paddy seed
-
విత్తనం దొరక్క రైతులు ‘వర్రీ’
నరసరావుపేట రూరల్: పల్నాడు జిల్లాలో వరి విత్తన కొరత తీవ్రంగా ఉంది. కోరిన విత్తనం దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మడులు సిద్ధం చేసుకున్న రైతులు.. అదను దాటి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నిండి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడంతో కుడి కాలువ ఆయకట్టు పరిధిలోని రైతులు పూర్తి స్థాయిలో మాగాణి భూముల్లో వరి సాగుకు సిద్ధమయ్యారు. దీంతో పది రోజులుగా నాణ్యమైన వరి విత్తనాల కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.నరసరావుపేట డివిజన్‌తో పాటు వినుకొండ, సత్తెనపల్లి డివిజన్లలోనూ విత్తన కొరత ఉండటంతో ఆయా ప్రాంత రైతులు నరసరావుపేట పట్టణానికి విత్తనాల కోసం తరలి వస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల ప్రాంతం నుంచి సరఫరా అవుతున్న స్వల్ప కాలిక రకం జేజీఎల్–384 విత్తనాలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపు తున్నారు. 135 రోజుల్లో పంట చేతికి రావడంతో పాటు తెగుళ్లను తట్టుకునే వంగడం కావడంతో ఈ రకం విత్తనాల కోసం రైతుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది.నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లోని చిన్నయ్య అండ్ సన్స్ దుకాణంలో సబ్సిడీపై ఏపీ సీడ్స్ సరఫరా చేసే విత్తనాలతో పాటు ప్రైవేటు రకం విత్తనాలను కూడా విక్రయిస్తుంటారు. ఇందులో భాగంగా జేజీఎల్–384 రకం విత్తనాలు కూడా అందుబాటులో ఉంచారు. 25 కి లోల విత్తనాల బస్తా రూ.1,350.. 30 కిలోల విత్తనాల బ స్తా రూ.1,500కు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు ఈ విత్తనం కోసం దుకాణం ఎదుట బారులు తీరుతున్నారు. పోలీసు బందోబస్తుతో విత్తనాల విక్రయం వారం నుంచి విత్తనాల కోసం వందల మంది రైతులు దుకాణం వద్ద పడికాపులు కాస్తున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి రైతులు గ్రామాల నుంచి జేజీఎల్–384 రకం విత్తనాల కోసం తరలి వస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసు బందోబస్తుతో విత్తనాల విక్రయం సాగుతోంది. అయినప్పటికీ బుధవారం ఉదయం రైతుల మధ్య తోపులాట జరగడంతో టౌన్ హాల్లో టోకెన్లు జారీ చేసేందుకు కౌంటర్ ఏర్పాటు చేశారు.కొంత మందికి టోకెన్లు అందజేసి కౌంటర్‌ను మూసివేశారు. దీనిపై రైతులు నిలదీయడంతో స్టాక్ ఉన్న వరకే టోకెన్లు అందజేశామని నిర్వాహకులు తెలిపారు. దీంతో గత్యంతరం లేక రైతులు వెనుదిరగాల్సి వచ్చింది. టోకెన్లు తీసుకున్న రైతులు జోరు వానలోనూ క్యూలైన్లో వేచి ఉండటం కనిపించింది. రైతులు అన్ని ఇబ్బందులు పడి టోకెన్ తీసుకున్నా, కేవలం ఒక బస్తానే ఇస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేజీఎల్–384 రకం వరి విత్తనాల కోసం రైతులు కష్టాలు పడుతుంటే ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇతర రకాలు సాగు చేసుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధంజేజీఎల్–384 రకం వరి విత్తనాలు ఎక్కడా అందుబాటులో లేవని, అదే రీతిలో దిగుబడి ఇచ్చే స్వల్ప కాలిక రకాలు ప్రత్యామ్యాయంగా సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి తెలిపారు. పల్నాడు ప్రాంతానికి అనుకూలమైన వంగడాలతో పాటు రైతులు ఎక్కువగా ఇష్టపడే అంకుర్ సోనా, అంకుర్–పద్మ, ఏపి–567, అన్నపూర్ణ తదితర రకాల విత్తనాలను సరిపడా అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.నాలుగు రోజులుగా తిరుగుతున్నా..జేజీఎల్–384 రకం వరి విత్తనాల కోసం నాలుగు రోజు లుగా పట్టణానికి వచ్చి దుకాణాల చుట్టూ తిరుగుతున్నాం. ఈ రోజు టోకెన్ దొరికితే ఒక బస్తా (25 కిలోలు) ఇచ్చారు. ఐదు ఎకరాల్లో ఈ రకం వేయాలని సిద్ధమయ్యాం. ఒక బస్తాతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. – వసంత శ్రీనివాసరావు, రైతు, పమిడిమర్రుఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు వరి విత్తనాల కోసం ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. విత్తన దుకాణాల్లోనే అన్ని రకాల విత్తనాలు దొరికేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులకు కావాల్సిన విత్తనం దుకాణాల్లో దొరకడం లేదు. ఇక్కడ ఒక్క చోటే విత్తనాలు అమ్ముతున్నారు. దీంతో రైతులందరూ ఇక్కడికే రావడంతో తోపులాట జరుగుతోంది. – రావి సుబ్బారావు, రైతు, చీమలమర్రిరైతులు కోరిన విత్తనాలు అందించాలి లాభసాటిగా ఉండే విత్తనాలను రైతులకు ప్రభుత్వం అందించాలి. రైతులు అడిగిన విత్తనం కాకుండా, ఇతర రకాలు సబ్సిడీపై ఇస్తే ప్రయోజనం ఏమిటి? జేజీఎల్ రకం విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – జె.వెంకటేశ్వర్లు, రైతు, తుంగపాడు -
స్వర్ణకు సలామ్
పెనుమంట్ర (ఆచంట): పెనుమంట్ర మండలం మార్టేరులో రూపుదిద్దుకుని రైతులకు సిరులు కురిపిస్తున్న స్వర్ణ రకం వరి వంగడం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. హరిత విప్లవం ద్వారా దేశంలో ఆహార భద్రతకు దోహదపడిన వరి వంగడాలపై ఇటీవల ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా 1980 దశకం ముందు నుంచి అధిక దిగుబడిని, రైతులకు పంట భరోసాను ఇచ్చిన మార్టేరు స్వర్ణ రకం కేంద్ర ప్రభుత్వ అధికారుల లెక్కల్లో అగ్రగామిగా నిలిచింది. మొత్తంగా 1980కి ముందు నుంచి రైతునేస్తాలుగా గుర్తింపు పొందిన 51 రకాల విత్తనాలను జాతీయ స్థాయిలో ప్రముఖమైనవిగా అధికారులు గుర్తించారు. వీటిలో వరికి సంబం«ధించి స్వర్ణతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలోనే రూపుదిద్దుకున్న ‘మసూరి’ వంగడం కూడా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ జాబితాలో మొక్కజొన్నలో డీహెచ్ఎం 101 రకం కూడా ఉంది. ల్యాండ్‌మార్కు రకంగా.. న్యూఢిల్లీలో 1941లో ఏర్పాౖటెన బ్రీడర్స్ ఇండియన్ సొసైటీ సంస్థ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచిన ప్రముఖ విత్తన రకాలపై పరిశోధన చేస్తోంది. సంస్థను నెలకొల్పి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణ, మసూరి రకాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో ‘ల్యాండ్‌మార్కు’ రకాలుగా బ్రీడర్స్ ఇండియన్ సొసైటీ గుర్తించింది. ఢిల్లీలో అవార్డు ప్రధానం జాతీయస్థాయిలో స్వర్ణ రకం గుర్తింపు పొందిన క్రమంలో మార్టేరు వరిపరిశోధనా స్థానంకు పురస్కారం దక్కింది. ఢిలీల్లోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రాంగణంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ప్రముఖ శాస్త్రవేత్తలు ఆర్ఎస్ పరోడ, డాక్టర్ గురుగోవింద్ కుష్, డాక్టర్ పీఎల్ గౌతమ్, డాక్టర్ జీఎస్ సంధు, డాక్టర్ వీఎల్ చోప్రా చేతుల మీదుగా మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన డైరెక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ పురస్కారం అందుకున్నారు. మా సంస్థకు గర్వకారణం దేశంతో పాటు విదేశాల్లోనూ స్వర్ణ రకం సాగులో ఉండటం మా సంస్థకు గర్వకారణం. మార్టేరులో ఈ రకాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలకు ప్రజలు, రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి స్ఫూర్తితో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనువైన రకాలను, పెట్టుబడి తగ్గించి చేయగల విత్తనాలను, మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణమైన వంగడాల తయారీకి శాస్త్రవేత్తలతో కలిసి నిరంతరం కృషి చేస్తున్నాం. – డాక్టర్ పీవీ సత్యనారాయణ, వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్, మార్టేరు -
రబీలో ‘రాయితీ’కి రాం.. రాం!
సిద్దిపేట/సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: ప్రధానంగా నీటిని ఆదా చేసేందుకు, నేల సారాన్ని కాపాడేందుకు వరికి బదులు ఇతర పంటలు సాగుచేయూలని సూచిస్తుంటారు. అయితే ఈసారి సవుృద్ధి గా కురిసిన వర్షాల వల్ల నీటి వనరులు కళకళలాడుతున్నాయి. సహజంగానే వరి వేసేందుకు ఆసక్తి చూపే రైతులు.. నీటి సౌలభ్యం కారణంగా వరి పండించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐఆర్ 64, ఎంటీయుూ 1010 వంటి విత్తనాలు విత్తేందుకు కసరత్తు చేస్తున్నారు. సరిగ్గా ఈ సవుయుంలోనే సర్కారు నుంచి సబ్సిడీ విత్తనాలు లభించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం కనపడడం లేదని పెదవి విరుస్తున్నారు. సిద్దిపేట వ్యవసాయు డివిజన్లో కనీసం 15 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి వేస్తారని అధికారిక అంచనా. ఒక ఎకరాలో నారు పోసేందుకు దాదాపు 50 కిలోలు వడ్లు అవసరవువుతాయి. అంటే 7.50 లక్షల కేజీల విత్తనాలు(30 కేజీలవైతే పాతిక వేల బస్తాలు)సిద్దిపేట వ్యవసాయు డివిజన్‌కు కావాలన్నవూట. ఆదాపై పరదా.. వ్యవసాయు, దాని అనుబంధ శాఖలు ఐఆర్ 64, ఎంటీయు 1010 రకాల వరి విత్తనాలను రైతులకు తగినన్ని నిల్వలు అందుబాటులో ఉంచితే కిలోకు రూ.5 చొప్పున ధర తక్కువవుతుంది. ప్రైవేటు సీడ్ షాపుల్లో ఐఆర్ 64 రకానికి 30 కేజీల బస్తాలు కనీసం రూ.750కి ఒకటి విక్రయిస్తున్నారు. ఎంటీయుూ 1010 కూడా ఇంచుమించు అదే రేటుకు అవుు్మతున్నట్లు తెలుస్తోంది. అంటే రైతులకు మొత్తంగా రూ.37.50 లక్షలయ్యే ఆదాపై ప్రస్తుతం పరదా పడుతున్నట్లు లెక్క! ఈ సీజన్లో 1010 రకం వరి విత్తనాల బస్తాలు 25 కేజీలవి రూ.585కు ఒకటి చొప్పున ఇస్తున్నట్లు వ్యవసాయు శాఖ వర్గాలు చెబుతున్నారుు. ప్రైవేటుతో పోల్చితే బస్తాకు రూ.40 తగ్గుతుంది. అరుుతే అవి కూడా అందరికీ లభించడంలేదని, దాంట్లోనూ దాగుడువుూతలే కనిపిస్తున్నాయుని రైతులు వాపోతున్నారు. డివూండ్ ఉన్న విత్తనాలను సబ్సిడీపై వ్యవసాయు శాఖ, పీఏసీఎస్, డీసీఎమ్మెస్ వంటి వాటి ద్వారా ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. దీనిపై సిద్దిపేట ఏడీఏ వెంకటేశ్వర్లును ‘న్యూస్‌లైన్’ ఫోన్లో సంప్రదించింది. ఐఆర్ 64 రకానికి ఏవూత్రం రాయితీ ఉండదన్నారు. గతంలోనూ లేదన్నారు. ఎంటీయుూ 1010 రకం వరి విత్తనాలు వూత్రం స్వల్ప రారుుతీపై అందజేస్తున్నట్లు తెలిపారు.