ఒంగోలు : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు వీఆర్వో రమాదేవి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ చిక్కారు. నంద్యాలకు చెందిన రవీంద్రారెడ్డి అనే రైతు పట్టాదారు పాసుపుస్తకం కోసం వీఆర్వో చెరుకూరి రమాదేవిని ఆశ్రయించాడు. పాసు పుస్తకం మంజూరు చేసేందుకు రూ. 6 వేలు డిమాండ్ చేసింది. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు గురువారం దర్శి గ్రామంలోని వీఆర్వో రమాదేవి స్వగృహంలో రైతు నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.