బెంగళూరు ఎఫ్సీ అరుదైన ఘనత
సింగపూర్: ఆసియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్స్ (ఎఎఫ్సీ) కప్లో బెంగళూరు ఎఫ్సీ సెమీస్ బెర్తును ఖరారు చేసుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్లబ్ కాంపిటేషన్లో భాగంగా రెండంచెల క్వార్టర్ ఫైనల్లో బెంగళూరు ఎఫ్సీ 1-0 తో తంపినెస్ రోవర్స్(సింగపూర్)పై పైచేయి సాధించి సెమీస్లోకి ప్రవేశించింది. తద్వారా ఎఎఫ్సీ కప్లో భారత్ నుంచి సెమీస్ కు చేరిన మూడో జట్టుగా బెంగళూరు గుర్తింపు సాధించింది.
ఇరు జట్లు మధ్య బుధవారం జరిగిన ఫస్ట్ లెగ్ క్వార్టర్ ఫైనల్లో బెంగళూరు విజయం సాధించగా, సెకండ్ లెగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ను డ్రాగా ముగించింది. దీంతో బెంగళూరు 1-0తో సెమీస్ కు చేరింది. గతేడాది రౌండ్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టిన బెంగళూరు.. ఈసారి మాత్రం అంచనాలు మించి రాణించింది. ఇప్పటివరకూ ఎఎఫ్సీ కప్లో మూడు భారత క్లబ్ జట్లు మాత్రమే సెమీస్ కు చేరాయి. గతంలో డెంపో(2008), ఈస్ట్ బెంగాల్(2013)లో మాత్రమే ఈ అరుదైన ఫీట్ను సాధించిన జట్లుగా నిలిచాయి.