AFC
-
Football: అదరగొట్టిన సౌమ్య గుగులోత్.. భారత్ శుభారంభం
Women's Olympic Football Tournament Paris 2024- Asian Qualifiers బిష్కెక్: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ రౌండ్–1లో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘జి’లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ విశేషంగా రాణించింది. నిజామాబాద్ బిడ్డ నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య ఈ మ్యాచ్‌లో ఒక గోల్ చేయడంతోపాటు సహచరిణి అంజు తమాంగ్ రెండు గోల్స్ చేయడంలో సహాయం చేసింది. భారత జట్టుకు అంజు తమాంగ్ (6వ, 42వ ని.లో) రెండు గోల్స్ అందించగా... సౌమ్య గుగులోత్ (45+3వ ని.లో), షిల్కీ దేవి (61వ ని.లో), రేణు (63వ ని.లో) ఒక్కో గోల్ సాధించి పెట్టారు. శుక్రవారం కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుతోనే భారత్ రెండో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ‘జి’లోని మూడో జట్టు తుర్క్మెనిస్తాన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చదవండి: థండర్‌బోల్ట్.. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది! వీడియో వైరల్ అందుకే అక్షర్‌తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు! IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు -
‘ఫిఫా’ కౌన్సిల్ సభ్యుడిగా ప్రఫుల్ పటేల్
కౌలాలంపూర్: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘ఫిఫా’ కౌన్సిల్ మెంబర్‌గా ఆయన ఎంపికయ్యారు. భారత్‌నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా పటేల్ నిలిచారు. శనివారం జరిగిన ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) కాంగ్రెస్‌లో ప్రఫుల్‌కు సర్టిఫికెట్ అందజేసి ‘ఫిఫా’ అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫ్యాంటినో దీనిని అధికారికంగా ప్రకటించారు. కౌన్సిల్ మెంబర్ పదవి కోసం మొత్తం 46 ఓట్లలో పటేల్‌కు 38 ఓట్లు పడటం విశేషం. ఆయనతో పాటు మరో నలుగురు వచ్చే నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. మరో వైపు ఏఎఫ్సీ అధ్యక్షుడిగా షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. -
బెంగళూరు ఎఫ్‌సీ అరుదైన ఘనత
సింగపూర్: ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్స్ (ఎఎఫ్సీ) కప్‌లో బెంగళూరు ఎఫ్‌సీ సెమీస్ బెర్తును ఖరారు చేసుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్లబ్ కాంపిటేషన్‌లో భాగంగా రెండంచెల క్వార్టర్ ఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సీ 1-0 తో తంపినెస్ రోవర్స్(సింగపూర్)పై పైచేయి సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. తద్వారా ఎఎఫ్సీ కప్‌లో భారత్ నుంచి సెమీస్ కు చేరిన మూడో జట్టుగా బెంగళూరు గుర్తింపు సాధించింది. ఇరు జట్లు మధ్య బుధవారం జరిగిన ఫస్ట్ లెగ్ క్వార్టర్ ఫైనల్లో బెంగళూరు విజయం సాధించగా, సెకండ్ లెగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. దీంతో బెంగళూరు 1-0తో సెమీస్ కు చేరింది. గతేడాది రౌండ్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టిన బెంగళూరు.. ఈసారి మాత్రం అంచనాలు మించి రాణించింది. ఇప్పటివరకూ ఎఎఫ్సీ కప్‌లో మూడు భారత క్లబ్ జట్లు మాత్రమే సెమీస్ కు చేరాయి. గతంలో డెంపో(2008), ఈస్ట్ బెంగాల్(2013)లో మాత్రమే ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన జట్లుగా నిలిచాయి.