Maripeda
-
ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. ప్రియుడు మోసం చేశాడంతో
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అజ్మీరతండా గ్రామ పంచాయతీ పరిధి దారావత్‌తండాకు చెందిన భూక్య అనూష(18) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనూష మహబూబాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే తండాకు చెందిన దారావత్ శేఖర్ ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అనూష, శేఖర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో శేఖర్ పెళ్లి చేసుకుంటానని అనూషను నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈవిషయం ఇటీవల యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు శేఖర్ తల్లిదండ్రులతో మాట్లాడారు. అనూష తల్లిదండ్రులు వారిద్దరికీ పెళ్లి చేద్దామన్నారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా కోపోద్రుక్తులై దుర్భాషలాడారు. ఇదే విషయంపై యువకుడిని నిలదీయగా.. అతను కూడా ముఖం చాటేశాడు. దీంతో తాను ప్రేమికుడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా.. తన బిడ్డ చావుకు కారణమైన శేఖర్, అతడి కుటుంబీకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
శభాష్ యశ్వంత్.. చరిత్ర సృష్టించాడు
మరిపెడ రూరల్: విస్పష్టమైన లక్ష్యం ముందుంటే దేన్నైనా సాధించొచ్చని నిరూపించాడు రాష్ట్రానికి చెందిన గిరిజన యువకుడు యశ్వంత్. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం (5,895మీ.) కిలిమంజారోను అధిరోహించాడు. శిఖరాగ్రంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన భూక్యా రామ్మూర్తి, జ్యోతి దంపతుల చిన్న కుమారుడు యశ్వంత్ హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని ఎన్డీసీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రాక్ క్లైంబింగ్ అంటే ఆసక్తి. ఈ క్రమంలోనే ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికయ్యాడు. ఈ నెల 21న పర్వతారోహణ యాత్రను ప్రారంభించి ఆగస్టు 26న శిఖరాగ్రానికి చేరుకుని త్రివర్ణపతాకాన్ని ఎగురవేశాడు. చదవండి: శ్మశానంలో ‘డాక్టర్’ చదువు -
Corona: గర్భంలో 8 నెలల శిశువుతో తల్లి మృతి
మరిపెడ రూరల్: కరోనా సోకిన 8 నెలల గర్భిణి మృతి చెందిగా.. ఆమె కడుపులోని శిశువును కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సోమ్లతండాలో చోటు చేసుకుంది. సోమ్లతండా జీపీకి చెందిన భూక్య శిల్ప (27)కు రెండేళ్ల కిందట భూక్య వీరుతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి. ఈనెల 8వ తేదీన శిల్పకు కరోనా పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్లో ఉన్నారు. కొన్ని రోజులకు కోవిడ్ లక్షణాలు ఎక్కువయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం ఈనెల 12న కుటుంబసభ్యులు ఆమెను ఖమ్మంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి ఊపిరాడక ఆదివారం మృతిచెందింది. వెంటన వైద్యులు సిజేరియన్ చేసి ఆమె కడుపులోని బిడ్డను బయటకు తీసినా అప్పటికే మృతి చెందింది. దీంతో తల్లీ బిడ్డల మృతదేహాలను భర్త, ఇతర సభ్యులు ఆస్పత్రి నుంచి గ్రామానికి తీసుకెళ్లారు. స్థానిక సర్పంచ్ భూక్యా కృష్ణ, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. -
కాపురానికి రాలేదని భార్యను..
సాక్షి, మహబూబాబాద్: భార్య కాపురానికి రావడం లేదని భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఖమ్మం జిల్లాకు చెందిన తేజకు మరిపెడ శివార ధారావత్ తండకు చెందిన కస్తూరికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భర్తతో విభేదించిన కస్తూరి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం తనతో కాపురానికి రావాలని భర్త పలుమార్లు కస్తూరిని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో.. కస్తూరిపై కక్ష పెంచుకున్నాడు. పక్కా పథకం ప్రకారం మంగళవారం మధ్యాహ్నాం ఆమె పనిచేస్తున్న మెడికల్ షాప్ వద్దకు వచ్చి.. తనతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై.. అక్కడిక్కడికే మృతి చెందింది. భార్యపై దాడి చేసిన అనంతరం.. అతను సమీపంలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. -
ఓట్లు వేయలేదని.. ప్రతీకారం
సాక్షి, మరిపెడ రూరల్: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని ఆరోపిస్తూ ఓ రైతు వ్యవసాయ పొలాలకు వెళ్లే డొంకదారిని జేసీబీతో తవ్వేసి దారికి అడ్డంగా కంచె ఏర్పాటు చేసిన ఘటన మండలంలోని ఎడ్జెర్ల శివారు గుర్పప్పలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..తండా నుంచి సుమారు 100 మంది రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలేక ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో 12 సంవంత్సరాల క్రితం తండాలో పెద్దమనుషులు అందరూ మాట్లాడుకుని తల కొంత భూమి ఇస్తామని ముందుకు వచ్చి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న మన్నెగూడెం గ్రామం వరకు వెళ్లే విధంగా డొంకదారిని ఏర్పాటు చేసుకున్నారు. జేసీబీతో చదును చేసిన డొంకదారి ఈ రహదారిపై ఉన్న గుంతలను సైతం గ్రామ పంచాయతీ నిధులతో మట్టి పోయించి చదును చేసుకున్నారు. మరో సారి ఉపాధి హామీ పథకం ద్వారా మరోమారు గుంతలను పూడ్చుకున్నారు. పస్తుతం పీఆర్‌డబ్ల్యూ కింద తారురోడ్డు కూడా మంజూరు అయ్యింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన బానోతు రామన్న ఓటమి పాలయ్యాడు. ఇది దృష్టిలో పెట్టుకొని డొంక దారి మధ్యలో రామన్న భూమిలో నుంచి ఉన్న దారిని జేసీబీ ద్వారా తవ్వి చదును చేయించాడు. దారికి అడ్డంగా కంచెను కూడా ఏర్పాటు చేశారు. ఈ రహదారి గుండా పొలాలు వెళ్లే రైతులు బతిలాడినప్పటికీ దారి ఇవ్వనని తెగేసి చెప్పడంతో తండాలో గొడవ తారస్థాయికి చేరింది. దీనిపై రామన్నను వివరణ కోరగా ఈ భూమి తమ సొంతమని కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాని తెలిపారు. అందుకు అనుగుణంగా చదును చేసుకున్నట్లు తెలిపారు. కోర్డు ద్వారా తెచ్చుకున్న స్టేను విలేకరులకు చూపించాడు. -
మరిపెడ తహసీల్దార్‌గా అమర్నాథ్
హ్మకొండ అర్బన్ : నర్సింహులపేట తహసీల్దార్‌గా పనిచేస్తున్న అమర్నాథ్ను మరి పెడకు బదిలీ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.మరి పెడ తహసీల్దార్‌గా ఉన్న మంజుల కొద్ది రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అమర్నాథ్ మరిపెడ ఇన్చార్జి తహసీల్దార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయననే పూర్తిస్థాయి తహసీల్దార్‌గా నియమిం చారు. అమర్నాథ్ బదిలీతో నర్సిం హుపేట తహసీల్దార్ పోస్టు ఖాళీ అయింది. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
వరంగల్ : వరంగల్ జిల్లా మరిపెడ మండలం నీలికుర్తి స్టేజి సమీపంలో ఓ వృద్ధుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నీలికుర్తి పంచాయతీ భజనతండాకు చెందిన బానోతు హనుమ (70) గా స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరిపెడలో విజిలెన్స్ దాడులు
మరిపెడ (వరంగల్) : వరంగల్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో అనుమతులు లేకుండా బయో పెస్టిసైడ్స్ అమ్ముతున్న రెండు షాపులను సీజ్ చేశారు. సుమారు రూ. రెండున్నర లక్షల విలువ గల పురుగుల మందులు స్వాధీనం చేసుకున్నారు. -
ఇసుక రవాణా వాహనాలు సీజ్
వరంగల్: ఇసుక అక్రమ రవాణా పై పోలీసులు పంజా విసిరారు. వరంగల్ జిల్లా మరిపెడ మండలంలో ఇసుకని అక్రమంగా రవాణా చేసే వాహనాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. మండలంలోని రామాపురం గ్రామంలో ఆకేరువాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలు, ఓ జేసీబీని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. -
'తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పదిలం'
-
'తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పదిలం'
వైఎస్ఆర్ ఆశయాలను స్పూర్తిగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేసే సత్తా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల స్సష్టం చేశారు. శనివారం వరంగల్ జిల్లా మరిపెడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు. వైఎస్ఆర్ పాలన సువర్ణయుగమన్ని తెలిపారు. మహానేత పరిపాలనలో ప్రవేశ పెట్టిన ఏ పథకాన్నైనా అద్భుతంగా అమలు పరిచారన్నారు. ఆయన హయాంలో ఆర్టీసీ, కరెంట్... ఇలా ఏ ఒక్క ఛార్జీ పెరగలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పోడిచిందని ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో మంజూరైన ఇళ్లకు కనీసం బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదని... అలాగే కరెంట్ ఛార్జీలు పెంచి రూ. 32 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందని అన్నారు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో ఆయన అభిమానులు ఎక్కువ మంది తెలంగాణలోనే చనిపోయారన్నారు. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలు ఇంకా వైఎస్ఆర్ను గుండెల్లోనే పెట్టుకున్నారని తెలిపారు. ఏ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన లోను కాకుండా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వెయ్యాలని తెలంగాణ ప్రజలకు సూచించారు. -
పోలీసుల అదుపులో నకిలీ పోలీసులు ?
మరిపెడ, న్యూస్‌లైన్ : సీఐ, ఎస్సైలమంటూ మండలంలోని పలుగ్రామాల్లో వసూళ్లకు పాల్పడుతున్న కొందరు నకిలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... మండలంలోని ఉల్లెపల్లి, విస్సంపల్లి శివారు తండాల్లో సుమా రు ఆరుగురు వ్యక్తులు రెండు రోజులుగా తిరుగుతూ ప్రజలను పోలీసుల పేరిట భయభ్రాంతులకు గురిచే స్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే గతంలో గంజాయి వ్యాపారంతో సంబంధమున్న ఓ వ్యక్తిని బెదిరించినట్లు సమాచారం. మూడు రోజుల క్రితం వచ్చి ఆయనతోపాటు మరో ఇద్దరిని బెదిరించి రూ లక్ష ఇవ్వాలని, లేదంటే పాత కేసుల్లో ఇరికిం చి జైలుకు పంపిస్తామని బెదిరించినట్లు తెలిసింది. దీంతో వారు రూ 80 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బులు ఇస్తామని చెప్పడంతో నకిలీ పోలీసు లు మరిపెడకు గురువారం రాత్రి చేరుకున్నారు. అనంతరం మాదాపురం, ఉల్లేపల్లి శివారు భూక్యతండాకు చెందిన ఇద్దరు వ్యక్తులను నకలీలు తీసుకెళ్లి డబ్బుల కోసం వేధించసాగారు. వారి బంధువులకు సమాచారం అందించడంతో వారు నకిలీ పోలీసులను వెంబడించడమేగాక పోలీసులకు సమాచారమిచ్చారు. వారిలో ము గ్గురిని మండలంలోని ఎల్లంపేట స్టేజీ చాకచక్యంగా ప ట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రూరల్‌ఎస్పీ లేళ్ల కాళిదాసు రంగారావు మరిపెడ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రైం రేటును అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీ లించారు. పోలీసులందరిని మండలంలోని పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రత ల విషయమై ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశా రు. ఆయన వెంట మహబూబాబాద్ డీఎస్పీ రమాదేవి, కురవి సీఐ రవీందర్, మరిపెడ ఎస్సై వెంకయ్య ఉన్నారు.