Mount Kilimanjaro
-
అతివల తెగువకు తలవంచిన కిలిమంజారో!
కాకినాడ: భారతీయ పర్వతారోహకుల్లో కాకినాడ మహిళలు మరో మైలురాయిని అధిగవిుంచారు. 19,341 అడుగుల ఎత్తు గల కిలిమంజారో పర్వతాన్ని ఏడు రోజుల్లో అధిరోహించి.. పర్వతంపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న కాకినాడకు చెందిన సత్తి లక్ష్మితో పాటు కోనేరు అనిత, వాడకట్టు పద్మజ, స్రవంతి చేకూరి, శ్రీశ్యామలలు.. ఏడు రోజుల్లో వీరు లక్ష్యాన్ని చేరుకోవడంతో వీరి తెగువకు, సంకల్పానికి, కఠోర దీక్షకు అందరూ ఫిదా అవుతున్నారు. వారం రోజులు శ్రమించి సరిగ్గా ఆగస్టు 15న కిలిమంజారో పర్వతంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. వీరిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కరరెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రరెడ్డి అభినందించారు. -
కిలిమంజారో పర్వతంపై వైఫై
డొడోమా: అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటి కిలిమంజారో. ఆఫ్రికన్ సంప్రదాయానికి ఈ పర్వతాన్ని ఒక ప్రతీకగా భావిస్తుంటారు. సుమారు 19వేల ఫీట్లకు పైగా ఎత్తులో ఉండే ఈ పర్వతాన్ని అధిరోహించడాన్ని ఒక ఘనతగా భావిస్తుంటారు అధిరోహకులు. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కిలిమంజారో ఆఫ్రికాలో అతిపెద్ద పర్వతం మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ స్టాండింగ్ పర్వతం కూడా. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు టాంజానియా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 12,200 అడుగుల ఎత్తుల ఈ వైఫైను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరికల్లా.. పర్వతంలో మూడింట రెండో వంతు భాగానికి ఇంటర్నెట్ సౌకర్యం అందనుంది. అయితే వైఫై సౌకర్యం ఉన్న పర్వతం ఇదొక్కటే కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌పై 2010 నుంచే ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి చోట్లలో టెక్నాలజీపై ఆధారపడడం కూడా విపరీతాలకు దారి తీయొచ్చని అంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: కరువు తప్పించుకునేందుకు చైనా ఏం చేస్తోందంటే.. -
పులకించిన కిలిమంజారో
కిలిమంజారో పర్వతం. ఓ దశాబ్దంగా వార్తల్లో తరచూ కనిపిస్తున్న ఈ పర్వతం మీదనున్న ఉహురు శిఖరం ఎత్తు 5895 మీటర్లు. ఆఫ్రికా ఖండంలో ఎల్తైన పర్వతం ఇది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎల్తైన ఏడు పర్వతశిఖరాల్లో నాలుగవది. ఈ శిఖరం మీద అక్టోబర్ మూడవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు మన భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మౌంటనియర్ పదమూడేళ్ల పులకిత హస్వి మన తెలుగమ్మాయి. ఆఫ్రికా ఖండం, టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో అధిరోహించాలనే కోరిక ఇంత చిన్న వయసులో ఎందుకు కలిగి ఉంటుంది... అనే సందేహం రావడం సహజమే. ఇది హస్వికి కోవిడ్ కాలంలో రేకెత్తిన ఆలోచన. లాక్డౌన్ కారణంగా స్కూళ్లు లేవు. పులకిత హస్వి ఇష్టంగా నేర్చుకుంటున్న బ్యాడ్మింటన్‌ను కూడా విరామం తప్పలేదు. ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలు చూడడమే పనిగా ఉన్న సమయం అది. ఆ చూడడంలో ఎవరెస్ట్ అనే ఇంగ్లిష్ సినిమాను చూడడం కాకతాళీయమే. కానీ ఆ చూడడం ఈ అమ్మాయి అభిరుచిని, గమనాన్ని మార్చేసింది. ఏకంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు నడిపించింది. ఆ తర్వాత కిలిమంజారో శిఖరానికి చేర్చింది. ఇదంతా ఈ ఏడాదిలో జరిగిన పురోగతి మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా చూసింది, ఎవరెస్ట్ అధిరోహిస్తానని అమ్మానాన్నలను అడిగింది. ఏప్రిల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్ విజయవంతంగా పూర్తి చేసింది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ఇంటికి వచ్చిన రోజు రాత్రి అమ్మానాన్నలతో ‘సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేస్తాన’ని తన తర్వాతి లక్ష్యాన్ని బయటపెట్టింది పులకిత హస్వి. అలాగే కిలిమంజారో పర్వతారోహణ పూర్వాపరాలను సాక్షితో పంచుకుంది. తొలి ఘట్టం ఎవరెస్ట్ బేస్ క్యాంపు ‘‘మా నాన్నది మంచిర్యాల, అమ్మ వాళ్ల ఊరు కర్నూలు జిల్లా నంద్యాల. ఇద్దరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. నా చిన్నప్పుడు వెస్ట్ మారేడ్‌పల్లిలో ఉండేవాళ్లం. అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి అవకాశం బాగా ఉండేది. అన్నయ్య, నేను ఇద్దరం ఎప్పుడూ ఏదో ఒక కోచింగ్ లో ఉండేవాళ్లం. కీబోర్డ్, గిటార్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆర్కిస్టిక్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేసి నేషనల్స్‌కు వెళ్లాను. నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సీరియెస్‌గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. కానీ కోవిడ్‌తో ప్రాక్టీస్ ఆగిపోయింది. మౌంటనియరింగ్ వైపు దృష్టి మళ్లింది. ఎవరెస్ట్ అధిరోహించడానికి ముందు బేస్‌క్యాంప్ ట్రెక్ పూర్తి చేసి ఉండాలి. అందుకే తొలి ప్రయత్నంగా బేస్ క్యాంపు ట్రెక్ పూర్తి చేశాను. 2024–2025 కి సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేయాలనేది నా టార్గెట్. ఆ తర్వాత మళ్లీ బ్యాడ్మింటన్ వైపు వెళ్లాలనేది ఇప్పటి నా ఆలోచన. సెవెన్ సమ్మిట్స్ పూర్తయిన తర్వాత అప్పుడు ఎలా అనిపిస్తే అలా చేస్తాను’’ అంటూ భుజాలు ఎగరేస్తూ నవ్వింది పులకిత హస్వి. గడ్డకట్టిన నీళ్లు ‘కిలిమంజారో సమ్మిట్ పూర్తి చేయడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇక్కడితో సంతృప్తి చెందితే మిగిలిన సమ్మిట్స్ పూర్తి చేయలేనని కూడా ఆ క్షణంలోనే గుర్తు వచ్చింది’ అంటూ కిలిమంజారో అధిరోహణ అనుభవాలను చెప్పింది పులకిత హస్వి. ‘‘సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ ఎనిమిది వరకు సాగిన ట్రిప్‌లో యాక్చువల్ పర్వతారోహణ మొత్తం ఐదు రోజులే. నాలుగో రోజు శిఖరాన్ని చేరతాం. ఐదవ రోజు కిందకు దిగుతాం. శిఖరాన్ని చేరే లోపు నాలుగు రోజుల్లో ఏడెనిమిది రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాం. మంచు దట్టంగా పొగలా కమ్మేసి ఉంటుంది. ముందు ఏముందనేది స్పష్టంగా కనిపించదు. నాలుగో రోజు ఆహారం కూడా ఉండదు. రెండు చాక్లెట్లు, ప్రొటీన్ బార్ మాత్రమే ఆహారం. అంతకు మించి ఏమీ తినాలనిపించదు కూడా. మైనస్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మాతో తీసుకువెళ్లిన బాటిల్లోని నార్మల్ వాటర్ గడ్డకట్టిపోయాయి. ఫ్లాస్క్‌లో తీసుకువెళ్లిన వేడినీటిని కలుపుకుని తాగాను. స్నోఫాల్ని దగ్గరగా చూడగలిగాను. కిలిమంజారో పర్వతం మీద మంచు కురుస్తుంటే పక్కనే మరో పర్వతం మీద సూర్యుడి కిరణాలు కాంతులీనుతున్నాయి. ప్రకృతి చేసే ఇలాంటి అద్భుతమైన విన్యాసాలను బాగా ఎంజాయ్ చేశాను. ఈ పర్వతారోహణ వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. స్పాట్ డెసిషన్ తీసుకోవడం అనేది ప్రాక్టికల్‌గా తెలిసి వచ్చింది. ఐదవరోజు పర్వతాన్ని దిగేటప్పుడు చాలాసార్లు పల్టీలు కొట్టుకుంటూ పడిపోయాను. ‘అయ్యో పడిపోయావా’ అంటూ లేవదీయడానికి ఎవరూ ఉండరు. మనకు మనమే సంభాళించుకుని లేచి ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే ఒకటి– రెండు సార్లు పడిన తర్వాత ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలిసి వస్తుంది. ఆ తర్వాత పడకుండా సాగిన ప్రయాణమే పెద్ద విజయంగా అనిపిస్తుంది. కిలిమంజారో ఎక్స్‌పెడిషన్‌కు వెళ్లడానికి ముందు మూడు నెలలపాటు ఫిట్నెస్ ప్రాక్టీస్ చేశాను. ఫిట్నెస్ క్లాసులు కూడా డిజిటల్ మీడియా ద్వారానే. మా కోచ్ వాట్సాప్‌లో ఏరోజుకారోజు టాస్క్ ఇస్తారు. హైట్స్‌కి వెళ్లకుండా ప్రాక్టీస్ మొత్తం నేల మీదనే కావడంతో శిఖరం మీదకు వెళ్లినప్పుడు వామిటింగ్ ఫీలింగ్ కలిగింది. అంతకు మించి ఎక్కడా ఇబ్బంది పడలేదు. మా టీమ్‌లో మొత్తం ఏడుగురున్నారు. నేనే చిన్నదాన్ని. అరవై ఏళ్ల మౌంటనియర్ కూడా ఉన్నారు. మాలో శిఖరాన్ని చేరింది నలుగురే. కిలిమంజారో పర్వతారోహణ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందనేది నాకే స్పష్టంగా తెలుస్తోంది. ఏడు సమ్మిట్స్‌ని పూర్తి చేసి తీరుతాను’’ అన్నది హస్వి. సెవెన్ సమ్మిట్స్ ఎవరెస్ట్ (8,849 మీటర్లు)– ఆసియా, అకాంగువా (6,961 మీటర్లు) – సౌత్ అమెరికా, దేనాలి (6,194 మీటర్లు)– నార్త్ అమెరకా, కిలిమంజారో (5,895 మీటర్లు)– ఆఫ్రికా, ఎల్బ్రస్ (5,642 మీటర్లు)– యూరప్, విన్సాన్ మాసిఫ్ (4,892 మీటర్లు)– అంటార్కిటికా, కోస్కియుజ్కో (2,228 మీటర్లు) – ఆస్ట్రేలియా. పులకిత సాధించిన పతకాలు; కిలిమంజారో నేషనల్ పార్క్ వద్ద పులకిత -
శభాష్ యశ్వంత్.. చరిత్ర సృష్టించాడు
మరిపెడ రూరల్: విస్పష్టమైన లక్ష్యం ముందుంటే దేన్నైనా సాధించొచ్చని నిరూపించాడు రాష్ట్రానికి చెందిన గిరిజన యువకుడు యశ్వంత్. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం (5,895మీ.) కిలిమంజారోను అధిరోహించాడు. శిఖరాగ్రంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన భూక్యా రామ్మూర్తి, జ్యోతి దంపతుల చిన్న కుమారుడు యశ్వంత్ హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని ఎన్డీసీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రాక్ క్లైంబింగ్ అంటే ఆసక్తి. ఈ క్రమంలోనే ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికయ్యాడు. ఈ నెల 21న పర్వతారోహణ యాత్రను ప్రారంభించి ఆగస్టు 26న శిఖరాగ్రానికి చేరుకుని త్రివర్ణపతాకాన్ని ఎగురవేశాడు. చదవండి: శ్మశానంలో ‘డాక్టర్’ చదువు -
Kilimanjaro: తల్లి.. తనయుడు.. కిలిమంజారో
కొడుక్కు14 ఏళ్లు. తల్లికి 35 లోపే. ‘కిలిమంజారో అధిరోహిద్దామా అమ్మా’ అని కొడుకు అంటే ‘అలాగే నాన్నా’ అని తల్లి సమాధానం ఇచ్చింది. అలా ఏ కొడుకూ తల్లీ కలిసి కిలిమంజారోకు హలో చెప్పింది లేదు. దుబాయ్‌లో స్థిరపడ్డ శోభ తన కొడుకుతో కలిసి సాధించిన రికార్డు అది. పిల్లలను మార్కెట్‌కు పంపడానికి భయపడే ఈ రోజుల్లో కొత్త ప్రపంచాలకు చూపు తెరిచే సాహసాలు చేయడం స్త్రీలు సాధ్యం చేస్తున్నారు. సాధారణంగా తల్లీకుమారులు కలిసి సాయంత్రం కూరగాయలు కొనడానికి వెళుతుంటారు. ఐస్‌క్రీమ్ తినడానికి. లేదంటే ఒక లాంగ్ డ్రైవ్. పిక్నిక్. కాని దుబాయ్‌లో స్థిరపడ్డ్డ బెంగాలి కుటుంబం శోభ మహలొనోబిస్, ఆమె కొడుకు శాశ్వత్ మహలొనోబిస్ మాత్రం అలా ఏదైనా కొండెక్కి దిగుదామా అనుకుంటారు. శోభ భర్త శుభోజిత్ ఇందుకు తన వంతు ప్రోత్సాహం అందిస్తుంటాడు. విదేశాలలో ఉన్న భారతీయులు సాధించే విజయాలు కొన్ని ఇక్కడ ప్రచారం పొందడం లేదు. కాని జూలై రెండో వారంలో ప్రపంచంలో అతి ఎత్తయిన పర్వతాలలో ఒకటైన కిలిమంజారోను అధిరోహించిన తొలి తల్లీకొడుకుల జంటగా శోభ, శాశ్వత్ రికార్డు స్థాపించారు. బహుశా కిలిమంజారోను అధిరోహించిన అతి చిన్న వయస్కుడైన భారతీయుడిగా కూడా శాశ్వత్ రికార్డు నమోదు చేసి ఉండవచ్చు. శోభ, కుమారుడు శాశ్వత్‌తో శోభ భళాభళిమంజారో అఫ్రికాఖండంలో అతి ఎత్తయిన పర్వతంగా ఖ్యాతి గడించిన కిలిమంజారో టాంజానియాలో ఉంది. సముద్రమట్టం నుంచి దీని ఎత్తు 19,341 అడుగులు. ఏదైనా పర్వతాల వరుసలో కాకుండా ఏకైక పర్వతంగా (సింగిల్ ఫ్రీ స్టాండింగ్) నిలవడం దీని విశిష్టత. ఇది అగ్నిపర్వతం. అంతేనా? మైనస్ 7 నుంచి 16 డిగ్రీల వరకూ ఉండే తీవ్రమైన శీతల ఉష్ణోగత, మంచుపొరలు, కఠినమైన శిలలు, ప్రచండ గాలులు... దీనిని అధిరోహించడం పెద్ద సవాలు. ఈ సవాలును స్వీకరించడంలోనే పర్వతారోహకులకు కిక్ ఉంటుంది. ప్రాణాలకు తెగించైనా సరే అనే తెగింపు ఉంటుంది. అలాంటి తెగింపును చూపారు శోభ, శాశ్వత్. కొడుకు కోసం దుబాయ్‌లోని జెమ్స్ మోడ్రన్ అకాడెమీలో చదువుకుంటున్న 14 ఏళ్ల శాశ్వత్ చదువులో చాలా బ్రిలియంట్. ఇప్పటికే అతడు ‘పైథాన్’ లాంగ్వేజ్‌లో స్పెషలిస్ట్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో 14 సర్టిఫికెట్లు పొందాడు. కోవిడ్ కాలంలో ఊరికే ఉండక చాలామందికి పైథాన్ నేర్పించాడు. గిటార్ కూడా వాయిస్తాడతడు. అంతే కాదు బయట తిరగడం కూడా అతడి హాబీ. ‘మావాడు ఇంట్లో ఉండడు. ఎక్కడికైనా తిరగాలంటాడు. వాడి ట్రెక్కింగ్‌లో భాగంగా నేను కూడా వెళ్లేదాన్ని. నేను వాడితో పాటు కొండలెక్కుతుంటే మా అమ్మ కూడా భలే ఎక్కుతోంది అన్నట్టుగా గర్వంగా చూసేవాడు. వాడు నా నుంచి ఇన్‌స్పయిర్ అవుతున్నాడని అనిపించింది. వాడు కిలిమంజారో ఎక్కుదామని అన్నప్పుడు వాడికి తోడుగా నేను కూడా ఉండాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది శోభ. కఠోర శిక్షణ తీసుకుని కాని ఇది చిన్నా చితక వ్యవహారం కాదని వాళ్లిద్దరికీ తెలుసు. అందుకే కఠోర శిక్షణ మొదలెట్టారు. ముందుగా దుబాయ్ చుట్టుపక్కల ఉండే కొండలను ట్రయినర్స్ సహాయంతో ఎక్కడం నేర్చుకున్నారు. భుజాలకు పది పది కేజీలు ఉన్న బ్యాగ్‌లు కట్టుకుని, వాటిలో పర్వతారోహణ సామాగ్రిని మోస్తూ సాధన చేశారు. ‘వారంలో నాలుగురోజులు మేము కొండలెక్కడం దిగడం సాధన చేశాం. ఇవి కాకుండా ఇద్దరం కలిసి రోజూ ఐదు కిలోమీటర్లు నడిచేవాళ్లం. శాశ్వత్ అది చాలదన్నట్టు ట్రెడ్మిల్ మీద తిరిగి నడిచేవాడు’ అంది శోభ. ‘కిలిమంజారో ఎక్కడానికి అవసరమైన శారీరక, మానసిక దృఢత్వం మాకు వచ్చింది అనుకున్నాకే మేము అధిరోహణకు బయలుదేరాం’ అని శాశ్వత్ అన్నాడు. ఆరు రోజులలో టాంజానియాలో కిలిమంజారో నుంచి జూలై 4న ఈ తల్లీకొడుకుల ఆరోహణ మొదలైంది. ‘మొదటి రోజు మేము 10 గంటల పాటు అధిరోహించాము. కాని నా పని అయిపోయిందని అనిపించింది. ఇక చాలు వెనక్కు వెళ్లిపోదాం అనుకున్నాను. కాని అమ్మ నాకు ధైర్యం చెప్పి ముందుకు తీసుకువెళ్లింది. జూలై 9న మేము శిఖరాన్ని అధిరోహించాము. మధ్యలో అమ్మ డీలా పడితే నేను ధైర్యం చెప్పాను. మేము ఇద్దరం ఒకరికి ఒకరం విశ్వాసం కల్పించుకుంటూ ముందుకు సాగాం. శిఖరం ఎక్కే రోజున ఏకధాటిగా 14 గంటలు ఎక్కుతూనే ఉన్నాం. అంత శ్రమ పడి పైకి ఎక్కిన తర్వాత అక్కడ కనిపించే ప్రకృతి దృశ్యం వర్ణనాతీతం అనిపించింది. అది ఒక అద్భుతం’ అని శాశ్వత్ అన్నాడు. ఈ విజయం తర్వాత ఈ తల్లీకుమారులు ఎవరెస్ట్ మీద తమ గురి నిలిపారు. ‘మేము ముందే అనుకున్నాం... ఈ అధిరోహణ విజయవంతమైతే ఎవరెస్ట్‌ను తాకాలని. బహుశా వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో మేము ఆ పని చేస్తాం’ అని శోభ అంది. సాహసాలు, ప్రకృతి దర్శనం మానవ ప్రవృత్తిని ఉన్నతీకరిస్తుంది. ఆ మేరకు చిన్న వయసులోనే తల్లిని తోడు చేసుకుని అంత పెద్ద పర్వతం అధిరోహించిన శాశ్వత్ మున్ముందు ఎన్నోసార్లు ఘనవిజయాలతో మనల్ని తప్పక కలుస్తాడు. -
అరుదైన ఘనత సాధించిన మరో గిరిపుత్రిక
అతి చిన్న వయసులోనే ఎవరెస్టును అధిరోహించి రికార్డు సృష్టించింది మాలోత్ పూర్ణ. ఆమె బాటలోనే మరో గిరిజన యువతి పర్వతారోహణలో అవార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. పూర్ణనే తనకు ఆదర్శం అని చెబుతున్న మాలోత్ రజిత ఇటీవలే కిలిమంజరో పర్వతాన్ని సునాయసంగా అధిరోహించి భారత జాతీయ జెండాను ఎగురవేసింది. ఇప్పుడు ఎవరెస్టు ఎక్కడానికి సిద్ధమైంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో మారుమూలన ఉన్న సంగ్యానాయక్ తండాకు చెందిన మాలోత్ రజిత మెదక్ జిల్లాలోని కొల్చారం గురుకుల డిగ్రీ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. చిన్ననాటి నుంచి ఆటల్లో ముందున్న రజిత డిగ్రీలో చేరిన తరువాత పర్వతారోహణలతో రికార్డు సృష్టించిన పూర్ణ విజయగాధను చూసి తను కూడా ఆమె అంత ఎత్తుకు ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగానే గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ 60 మందిని ఎంపిక చేశారు. అందులో రజిత ఒకరు. భువనగిరిలో శిక్షణ ఇప్పించారు. అరవై మందిలో 16 మందిని ఎంపిక చేసి జమ్ము కాశ్మీర్‌లోని సిల్క్రూట్పాస్ (కార్దుంగ్లా)కు తీసుకువెళ్లి శిక్షణ ఇచ్చారు. అందులో నుంచి రజితతో పాటు లక్ష్మి అనే యువతినీ ఎంపిక చేశారు. ఇద్దరినీ గత జనవరి నెలలో టాంజానియాకు తీసుకువెళ్లారు. జనవరి 19న కిలిమంజారో పర్వతం ఎక్కడం మొదలై 23 కు పూర్తి చేశారు. 5,895 మీట్ల ఎత్తుకు ఎక్కి భారత పతాకాన్ని ఎగురవేశారు. వ్యవసాయ కుటుంబం సంగ్యానాయక్ తండాకు చెందిన మాలోత్ కుబియా–జీరి దంపతుల కుమార్తె రజిత ఐదో తరగతి వరకు ఎక్కపల్లితండా ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఎల్లారెడ్డిలోని కస్తూరిబా విద్యాలయంలో, ఇంటర్ మెదక్‌లోని ఓ ప్రై వేటు కాలేజీలో చదువుకుంది. ప్రస్తుతం మెదక్ జిల్లా కొల్చారంలోని గురుకుల కళాశాలలో బీఎస్సీ బీజడ్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా రజిత తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. వారికి నలుగురు కుమారులు కాగా వారంతా వ్యవసాయంలోనే ఉన్నారు. రజిత ఒక్కతే చదువుకుంటోంది. పాఠశాల స్థాయి నుంచే రజిత ఆటల్లో ముందువరుసలో ఉండేది. కబడ్డీతో పాటు రన్నింగ్‌లోనూ దూకుడుగా ముందుకు సాగేది. రాష్ట్ర స్థాయిలో పది కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొని అవార్డులు పొందింది. ఏడు పర్వతాల అధిరోహణ కల పూర్ణ ఎవరెస్టు ఎక్కిన తరువాత తనకు కూడా పర్వతాలు అధిరోహించాలన్న కోరిక బలంగా కలిగిందని రజిత చెబుతోంది. గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీన్‌కుమార్ ప్రోత్సాహంతో తాను కిలిమంజరో పర్వతాన్ని అధిరోహించింది. అలాగే తన కుటుంబ సభ్యులతో పాటు కొల్చారం గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మాలతీదేవీలు ప్రోత్సహించారని పేర్కొన్నారు. రాబోయే సెలవుల్లో ఎవరెస్టు పర్వతం ఎక్కడానికి సిద్ధమవుతున్నట్టు పేర్కొంది. ఏడు పర్వతాలు అదిరోహించడమే తన లక్ష్యమని చెబుతోంది. క్రీడాకారులను తయారు చేస్తా ఏడు పర్వతాలు అధిరోహించిన తరువాత బీపీఈడీ పూర్తి చేస్తా. పీఈటీగా ఉద్యోగం చేయడంతో పాటు క్రీడాకారులను తయారు చేయడానికి స్పోర్ట్స్ స్కూల్ నడపాలన్నది నా కోరిక. లక్ష్య సాధనలో ఎలాంటి ఒత్తిడి, కష్టాలు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు నడుస్తా. స్వేరోస్ కమిటీ, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ల సహకారం మరువలేనిది. కష్టమైన పని కావడం వల్ల అమ్మ వద్దంటున్నా నాన్న, అన్నలు ప్రోత్సహిస్తున్నారు. వారందరి ప్రోత్సాహంతో ఎవరెస్టునూ అధిరోహిస్తా. – మాలోత్ రజిత, పర్వతారోహిణి -
భళా అనిపించిన సాహస 'జ్యోతి'
సాక్షి, దుబ్బాక(సిద్దిపేట) : కృషి..పట్టుదల ఉంటే అసాధ్యాన్ని..సుసాధ్యం చేయడం పెద్దగా లెక్కకాదు. అని నిరూపించింది వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతి. రాష్ట్రంలోనే కిలిమాంజారోని పర్వత శ్రేణిని అధిరోహించిన మొదటి మహిళా ఉద్యోగిణిగి నిలిచింది. అత్యంతం కష్టమైనదక్షిణ ఆఫ్రికా ఖండంలోని టాంజానీయా దేశంలో ఉన్న కిలిమంజారో పర్వతాలను అధిరోహించి దేశం ఖ్యాతిని చాటింది. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు కలిగిన పర్వత శ్రేణి కిలీమాంజారో పర్వతాలు. సముద్రమట్టానికి 5895మీటర్ల ఎత్తులో ఉంది. ఎన్నో శారీరిక, మానసికి సమస్యలను తట్టుకుని ధృడ సంకల్పంతో పర్వతాన్ని అధిరోహించడం ఓ అద్భుత సాహసం. 2017 డిసెంబర్ 22 న పర్వతారోహణ ప్రారంభించిన జ్యోతి కఠిన పరిస్థితుల్లోను ముందుగా మందార, హురంభో, కిబో పర్వతాలను రెండు రోజుల్లో అధిరోహించింది.25 న అత్యంత క్షిష్టమైన గిల్మస్, స్టెల్లా,హురు పర్వత శిఖరాలను అధిరోహించి కిలీమంజారో యాత్రను విజయవంతం చేసింది. కిలీమంజారోను అధిరోహించిన మొట్టమొదటి మహిళా ప్రభుత్వ ఉద్యోగిగా జ్యోతి నిలిచింది. అంత ఎత్తులో ఎత్తులో భారత జాతీయ పతాకాన్ని, తెలంగాణ చిత్ర పటం, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిల చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించింది. పీఈటీ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో.. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలో నాయీబ్రాహ్మణ కుటుంబం ఏల్దీ గంగయ్య పద్మ దంపతులకు కూతురు జ్యోతి. పేదకుటుంబంకావడంతో తల్లిదండ్రులకు అండగా ఉంటూ చదువుకుంటూ బడిలో పీఈటీ ఏర్వ అశోక్ ప్రోత్సాహంతో క్రీడల్లో రాణించింది. 2012 డీయస్సీలో మంచి ర్యాంక్ సాధించి వ్యాయామ ఉపాధ్యాయురాలుగా నియమితురలైంది. ప్రస్తుతం జ్యోతి దుబ్బాక మండలంలోని చిట్టాపూర్ హైస్కూల్లో పీఈటీగా సేవలందిస్తుంది. -
టాంజానియా నైసర్గిక స్వరూపం
ప్రపంచ వీక్షణం వైశాల్యం: 9,47,303 చదరపు కిలోమీటర్లు, జనాభా: 4,75,000,000 (తాజా అంచనాల ప్రకారం), రాజధాని: డొడొమా, ప్రభుత్వం: యూనిటరీ ప్రెసిడెన్షియల్ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్, భాషలు: స్వాహిలీ, ఇంగ్లిష్, కరెన్సీ: టాంజానియా షిల్లింగ్, మతాలు: క్రైస్తవులు 40%, ముస్లిములు 23%, హిందువులు 2%, ట్రైబల్ తెగలు 23%. వాతావరణం: వేడి, ఉక్కపోత వాతావరణం-19-31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, స్వాతంత్య్రం: 1961, డిసెంబర్ 9 పంటలు: మొక్కజొన్న, పత్తి, కాఫీ, సిసల్, లవంగాలు, కొబ్బరి, పొగాకు, కసావా, పరిశ్రమలు: వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, దుస్తులు, సిమెంటు, చమురు శుద్ధి, ఎగుమతులు: పత్తి, కాఫీ, లవంగాలు, కొబ్బరి ఉత్పత్తులు, వజ్రాలు, సిసర్, సరిహద్దులు: కెన్యా, ఉగండా, రువాండా, బురుండి, కాంగో, జాంబియా, మలావి, మొజాంబిక్, హిందూమహాసముద్రం. చరిత్ర: జర్మనీ రాజులు క్రీ.శ. 1880లో టాంజానియాను ఆక్రమించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. 1964 వరకు బ్రిటిష్ వాళ్లే ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అప్పటికి ఈ ప్రాంతం పేరు టాంగన్యికా. దీనికే జాంజిబార్ అనే పేరు కూడా ఉండేది. 800 కిలోమీటర్ల హిందూ మహాసముద్ర తీరం పామాయిల్ చెట్లతో నిండి ఉంటుంది. విక్టోరియా, టాంగాన్యికా, మలావి, రుక్వా, ఇయాసీ, నాట్రాన్... సరస్సులు దేశంలో నెలవై ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అద్భుతమైన కొండలు ఈ దేశంలో ఉన్నాయి. వీటిని కిలిమంజారో కొండలు అంటారు. ప్రపంచంలోనే పొడవైన నది నైలు, దానితోపాటు జైరే నదులు ఈ దేశంలో పారుతున్నాయి. అలాగే అతిపెద్ద అగ్ని పర్వతం బద్దలైన పెద్దగొయ్యి కూడా ఈ దేశంలోనే ఉన్నాయి. విక్టోరియా సరస్సు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరస్సు. 12వ శతాబ్దంలో ఇక్కడ బానిసల వ్యాపారం జరిగేదని చరిత్ర చెబుతోంది. అరబ్బులు తమ పనులకోసం ఈ ప్రాంతం నుండే బానిసలను కొనుక్కొని వెళ్లేవారు. దేశంలో వందల, వేల సంవత్సరాల చారిత్రక ఆధారాలు ఎన్నెన్నో ఈ దేశంలో బయటపడ్డాయి. పరిపాలనా పద్ధతులు: పరిపాలనా పరంగా దేశాన్ని మొత్తం 30 రీజియన్లు గా విభజించారు. 25 రీజియన్లు దేశంలో ఉండగా మిగిలిన ఐదు హిందూమహాసముద్రంలో ఉన్న జాంజిబార్ దీవిలో ఉన్నాయి. ఈ రీజియన్లను 169 జిల్లాలుగా విభజించారు. దేశం మొత్తానికి రాష్ట్రపతి ఉంటాడు. అలాగే జాతీయ శాసనసభ కూడా ఉంటుంది. ప్రధానమంత్రి కూడా ఉంటాడు. దేశంలో బాగా జనాభా కలిగిన నగరాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి- ఒకప్పటి రాజధాని నగరం దార్ ఎస్ సలామ్, ప్రస్తుత రాజధాని డొడొమా, ఇంకా ఆరుష, గీటా, బుకోబా, కిగోమా, మోషి, బబాటె, ముసోమా, ఎంబేయా, మొరోగోరో, మౌంట్వవారా, ఎంవాంజా, కిబాహ, సుంబవంగ, సోంగియా, షిన్యాంగా, బరియాది, సింగిడా, తబోరా, టాంగా, జాంజిబార్ సిటీ మొదలైనవి. ప్రజలు-సంస్కృతి-సంప్రదాయాలు: దేశజనాభాలో 95 శాతం ప్రజలు బాంటు మూలం కలిగిన వారే. అయితే దేశం మొత్తంలో 126 తెగల ప్రజలు ఉన్నారు. వీటిలో సుకుమ తెగ అత్యధిక జనాభా కలిగి ఉంది. వీరు ఉత్తరాన ఉన్న విక్టోరియా సరస్సు ప్రాంతంలో ఉంటారు. ప్రజల్లో అధికభాగం వ్యవసాయం చేస్తారు. హద్జాపి అనే తెగవాళ్ళు కేవలం వేటాడి జీవనం కొనసాగిస్తారు. మసాయి తెగవాళ్లు ఎక్కువగా జంతుపోషణ చేస్తారు. ఏ కుటుంబంలో జంతువులు అధికంగా ఉంటే ఆ కుటుంబం గొప్పది అని భావిస్తారు. 50 శాతం మంది పిల్లలు పాఠశాలలకు వెళతారు. ప్రజలు స్వాహిలి, ఇంగ్లిష్ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. అయితే అనేక తెగలు ఉన్నందున వారివారి స్వీయ భాషలు ఉన్నాయి. ఇలాంటివి 100కు పైగా భాషలు ఉన్నాయి. మహిళలు స్కర్టులు, నైటీలాంటి దుస్తులు ధరిస్తారు. తలకు రుమాలు చుట్టుకుంటారు. ఎక్కువగా వ్యవసాయపనులు చేస్తారు. పురుషులు ప్యాంటు, షర్టు ధరిస్తారు. టాంజానియా ప్రజలు కొబ్బరిపాలు ఎక్కువగా తాగుతారు. వరి అన్నం, ఉగాలి, చపాతి తింటారు. చూడదగిన ప్రదేశాలు 1. రాతినగరం: ఈ రాతి నగరం జాంజిబార్ ద్వీపంలో ఉంది. పూర్వకాలంలో అరేబియన్లు ఇక్కడ నిర్మించుకున్న చిన్న చిన్న ఇళ్ళు, ఇరుకైన సందులు ఈ నగరానికి ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. దాదాపు అన్ని ఇళ్లను రాళ్ళతోనే నిర్మించారు. ఈ ఇళ్ళను 19వ శతాబ్దంలో కట్టారు. ఆ కాలం లో హిందూమహా సముద్రంలో స్వాహిలి తెగవాళ్ళు ఇక్కడి నుండే వ్యాపారం చేసేవారు. దాంతో ఇది అప్పట్లో స్వాహిలి నగరంగా పేరుగాంచింది. ఆ కాలంనాటి కట్టడాలు నేటికీ సురక్షితంగా ఉన్నాయి. కొన్ని భవనాలు నేడు మ్యూజియంలుగా మారి ఉన్నాయి. ఈ నగరంలో రెండు పురాతన చర్చిలు కూడా ఉన్నాయి. క్రీక్ వీధిలో నడుస్తుంటే రెండువైపులా రాతి ఇళ్ళు సహజరూపంలో కనిపిస్తాయి. ఈ నగరంలో సెంట్రల్ దరజాని మార్కెట్, బీట్ఎల్ అమని, సిటీహల్, ఆంగ్లికన్ కాథడ్రల్, ఫోరోధూని గార్డెన్లు, పీపుల్స్ పాలెస్, ఓల్డ్ ఫోర్ట్, పర్షియన్బాత్ ఇలా ఎన్నో అద్భుత కట్టడాలను చూడవచ్చు. 2. దార్ ఎస్ సలామ్: ఈ నగరం ఒకప్పుడు చేపలు పట్టి జీవించే బెస్తవారి పల్లెటూరు. ఇప్పుడు టాంజానియా దేశానికి రాజధానిగా మారిపోయింది. ప్రపంచంలోని చాలా దేశాలకు నేడు ఈ నగరం సముద్ర మార్గ ప్రదేశంగా ఉంది. ఆఫ్రికా ఖండంలో ఎంతో బిజీగా ఉండే ఓడరేవు ఇక్కడే ఉంది. మొత్తం దేశంలో ఈ నగరమే అతిపెద్దది. ఇక్కడ జనాభా 43 లక్షలపైగా ఉంది. ఓడరేవు చుట్టూ ఉండే నగరం పాతనగరం. నగరానికి ఉత్తరం వైపున వివిధ దేశాల ఎంబసీలు, ప్రభుత్వ కార్యాలయాలు నెలకొని ఉన్నాయి. ఈ నగరం ఒక పెద్ద వ్యాపార కేంద్రం కావడం వల్ల అనేక దేశాల నుండి ఇక్కడికి వ్యాపారం కోసం ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. దాంతో ఈ నగరంలో ఉన్న విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ నగరానికి పూర్వపు పేరు ఎంజిజిమా, నగరంలో ఉన్న 35 అంతస్తుల రెండు భవనాలు గొప్ప ఆకర్షణగా కనిపిస్తాయి. ఇవి జంట టవర్లుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ నగరంలో అయిదు మ్యూజియంలు ఉన్నాయి. వీటిల్లో విలేజి మ్యూజియం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ 16 తెగలకు చెందిన పూరి గుడిసె నివాసాలు ఉన్నాయి. హిందూమహా సముద్రతీరంలో ఉన్న కారణంగా సముద్రతీరం బీచ్‌లు ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ. ఎంససాని, కిగంబోని బీచ్‌లు చూడదగ్గవి. ఈ నగరంలో ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 3 . కిలిమంజారో పర్వతం: టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో పర్వతం ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. ఈ పర్వతాన్ని సంవత్సరంలో ఏ రోజైనా ఎక్కవచ్చు. ఇక్కడ వాతావరణం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. కిలిమంజారో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ పర్వతం ఒక మిలియన్ సంవత్సరాల క్రితం ఉప్పొంగిన అగ్నిపర్వతం కారణంగా ఏర్పడింది. ఈ పర్వతం మూడంచెలుగా ఉంటుంది. మొదటి భాగాన్ని షీరా అని, రెండోదాన్ని కీబో అని, మూడోదాన్ని మావెంజి అంటారు. అత్యధిక ఎత్తై ప్రదేశాన్ని ఉహురు శిఖరం అంటారు. ఈ ప్రాంతమంతా కిలిమంజారో జాతీయ పార్కుగా అభివృద్ధి చేయబడి ఉంది. ఇక్కడ అడవిదున్నలు, చిరుతలు, కోతులు, ఏనుగులు, ఇంకా ఎన్నో రకాల పక్షులు మనకు దర్శనమిస్తాయి. రాజధాని దార్ఎస్సలామ్ నుండి నేరుగా కిలిమంజారో వెళ్ళవచ్చు. 4. ఎన్ గొరొంగోరో సంరక్షణా ప్రాంతం: ఇది సెరంగేటి పర్వతం మరియు మాన్యారా సరస్సు మధ్య ప్రాంతంలో ఉంది. ఇది ఎన్గోరొంగోరో క్రేటర్‌కు ప్రసిద్ధి. ఇక్కడ వన్యప్రాణులు అత్యధికం. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలై ఏర్పడిన గొయ్యి చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ సంవత్సరం పొడవునా నీరు ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఓల్డువాయి జార్జ్ అనే ప్రాంతం ఒక పురాతత్వ ప్రదేశం. ఇక్కడ మానవ పరిణామంలో మొదటి మానవుడిగా చెప్పబడే పుర్రె, ఇతర శరీర ఎముకలు ఉన్నాయి. ఎన్ గొరొంగోరో గొయ్యి ప్రపంచంలోనే పెద్ద గొయ్యి, ఇది దాదాపు మూడు మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ ప్రాంతంలో పులులు, సింహాలు ఇతర జంతువులను వేటాడడం మనం ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఇక్కడే దాదాపు ఒకటిన్నర మిలియన్ సంవత్సరాల క్రితం ఆదిమానవులు ఉపయోగించిన ఆయుధాలు ఉన్నాయి. ఇలాంటి వాటిఆధారంగానే శాస్త్రవేత్తలు మానవుడు 2 మిలియన్ సంవత్సరాల క్రితమే ఉన్నాడని నిర్ధారణ చేయగలిగారు. ప్రకృతి-పర్యావరణం: టాంజానియా దేశంలో మొత్తం 16 జాతీయ పార్కులు ఉన్నాయి. ఇవేకాకుండా ఎన్గోరోంగోరో కన్సర్వేషన్ ప్రాంతం, గోంబే స్ట్రీమ్ జాతీయపార్కులు ఉన్నాయి. ఈ పార్కులలో 130 రకాల ఉభయచరాలు, 275 రకాల పాములు ఉన్నాయి. ఎన్నో రకాల అడవి జంతువులు ఈ దేశంలో ఉన్నాయి.