Tania
-
Tania Zeng: జెంగ్ సైరన్
‘కొన్ని విజయాలు కూడా పరాజయాలే. కొన్ని పరాజయాలు కూడా విజయాలే’ నిజమే! ఆటలోని పరాజితులు లోకం దృష్టిగా పెద్దగా రారు. అయితే టానియా జెంగ్ పరిస్థితి వేరు. ఈ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణీ ప్రిలిమినరీ రౌండ్లోనే వైదొలగినా... ఆమె విజేతగానే వెలిగి΄ోయింది. దీనికి కారణం ఆమె వయసు. 58 సంవత్సరాల వయసులో తన ఒలింపిక్ కలను నిజం చేసుకున్న చైనీస్ – చిలీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి టానియా జెంగ్ సంచలనం సృష్టించింది....తల్లి టేబుల్ టెన్నిస్ కోచ్ కావడంతో చిన్నప్పటి నుంచే ఆ ఆటపై జెంగ్‌కు ఆసక్తి ఏర్పడింది. బడిలో కంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కనిపించిందే ఎక్కువ. అక్కడ ఎంతోమందిప్రొఫెషనల్ ప్లేయర్స్‌తో మాట్లాడే అవకాశం దొరికింది.వారితో మాట్లాడడం అంటే... ఆటల పాఠాలు నేర్చుకోవడమే!తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి టేబుల్ టెన్నిస్‌లో జెంగ్‌కు తల్లి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. 11 ఏళ్ల వయసులో ఎలిట్ స్పోర్ట్స్ అకాడమీలో చేరింది జెంగ్. పన్నెండేళ్ల వయసులోప్రొఫెషనల్ ప్లేయర్ అయింది. నేషనల్ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుంది. పదహారు సంవత్సరాలకు చైనీస్ టేబుల్ టెన్నిస్ టీమ్‌లో చోటు సంపాదించింది. ప్రామిసింగ్ ప్లేయర్’గా పేరు తెచ్చుకుంది.‘అంతా ఓకే’ అనుకొని ఉంటే జెంగ్ ప్రయాణం మరోలా ఉండేది. అయితే ఆ సమయంలో టేబుల్ టెన్నిస్‌కు సంబంధించి నిబంధనలు ఏవో మార్చడం జెంగ్‌కు చిరాకు తెప్పించింది. ఆ చిరాకు కోపంగా మారి తనకు ్రపాణసమానమైన టేబుల్ టెన్నిస్‌కు దూరం అయింది.కొంత కాలం తరువాత...తనకు అందిన ఆహ్వానం మేరకు చిలీలో స్కూల్ పిల్లల టేబుల్ టెన్నిస్ కోచ్‌గా కొత్త ప్రయాణం ్రపారంభించింది. జియాంగ్ జెంగ్ పేరు కాస్తా టానియా జెంగ్గా మారింది. ‘జెంగ్’ తాను పుట్టిపెరిగిన చైనా అస్తిత్వం. ‘టానియ’ తనకు ఎంతో ఇష్టమైన, కొత్త జీవితాన్ని ఇచ్చిన చిలీ అస్తిత్వం.తన కుమారుడికి టేబుల్ టెన్నిస్‌లో కోచింగ్ ఇస్తున్న సమయంలో పోటీలలో పాల్గొనాలనే ఉత్సాహం జెంగ్లో మొదలైంది. 2004, 2005 నేషనల్ లెవల్ టోర్నమెంట్స్‌ను గెలుచుకుంది.టేబుల్ టెన్నిస్‌లో చూపించే అద్భుత ప్రతిభాపాటవాలతో చిలీ మీడియా ఎట్రాక్షన్‌గా మారింది జెంగ్. ఆమె ఆట ఆడే తీరు చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్‌కు ఎంతో ఇష్టం.ఎప్పటి నుంచో నేస్తంగా ఉన్న ‘విజయం’ ఒలింపిక్స్‌లో ముఖం చాటేసినా... జెంగ్ ముఖంలోని వెలుగు తగ్గలేదు. అదేపోరాట స్ఫూర్తి! కుమార్తెను ఒలింపిక్స్‌లో చూడాలనేది 92 సంవత్సరాల తండ్రి కల. ఆ కలను నిజం చేసి తండ్రి కళ్లలో వెలుగు నింపింది జెంగ్.‘గో ఎట్ ఇట్, గో విత్ ఎవ్రీ థింగ్’ అంబరాన్ని అంటే సంతోషంతో అంటున్నాడు ఆ పెద్దాయన.‘ఒలింపిక్ గ్రాండ్ మదర్’‘కమ్ బ్యాక్ క్వీన్’... ఇలా రకరకాల కాప్షన్లతో జెంగ్ గురించి సోషల్ మీడియాలో గొప్పగాపోస్టులు పెడుతున్నారు నెటిజనులు.‘ఒలింపిక్స్ అనేది నా జీవితకాల కల. క్వాలిఫై అవుతానని ఊహించలేదు. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. విరివిగా ఆటలు ఆడాలనే ఉత్సాహం పెరిగింది’ అంటుంది టానియ జెంగ్.వివిధ ్రపాంతాలకు కుమారుడు ఒంటరిగాపోటీలకు వెళ్లే సమయానికి జెంగ్ టెన్నిస్ రాకెట్‌కు దూరం అయింది. సుదీర్ఘ విరామం తరువాత రీజినల్ టోర్నమెంట్స్ కోసం మళ్లీ రాకెట్ పట్టింది. మళ్లీ విజయపరంపర మొదలైంది. 2023 పాన్ అమెరికన్ గేమ్స్‌లో కాంస్యం గెలుచుకోవడంతో చిలీలో జెంగ్‌కు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. ఒలిపింక్స్ 2024కు క్వాలిఫై కావడంతో జెంగ్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. -
ఆశల పల్లకిలో...
అల్మాటీ (కజకిస్తాన్): ఈ ఏడాదిని చిరస్మరణీయంగా ముగించాలనే లక్ష్యంతో నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో 2019 ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్, 2012 కాంస్య పతక విజేత, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపితోపాటు ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, సవితా శ్రీ, పద్మిని రౌత్, దివ్యా దేశ్‌ముఖ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొదటి మూడు రోజులు ర్యాపిడ్ విభాగంలో, ఆ తర్వాత రెండు రోజులు బ్లిట్జ్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ర్యాపిడ్ టోర్నీని 11 రౌండ్లపాటు, బ్లిట్జ్ టోర్నీని 17 రౌండ్లపాటు నిర్వహిస్తారు. ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, హర్ష భరతకోటిలతోపాటు విదిత్ సంతోష్ గుజరాతి, సూర్యశేఖర గంగూలీ, నిహాల్ సరీన్, ఎస్ఎల్ నారాయణన్, అరవింద్ చిదంబరం, అభిమన్యు పురాణిక్, ఆధిబన్, రౌనక్ సాధ్వాని, శ్రీనాథ్ నారాయణన్, వి.ప్రణవ్, అర్జున్ కల్యాణ్, సంకల్ప్ గుప్తా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓపెన్ ర్యాపిడ్ టోర్నీని 13 రౌండ్లు, బ్లిట్జ్ టోర్నీని 21 రౌండ్లు నిర్వహిస్తారు. మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), 30 వేల డాలర్లు (రూ. 28 లక్షల 83 వేలు), 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా ఇస్తారు. ఓపెన్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 60 వేల డాలర్లు (రూ. 49 లక్షల 67 వేలు), 50 వేల డాలర్లు (రూ. 41 లక్షల 39 వేలు), 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు) ప్రైజ్‌మనీగా అందజేస్తారు. -
Chess Olympiad 2022: భారత జట్ల జోరు
చెన్నై: చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు వరుసగా రెండో విజయం నమోదు చేశాయి. శనివారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ 3.5–0.5తో మాల్డోవాపై, భారత్ ‘బి’ 4–0తో ఎస్తోనియాపై, భారత్ ‘సి’ 3.5–0.5తో మెక్సికోపై గెలుపొందాయి. మహిళల విభాగం రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కోనేరు హంపి, తానియా సచ్దేవ్, వైశాలి, భక్తి కులకర్ణిలతో కూడిన భారత్ ‘ఎ’ 3.5–0.5తో అర్జెంటీనాపై, భారత్ ‘బి’ 3.5–0.5తో లాత్వియాపై, భారత్ ‘సి’ 3–1తో సింగపూర్‌పై విజయం సాధించాయి. మరీసా (అర్జెంటీనా)తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) తానియా సచ్దేవ్ 36 ఎత్తుల్లో అనాపవోలాపై, వైశాలి 90 ఎత్తుల్లో మరియా జోస్పై, భక్తి కులకర్ణి 44 ఎత్తుల్లో మరియా బెలెన్‌పై గెలిచారు. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తన ప్రత్యర్థి ఇవాన్ షిట్కోపై నెగ్గగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన ప్రత్యర్థి మెకోవరితో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ దంపతుల మృతి
మదనపల్లెక్రైం: వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చి న ఎన్ఆర్ఐ దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మర ణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డా రు. ఓ యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు, కారు, ద్విచక్ర వాహనం నుజ్జయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లెకు మూడు కిలోమీట ర్ల దూరంలోచెన్నై-ముంబయి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, మృతుల కుటుంబసభ్యుల కథనం మేరకు.. నిమ్మనపల్లె మండలం గంగాపురంపల్లెకు చెందిన ఓబుల్‌రెడ్డి కుమారుడు కేశవరెడ్డి (58) రైల్వే స్టేషన్మాస్టారుగా పనిచేస్తూ పీలేరులో స్థిరపడ్డారు. వీరి అన్న వెంకట్రమణారెడ్డి మదనపల్లెలో సోషియల్ వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. వీరి చివరి తమ్ముడు చక్రపాణిరెడ్డి (40) ఆర్మీలో పనిచేసి ఏడాదిన్నర కాలంగా భార్య ఉషా(35), కుమార్తె తాని యా(17)తో సింగపూర్‌లో ఉంటున్నారు. అన్న వెంకట్రమణారెడ్డి కుమార్తె వివాహం కోసం చక్రపాణిరెడ్డి, ఉషా, తానియాలు రెండురోజుల క్రితం మదనపల్లెకు వచ్చారు. గురువారం రాత్రి నుంచి పెళ్లి వేడుకల్లో పా ల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ముహూర్తం అనంతరం పుంగనూరులోని పెళ్లికుమారుడి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత చక్రపాణిరెడ్డి, ఉషా, తానియాతో పాటు, అన్న వదినలు కేశవరెడ్డి, భూషణమ్మ కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని నవోదయ పాఠశాల సమీపంలోకి రాగానే మదనపల్లె నుంచి చిత్తూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు వేగంగా కారును ఢీకొని రోడ్డుపక్కన కాలువలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో కారు వెనుక వస్తున్న పుంగనూరు మం డలం కొత్తార్లపల్లెకు చెందిన చెంగప్ప కుమారుడు శంకర్(24) కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలు చక్రపాణిరెడ్డి, ఉషా అక్కడికక్కడే మృతి చెందారు. కేశవరెడ్డి, భూషణమ్మ, తానియా తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్న పలమనేరు మం డలం ముసలమర్రికి చెందిన నాగమ్మ(55) కాలు విరి గిపోగా పలమనేరుకు చెందిన రత్నమ్మ(56), రాంబాబు(60) గాయపడ్డారు. వీరిని 108లో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డి, భూషణమ్మ, తానియాను బెంగళూరుకు తరలించారు. నాగమ్మను తిరుపతికి రెఫర్ చేశారు. ద్విచక్ర వాహనదారుడు శంకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తానియా, కేశవరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాపాడడంలో రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు రవిప్రకాష్‌రెడ్డి, శ్రీనివాసరావు సహకారం అందించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.