విత్తనాలు వూత్రం స్వల్ప రారుుతీపై అందజేస్తున్నట్లు తెలిపారు.