ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఆరంభానికి సమయం ఆసన్నమైంది. ఫ్రాన్స్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక క్రీడలు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
జూలై 26 నుంచి ఆగష్టు 11 వరకు విశ్వ క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు 33 భిన్న వేదికలు ఆతిథ్యం ఇస్తున్నాయి. మరి ఆ వేదికలు, అక్కడ జరిగే ఈవెంట్స్ ఏమిటో తెలుసుకుందాం!
ఐకానిక్ సైట్స్.. ఈ ఐదూ స్పెషల్
ఈఫిల్ టవర్
ఈ ప్రఖ్యాత కట్టడం సమీపంలోనే బీచ్ వాలీబాల్(ఐరన్ లేడీ పాదాల చెంత), జూడో, రెజ్లింగ్(చాప్స్ డీ మార్స్ పార్క్) నిర్వహించనున్నారు.
కాగా ఈఫిల్ టవర్‌ను 1889లో ప్రారంభించగా.. ప్యారిస్ ఐకానిక్ సింబల్‌గా మారింది. పర్యాటకుల సందడితో కలకలలాడుతూ ఉంటుంది.
గ్రాండ్ పలైస్
వరల్డ్ ఫెయిర్ 1900లో భాగంగా రూపొందించిన గ్లాస్ అండ్ స్టీల్ మాస్టర్‌పీస్. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దీనిని మిలిటరీ తాత్కాలిక ఆస్పత్రిగా మార్చారు.
ఇక 21వ శతాబ్దంలో తిరిగి ఆర్ట్ గ్యాలరీగా మారిపోయిన గ్రాండ్ పలైస్‌లో.. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఆరిస్టుల పెయింటింగ్‌లతో నిండిపోయింది. ఇప్పుడు ఫెన్సింగ్, తైక్వాండో క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది.
ప్లేస్ డి లా కాన్‌కోర్డే
ప్యారిస్‌లోని మేజర్ పబ్లిక్ స్క్వేర్స్‌లో ఒకటి. చాంప్స్- ఎలిసీస్‌కు తూర్పు భాగంలో ఉంటుంది. ఫ్రెంచి విప్లవ సమయంలో ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
దీంతో తాత్కాలికంగా రివల్యూషన్ స్క్వేర్‌గానూ ఈ ప్లేస్ పేరును మార్చారు. తర్వాత మళ్లీ ప్లేస్ డి లా కాన్‌కోర్డేగానే పిలుచుకుంటున్నారు.
ఇక్కడ BMX(బైస్కిల్, మోటోక్రాస్ స్టంట్) ఫ్రీస్టైల్ స్కేట్ బోర్డింగ్, 3X3 బాస్కెట్‌బాల్ క్రీడలు నిర్వహించనున్నారు.
ప్యాలస్ ఆఫ్ వెర్సైల్స్
డ్రెస్సేజ్, షోజంపింగ్, ఈక్వెస్ట్రియన్‌లకు వేదిక. ప్యారిస్ నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. మారథాన్, పెంటథ్లాన్ ఈవెంట్లకు కూడా వేదిక కానుంది.
17వ శతాబ్దంలో ‘ది సన్ కింగ్’ లూయీస్ XIV వెర్సైల్స్‌ను ఫ్రెంచి రాజ నివాసంగా మార్చాడు. దాదాపు పది వేల మంది సిబ్బందితో ఇక్కడ నివసించాడు.
ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందిన వెర్సైల్స్ ప్యాలస్ 1979 నుంచి పర్యాటకుల ఫేవరెట్లలో ఒకటిగా మారిపోయింది.
మర్సెలీ
అధునాతన ఫ్రాన్స్‌లోని పట్టణాల్లో పేరెన్నికగన్నది సిటీ ఆఫ్ మర్సెలీ. ఇక్కడ సెయిలింగ్ పోటీలు నిర్వహించనున్నారు. మూడు వందలకు పైగా సెయిలర్లు మర్సెలీలోని నదీ జలాల్లో పతకాల కోసం పోటీపడనున్నారు. ఈ పట్టణం పది ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు కూడా గతంలో ఆతిథ్యం ఇచ్చింది.
మిగిలిన వేదికలు, అక్కడి ఈవెంట్లు ఇవే
👉ఆక్వాటిక్స్ సెంటర్- ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో
👉బెర్సీ ఎరీనా- ఆర్టిస్టిక్ జిమ్మాస్టిక్స్, బాస్కెట్‌బాల్, ట్రంపోలిన్
👉బోరీయాక్స్ స్టేడియం- ఫుట్‌బాల్
👉చెటారౌక్స్ షూటింగ్ సెంటర్- షూటింగ్
👉ఎలాన్‌కోర్ట్ హిల్- సైక్లింగ్ మౌంటేన్ బైక్
👉జెఫ్రాయ్- గీచర్డ్ స్టేడియం- ఫుట్‌బాల్
👉హోటల్ డి విల్లే- అథ్లెటిక్స్
👉ఇన్‌వాలిడ్స్- ఆర్చరీ, అథ్లెటిక్స్, సైక్లింగ్ రోడ్
👉లా బ్యూజౌరీ స్టేడియం- ఫుట్‌బాల్
👉లీ బౌర్గెట్ స్పోర్ట్ క్లైంబింగ్ వెన్యూ- స్పోర్ట్ క్లైంబింగ్
👉గోల్ఫ్ నేషనల్-గోల్ఫ్
👉లియాన్ స్టేడియం- ఫుట్‌బాల్
👉నైస్ స్టేడియం- ఫుట్‌బాల్
👉నార్త్ ప్యారిస్ ఎరీనా- బాక్సింగ్, మోడర్న్ పెంటాథ్లాన్
👉పార్క్ డెస్ ప్రిన్సెస్- ఫుట్‌బాల్
👉ప్యారిస్ లా డిఫెన్స్ ఎరీనా- స్విమ్మింగ్, వాటర్ పోలో
👉పియరీ మౌరాయ్ స్టేడియం- బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్
👉పోన్ట్ అలెగ్జాండ్రీ III- సైక్లింగ్ రోడ్, మారథాన్ స్విమ్మింగ్, ట్రిథ్లాన్
👉పోర్టే డీ లా చాపెల్లె ఎరీనా- బ్యాడ్మింటన్, రిథమిక్ జిమ్నాస్టిక్స్
👉స్టాడే రొలాండ్- గ్యారోస్- బాక్సింగ్, టెన్నిస్
👉సెయింట్ క్వెంటిన్ ఎన్ వెలీన్స్ బీఎంఎక్స్ స్టేడియం- సైక్లింగ్ బీఎంఎక్స్ రేసింగ్
👉సెయింట్ క్వెంటిన్ ఎన్ వెలీన్స్ వెలొడ్రోమ్స్- సైక్లింగ్ ట్రాక్
👉సౌత్ ప్యారిస్ ఎరీనా- హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్
👉స్టాడే డి ఫ్రాన్స్- అథ్లెటిక్స్, రగ్బీ సెవెన్స్
👉టీహుపో టాహిటి- సర్ఫింగ్
👉ట్రొకాడెరో- అథ్లెటిక్స్, సైక్లింగ్ రోడ్
👉వైర్‌స సర్ మార్నే నాటికల్ స్టేడియం- కానో స్లాలమ్, కాన్స్ స్ప్రింట్, రోయింగ్
👉వెస్-డూ- మానియర్ స్టేడియం- హాకీ.
చదవండి: Paris Olympics 2024: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే..
Comments
Please login to add a commentAdd a comment