ఈఫిల్ టవర్ మూసివేత! | Eifel Tower closed because of national strike over labour laws | Sakshi
Sakshi News home page

ఈఫిల్ టవర్ మూసివేత!

Published Tue, Jun 14 2016 6:28 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

ఈఫిల్ టవర్ మూసివేత!

ఈఫిల్ టవర్ మూసివేత!

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌ మంగళవారం మూతపడింది. ప్రతిరోజు వేలమంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. గతేడాది 70 లక్షలకు పైగా పర్యాటకులు ఈ అద్భుతాన్ని సందర్శించగా ఇందులో 80 శాతానికి పైగా విదేశీయులు ఉన్నారు. అయితే ఫ్రాన్స్ కార్మిక చట్టాలు తమకు అడ్డుగా నిలుస్తున్నాయని, దీంతో తాము అధిక ఒత్తిడికి గురవుతున్నాయని కార్మికులు ధర్నా చేశారు. ఈ కారణంగా ఈఫిల్ టవర్ ను మంగళవారం మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈఫిల్ టవర్ కు వచ్చే సందర్శకులను రిసీవ్ చేసుకోవడం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, టవర్ వద్ద పనిచేయడం, మొదలైన పనులు నిర్వహించడం తమకు చాలా కష్టమవుతుందని ధర్నా చేస్తున్నారు. ప్రతిరోజూ 15 నుంచి 20 వేల మంది ఇక్కడకి వస్తుంటారని, తగిన స్టాప్ లేకపోవడంతో ఒక కార్మికుడు రెండు, మూడు డిపార్ట్ మెంట్స్ పనులు నిర్వహించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల కారణంగానే నిరుద్యోగిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కార్మికులు వాపోయారు. వర్కర్స్ ఎవరూ రాకపోవడంతో ఈఫిల్ టవర్ ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement