వరంగల్ : వరంగల్ జిల్లా మరిపెడ మండలం నీలికుర్తి స్టేజి సమీపంలో ఓ వృద్ధుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నీలికుర్తి పంచాయతీ భజనతండాకు చెందిన బానోతు హనుమ (70) గా స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.