వెంకటేశ్వర్లు
హైదరాబాద్: మీ అమ్మ నుంచి పిలుపువచ్చింది..నేను వెళ్లిపోతున్నాను.. నా గురించి వెతకవద్దు.. అంటూ లేఖ రాసి ఓ వృద్ధుడు ఇంటి నుంచి వెళ్ళి పోయిన ఘటన హైదరాబాద్ లోని కార్ఖాన పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పీఎస్ పరిధిలోని మడ్‌ఫోర్ట్ ఎంఈఎస్ కార్యాలయం శివాలయం సమీపంలో నివాసం ఉండే వ్యాపారి ఎం. వెంకటేశ్వర్లు(65) భార్య రెండేళ్ళ క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి దిగులుతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తన కొడుకు ముత్యాలరావును ఉద్దేశించి లేఖరాసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.