తల వదిలి ... మొండెం తీసుకెళ్లారు | APSP Constable brutally killed in Kurnool District | Sakshi
Sakshi News home page

తల వదిలి ... మొండెం తీసుకెళ్లారు

Published Wed, Dec 17 2014 9:42 AM | Last Updated on Mon, Aug 20 2018 3:37 PM

తల వదిలి ... మొండెం తీసుకెళ్లారు - Sakshi

తల వదిలి ... మొండెం తీసుకెళ్లారు

కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. ఏపీఎస్పీ 9వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గరైయ్యాడు. అతడి తలను దుండగులు బండి ఆత్మకూరులో వదిలి వెళ్లారు.  సదరు గ్రామస్తులు మనిషి తలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని తలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టగా... కోడూరు వద్ద తల లేని మొండాన్ని గుర్తించి... స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న తల, మొండం గత అయిదురోజుల క్రితం అదృశ్యమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుదిగా పోలీసులు గుర్తించారు. ఈ హత్య రెండు రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధమా లేక ఇతర ఏమైనా కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల తన కుటుంబాన్ని కర్నూలులో దింపిన వెంకటేశ్వర్లు తిరిగి వస్తున్న క్రమంలో అదృశ్యమైయ్యాడని పోలీసులు తెలిపారు.  తలతో పాటు ఏడమ చేతిని కూడా దుండగులు నరికి వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement