
కౌలాలంపూర్: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘ఫిఫా’ కౌన్సిల్ మెంబర్‌గా ఆయన ఎంపికయ్యారు. భారత్‌నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా పటేల్ నిలిచారు. శనివారం జరిగిన ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) కాంగ్రెస్‌లో ప్రఫుల్‌కు సర్టిఫికెట్ అందజేసి ‘ఫిఫా’ అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫ్యాంటినో దీనిని అధికారికంగా ప్రకటించారు. కౌన్సిల్ మెంబర్ పదవి కోసం మొత్తం 46 ఓట్లలో పటేల్‌కు 38 ఓట్లు పడటం విశేషం. ఆయనతో పాటు మరో నలుగురు వచ్చే నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. మరో వైపు ఏఎఫ్‌సీ అధ్యక్షుడిగా షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment