ప్రపంచ అద్భుతమైన కట్టడాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉన్న ఈ నిర్మాణాన్ని చూసేందుకు ప్రతిరోజూ ప్రపంచం నలు దిక్కుల నుంచి పర్యాటకులు వస్తారు. ఎక్కువ మంది పర్యాటకులు ఈఫిల్ టవర్‌ను చూసేందుకు సాయంత్రం వేళ వెళ్తారు. ఎందుకంటే.. సాయంత్రం నుంచి టవర్ లైట్లతో కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. బంగారు వర్ణంలో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ప్యారిస్‌ను సిటీ ఆఫ్ లైట్ అని పిలుస్తారు. రాత్రి వేల ఈఫిల్ టవర్ వీక్షించే సమయంలో ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ గొప్పగా చెప్పుకోవచ్చు కదా అని రాత్రి వేల ఫోటో తీశారో ఇక మీ పని అంతే.
ఇక్కడే ఓ విషయం పర్యాటకులకు తెలియదు. అది ఏమిటంటే రాత్రివేళ ఈఫిల్ టవర్‌ను ఫొటోలు తియ్యకూడదు. ఎందుకంటే ఆ యూరోపియన్ కాపీరైట్ లా ప్రకార౦.. ఆ లైట్లకు కాపీరైట్స్ ఉన్నాయి. మన దేశంతో పోలిస్తే యూరోపియన్ కాపీరైట్ చట్టాలు కొంచెం కఠినంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఫొటోతీసి సోషల్ మీడియాలో గనుక షేర్ చేస్తే కాపీరైట్ సమస్య వస్తుంది. లైటింగ్‌తో ఉన్న ఈఫిల్ టవర్ ఫొటోలు, వీడియోల హక్కులన్నీ దాన్ని నిర్మించిన వారికే ఉన్నాయి. అక్కడి చట్టాల ప్రకారం.. ఈఫిల్ టవర్ వంటి స్మారక చిహ్నాలపై కాపీరైట్ అనేది 70 ఏళ్లకు పైగా ఉంటుంది. (చదవండి: ఓటీటీ ప్రియులకు ఇక పండగే!)
టవర్ సృష్టికర్త గుస్తావ్ ఈఫిల్ 1923లో మరణించాడు. కాబట్టి 1993లో ఈఫిల్ టవర్ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది. అందుకే పగటి పుట తీసుకునే ఫోటోలపై ఎటువంటి కాపీరైట్ చర్యలు తీసుకోరు. కానీ, ఈఫిల్ టవర్ నైట్ లైటింగ్స్‌ని 1985లో ఏర్పాటు చేశారు. అందువల్ల వాటికి ఫ్రాన్స్‌లోని కాపీ రైట్ చట్టం ప్రకారం దానిమీద ఆర్టిస్టిక్ వర్క్ హక్కులున్నాయి. వాటిని ఏర్పాటుచేసిన వారికే అవి లభిస్తాయి. అయితే, ఈ నిబందనలు ఉల్లంఘించి చాలా మంది ఫోటోలు తీసుకున్నారు. అయితే, వార మీద చర్యలు తీసుకోక పోవడానికి కారణం ఉంది. అక్కడి నియమాలు ఉల్లాఘించి ఫోటోలు తీసుకున్న వారి సంఖ్య ప్రపంచం మొత్తం మీద కోట్లలో ఉంటుంది. అందుకే, వారి మీద ఫ్రాన్స్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ, మీరు రాత్రివేళ ఫోటోలు దిగలంటే డబ్బులు చెల్లించి దిగడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment