
సాక్షి, మహబూబాబాద్: భార్య కాపురానికి రావడం లేదని భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఖమ్మం జిల్లాకు చెందిన తేజకు మరిపెడ శివార ధారావత్ తండకు చెందిన కస్తూరికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో భర్తతో విభేదించిన కస్తూరి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం తనతో కాపురానికి రావాలని భర్త పలుమార్లు కస్తూరిని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో.. కస్తూరిపై కక్ష పెంచుకున్నాడు. పక్కా పథకం ప్రకారం మంగళవారం మధ్యాహ్నాం ఆమె పనిచేస్తున్న మెడికల్ షాప్ వద్దకు వచ్చి.. తనతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై.. అక్కడిక్కడికే మృతి చెందింది. భార్యపై దాడి చేసిన అనంతరం.. అతను సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment