నర్సారావుపేట: గుంటూరు జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. నర్సారావుపేట మండలం అచ్చమ్మపాలెంలో వ్యవసాయ బావిలో శుక్రవారం ఉదయం అచ్చి వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. మృతదేహాన్ని రైతులు బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.
గురువారం జరిగిన ఓ ఫంక్షన్ నుంచి వెంకటేశ్వర్లును ముగ్గురు స్నేహితులు తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో స్నేహితులే వెంకటేశ్వర్లును హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.