వారాహి అమ్మవారి నేపథ్యంతో... | Hero Sumanth New Movie VAARAAHI shooting starts | Sakshi
Sakshi News home page

వారాహి అమ్మవారి నేపథ్యంతో...

Published Tue, Nov 15 2022 3:50 AM | Last Updated on Tue, Nov 15 2022 3:50 AM

Hero Sumanth New Movie VAARAAHI shooting starts - Sakshi

సంతోష్, వీవీ వినాయక్, సుమంత్, రమాదేవి

‘సుబ్రహ్మణ్యపురం’ వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో సుమంత్, దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి కాంబినేషన్‌లో ‘వారాహి’ మూవీ షురూ అయింది. జీకే మూవీ మేకర్స్‌ పతాకంపై రమాదేవి నారగాని నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు. సంతోష్‌ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘ఏడుగురు దేవతామూర్తుల్లో వారాహి అమ్మవారు ఒకరు.

వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మవారి ఆలయ నేపథ్యంలో డిఓషనల్‌ మిస్టీరియస్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. సుమంత్‌ మాట్లాడుతూ– ‘‘సంతోష్‌ ఈ కథ చెప్పగానే చప్పట్లు కొట్టాను. మా కాంబినేషన్‌లో వచ్చిన ‘సుబ్రహ్మణ్యపురం’ కంటే చాలా మంచి స్క్రిప్ట్‌ ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్‌ చంద్, సహనిర్మాత: కేఆర్‌ ప్రదీప్‌.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement