అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాం: చంద్రబాబు
ఇప్పటికి ఇంకా నిర్మాణమే మొదలుకాని అమరావతి నగరంలో త్వరలోనే ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రజలు విజయవాడ పేరును బెజవాడగా మార్చాలని కోరితే ఆ అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు వీలైనంత త్వరగా యుటిలిటీ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సాధారణంగా ఇవ్వాల్సిన నిధులనే ఇచ్చింది తప్ప అదనపు నిధులేమీ ఇవ్వలేదని అన్నారు. ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నట్లు కూడా చంద్రబాబు తెలిపారు.