పోలీసుల అదుపులో నకిలీ పోలీసులు ? | Police arrested fake police? | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో నకిలీ పోలీసులు ?

Published Sat, Nov 16 2013 5:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

Police arrested fake police?

మరిపెడ, న్యూస్‌లైన్ :   సీఐ, ఎస్సైలమంటూ మండలంలోని పలుగ్రామాల్లో వసూళ్లకు పాల్పడుతున్న కొందరు నకిలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... మండలంలోని ఉల్లెపల్లి, విస్సంపల్లి శివారు తండాల్లో సుమా రు ఆరుగురు వ్యక్తులు రెండు రోజులుగా తిరుగుతూ ప్రజలను పోలీసుల పేరిట భయభ్రాంతులకు గురిచే స్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే గతంలో గంజాయి వ్యాపారంతో సంబంధమున్న ఓ వ్యక్తిని బెదిరించినట్లు సమాచారం. మూడు రోజుల క్రితం వచ్చి ఆయనతోపాటు మరో ఇద్దరిని బెదిరించి రూ లక్ష ఇవ్వాలని, లేదంటే పాత కేసుల్లో ఇరికిం చి జైలుకు పంపిస్తామని బెదిరించినట్లు తెలిసింది.

దీంతో వారు రూ 80 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బులు ఇస్తామని చెప్పడంతో నకిలీ పోలీసు లు మరిపెడకు గురువారం రాత్రి చేరుకున్నారు. అనంతరం మాదాపురం, ఉల్లేపల్లి శివారు భూక్యతండాకు చెందిన ఇద్దరు వ్యక్తులను నకలీలు తీసుకెళ్లి డబ్బుల కోసం వేధించసాగారు. వారి బంధువులకు సమాచారం అందించడంతో వారు నకిలీ పోలీసులను వెంబడించడమేగాక పోలీసులకు సమాచారమిచ్చారు. వారిలో ము గ్గురిని మండలంలోని ఎల్లంపేట స్టేజీ చాకచక్యంగా ప ట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.   
 పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
 రూరల్‌ఎస్పీ లేళ్ల కాళిదాసు రంగారావు మరిపెడ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రైం రేటును అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీ లించారు. పోలీసులందరిని మండలంలోని పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రత ల విషయమై ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశా రు. ఆయన వెంట మహబూబాబాద్ డీఎస్పీ రమాదేవి, కురవి సీఐ రవీందర్, మరిపెడ ఎస్సై వెంకయ్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement