మరిపెడ రూరల్: విస్పష్టమైన లక్ష్యం ముందుంటే దేన్నైనా సాధించొచ్చని నిరూపించాడు రాష్ట్రానికి చెందిన గిరిజన యువకుడు యశ్వంత్. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం (5,895మీ.) కిలిమంజారోను అధిరోహించాడు. శిఖరాగ్రంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటాడు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన భూక్యా రామ్మూర్తి, జ్యోతి దంపతుల చిన్న కుమారుడు యశ్వంత్ హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని ఎన్‌డీసీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రాక్ క్లైంబింగ్ అంటే ఆసక్తి. ఈ క్రమంలోనే ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికయ్యాడు. ఈ నెల 21న పర్వతారోహణ యాత్రను ప్రారంభించి ఆగస్టు 26న శిఖరాగ్రానికి చేరుకుని త్రివర్ణపతాకాన్ని ఎగురవేశాడు.
చదవండి: శ్మశానంలో ‘డాక్టర్’ చదువు
Comments
Please login to add a commentAdd a comment