ప్రపంచ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌కు జట్ల ఎంపిక
జింఖానా, న్యూస్‌లైన్: ప్రపంచ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత్ మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రమాదేవి సార థ్యం వ హించనుంది. పురుషుల జట్టుకు గోవిందరాజన్ (పాండిచ్చేరి) నాయకత్వం వహించనున్నాడు.
ఈ పోటీలు దక్షిణాఫ్రికాలోని సెదిబెంగ్‌లో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం భారత టెన్నికాయిట్ సమాఖ్య అధ్యక్షుడు రామమూర్తి, కార్యనిర్వహక అధ్యక్షుడు సితాని జట్లకు కిట్లను అందజేశారు. మేనేజర్లుగా జువెల్ వాస్రా, లక్ష్మీకాంత్, కోచ్‌గా విశ్వనాథం బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
పురుషుల జట్టు: గోవిందరాజన్ (పాండిచ్చేరి), మరియప్పన్ (కర్ణాటక), సంతోష్ కుమార్ (కేరళ), అన్ను ప్రకాశ్ (కేరళ), సోర్నవేల్ (కర్ణాటక), రాకేష్ (ఆంధ్రప్రదేశ్), జేసుదాస్ (తమిళనాడు).
మహిళల జట్టు: రమాదేవి (ఆంధ్రప్రదేశ్), చందన (కేరళ), అమృత (కేరళ), రేణుక (మహారాష్ట్ర), రేవతి (ఆంధ్రప్రదేశ్), కాయత్రి (తమిళనాడు).
భారత జట్టు కెప్టెన్‌గా రమాదేవి
Published Thu, Mar 27 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM
Advertisement
Advertisement