
ఇసుక రవాణా వాహనాలు సీజ్
వరంగల్: ఇసుక అక్రమ రవాణా పై పోలీసులు పంజా విసిరారు. వరంగల్ జిల్లా మరిపెడ మండలంలో ఇసుకని అక్రమంగా రవాణా చేసే వాహనాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు.
మండలంలోని రామాపురం గ్రామంలో ఆకేరువాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలు, ఓ జేసీబీని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.