
చిత్తూరు, సాక్షి: సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి కోపమొచ్చింది. తమ అభిమాన నటుడి సినిమా ప్రదర్శించకుండా అధికారులు ఓ థియేటర్‌ను సీజ్ చేయడంపై రగిలిపోతున్నారు.
స్థానికంగా ఓ నేతకు చెందిన రెండు థియేటర్లలో పుష్ప 2 చిత్రం ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఎన్‌వోసీ సర్టిఫికెట్ లేకుండా సినిమా ప్రదర్శిస్తున్నారంటూ అధికారులు షోలను అర్ధాంతరంగా నిలిపివేయించి మరీ తాళాలు వేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా థియేటర్ రన్ చేస్తున్నారని అధికారులు చెబుతుండగా.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమై ఉండొచ్చంటూ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మరోవైపు వారాంతం కావడంతో కొత్త సినిమా చూద్దామని థియేటర్‌కు వస్తున్న ప్రేక్షకులు.. గేటుకు తాళాలు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్.. రాజకీయ సెగ!
Comments
Please login to add a commentAdd a comment