‘కొన్ని విజయాలు కూడా పరాజయాలే. కొన్ని పరాజయాలు కూడా విజయాలే’ నిజమే! ఆటలోని పరాజితులు లోకం దృష్టిగా పెద్దగా రారు. అయితే టానియా జెంగ్ పరిస్థితి వేరు. ఈ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణీ ప్రిలిమినరీ రౌండ్‌లోనే వైదొలగినా... ఆమె విజేతగానే వెలిగి΄ోయింది. దీనికి కారణం ఆమె వయసు. 58 సంవత్సరాల వయసులో తన ఒలింపిక్ కలను నిజం చేసుకున్న చైనీస్ – చిలీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి టానియా జెంగ్ సంచలనం సృష్టించింది....
తల్లి టేబుల్ టెన్నిస్ కోచ్ కావడంతో చిన్నప్పటి నుంచే ఆ ఆటపై జెంగ్‌కు ఆసక్తి ఏర్పడింది. బడిలో కంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కనిపించిందే ఎక్కువ. అక్కడ ఎంతోమందిప్రొఫెషనల్ ప్లేయర్స్‌తో మాట్లాడే అవకాశం దొరికింది.
వారితో మాట్లాడడం అంటే... ఆటల పాఠాలు నేర్చుకోవడమే!
తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి టేబుల్ టెన్నిస్‌లో జెంగ్‌కు తల్లి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. 11 ఏళ్ల వయసులో ఎలిట్ స్పోర్ట్స్ అకాడమీలో చేరింది జెంగ్. పన్నెండేళ్ల వయసులోప్రొఫెషనల్ ప్లేయర్ అయింది. నేషనల్ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుంది. పదహారు సంవత్సరాలకు చైనీస్ టేబుల్ టెన్నిస్ టీమ్‌లో చోటు సంపాదించింది. ప్రామిసింగ్ ప్లేయర్’గా పేరు తెచ్చుకుంది.
‘అంతా ఓకే’ అనుకొని ఉంటే జెంగ్ ప్రయాణం మరోలా ఉండేది. అయితే ఆ సమయంలో టేబుల్ టెన్నిస్‌కు సంబంధించి నిబంధనలు ఏవో మార్చడం జెంగ్‌కు చిరాకు తెప్పించింది. ఆ చిరాకు కోపంగా మారి తనకు ్రపాణసమానమైన టేబుల్ టెన్నిస్‌కు దూరం అయింది.
కొంత కాలం తరువాత...
తనకు అందిన ఆహ్వానం మేరకు చిలీలో స్కూల్ పిల్లల టేబుల్ టెన్నిస్ కోచ్‌గా కొత్త ప్రయాణం ్రపారంభించింది. జియాంగ్ జెంగ్ పేరు కాస్తా టానియా జెంగ్‌గా మారింది. ‘జెంగ్’ తాను పుట్టిపెరిగిన చైనా అస్తిత్వం. ‘టానియ’ తనకు ఎంతో ఇష్టమైన, కొత్త జీవితాన్ని ఇచ్చిన చిలీ అస్తిత్వం.
తన కుమారుడికి టేబుల్ టెన్నిస్‌లో కోచింగ్ ఇస్తున్న సమయంలో పోటీలలో పాల్గొనాలనే ఉత్సాహం జెంగ్‌లో మొదలైంది. 2004, 2005 నేషనల్ లెవల్ టోర్నమెంట్స్‌ను గెలుచుకుంది.
టేబుల్ టెన్నిస్‌లో చూపించే అద్భుత ప్రతిభాపాటవాలతో చిలీ మీడియా ఎట్రాక్షన్‌గా మారింది జెంగ్. ఆమె ఆట ఆడే తీరు చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్‌కు ఎంతో ఇష్టం.
ఎప్పటి నుంచో నేస్తంగా ఉన్న ‘విజయం’ ఒలింపిక్స్‌లో ముఖం చాటేసినా... జెంగ్ ముఖంలోని వెలుగు తగ్గలేదు. అదేపోరాట స్ఫూర్తి! కుమార్తెను ఒలింపిక్స్‌లో చూడాలనేది 92 సంవత్సరాల తండ్రి కల. ఆ కలను నిజం చేసి తండ్రి కళ్లలో వెలుగు నింపింది జెంగ్.
‘గో ఎట్ ఇట్, గో విత్ ఎవ్రీ థింగ్’ అంబరాన్ని అంటే సంతోషంతో అంటున్నాడు ఆ పెద్దాయన.
‘ఒలింపిక్ గ్రాండ్ మదర్’
‘కమ్ బ్యాక్ క్వీన్’... ఇలా రకరకాల కాప్షన్‌లతో జెంగ్ గురించి సోషల్ మీడియాలో గొప్పగాపోస్టులు పెడుతున్నారు నెటిజనులు.
‘ఒలింపిక్స్ అనేది నా జీవితకాల కల. క్వాలిఫై అవుతానని ఊహించలేదు. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. విరివిగా ఆటలు ఆడాలనే ఉత్సాహం పెరిగింది’ అంటుంది టానియ జెంగ్.
వివిధ ్రపాంతాలకు కుమారుడు ఒంటరిగాపోటీలకు వెళ్లే సమయానికి జెంగ్ టెన్నిస్ రాకెట్‌కు దూరం అయింది. సుదీర్ఘ విరామం తరువాత రీజినల్ టోర్నమెంట్స్ కోసం మళ్లీ రాకెట్ పట్టింది. మళ్లీ విజయపరంపర మొదలైంది. 2023 పాన్ అమెరికన్ గేమ్స్‌లో కాంస్యం గెలుచుకోవడంతో చిలీలో జెంగ్‌కు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. ఒలిపింక్స్ 2024కు క్వాలిఫై కావడంతో జెంగ్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment