
సంబర ‘చిత్రం’
టెక్‌యుగం
ఒకవైపు ఆనందించాలి.. మరోవైపు ఆ ఆనందాన్ని క్యాప్చర్ చేయాలి. కళ్లతో కాదు, కెమెరాతో! స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఈ మానియా మరింత పెరిగింది. అందుకు సాక్ష్యం ఈ చిత్రం. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఈఫిల్‌టవర్ ముందు ‘కలర్ రన్' జరిగింది. ప్రతియేటా జరిగే ఈ ఉత్సవంలో రంగులు చల్లుకొంటూ కొన్ని వేల మంది ఐదు కిలోమీటర్ల దూరం పరిగెత్తుతారు.
ఈసారి ఇలా వచ్చిన వారు చేతుల్లోని రంగులను చల్లుకోవడంతో పాటు అవే చేతులతోనే ఫోటోలు తీసుకోవడం కూడా కనిపించింది. సంబరాన్నంతా ఫోటోలుగా బంధించేయాలన్నంత ఉత్సాహం, తాపత్రయం వారిది!