Indian Employees Sharing Their Experience Of Cost-cutting In The Workplace - Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు షాకిస్తున్న కంపెనీలు.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు!

Published Sat, Apr 15 2023 7:02 PM | Last Updated on Sat, Apr 15 2023 7:46 PM

Indian Employees Sharing Their Experience Of Cost-cutting In The Workplace - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఉద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చే ఫిట్‌నెస్‌ క్లాసుల్ని రద్దు చేసింది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ కాఫీలను సగానికి పైగా తగ్గించింది. ఇలా ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాలతో ఆయా కంపెనీలు కాస్ట్‌ కటింగ్‌కు పదును పెడుతున్నాయి. ఈ కాస్ట్‌ కటింగ్‌ ఒక్క గూగుల్‌, గోల్డ్‌ మన్‌ సాచ్చ్‌ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు సైతం ప్రొత్సహాకాల్ని తగ్గించే పనిలో పడ్డాయి. 

తాజాగా గ్రేప్‌వైన్‌ అనే స్టార్టప్‌ సంస్థ ఉద్యోగులకు అందించే సౌకర్యాల్ని సగానికి పైగా తగ్గిస్తూ ట్వీట్‌ చేసింది. దీంతో సిబ్బంది సంస్థ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

మార్కెటింగ్ కంపెనీ మోఎంగేజ్‌ భోజన సమయంలో వడ్డించే ప్లేట్‌ల సంఖ్య, బీర్ బాటిళ్లపై పెట్టే ఖర్చును ఆదా చేసేందుకు బెంగళూరులో జరిగే సంస్థ ఈవెంట్‌కు హాజరుకావద్దని తన ఉద్యోగులను కోరుతున్నట్లు ఓ యూజర్‌ కంపెనీల్లో కాస్ట్‌ కటింగ్స్‌పై చర్చించారు. దీంతో మిగిలిన సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కాస్ట్‌ కటింగ్‌ గురించి తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటిలో 

అమెజాన్ ఇండియాలో పనిచేసే ఓ ఉద్యోగి మాట్లాడుతూ..డబ్బుల్ని పొదుపు చేసేందుకు ఉద్యోగులందరికీ అందించే పర్సనల్‌ డస్ట్‌బిన్‌లను తొలగించి వాటి స్థానంలో అందరూ వినియోగించేందుకు ఒక పెద్ద డస్ట్‌ బిన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

తమ సంస్థ దీపావళి రోజున ఉద్యోగులకు ఏమీ ఇవ్వలేదంటూ పూణేకి చెందిన ఓ ఫిట్‌నెస్ స్టార్టప్ లో పనిచేసే ఓ ఉద్యోగి మొరపెట్టుకున్నాడు. స్వీట్‌ బాక్స్‌ కాదు కదా.. తమ కంపెనీలు దీపావళి బహుమతులు లేదా బోనస్‌లు ఇవ్వడం మానేశాయంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కొందరు మరో అడుగు ముందుకేసి తమ సంస్థ దీపావళి లేదా ఇతర పండుగల సెలబ్రేషన్‌ల కోసం మా వద్ద నుంచే డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. 

తాను 7.5 ఏళ్ల క్రితం ఆర్గనైజేషన్‌లో చేరినప్పుడు కంపెనీ ఓ మౌస్‌ ఇచ్చింది. ఆ మౌస్‌ పోగొట్టానని రూ.2,500 చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. 
 
మరో ఉద్యోగి మాట్లాడుతూ తమ సంస్థ హ్యాండ్‌వాష్‌ కోసం ట్యాప్‌ వినియోగించవద్దని, మగ్ నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పినట్లు ట్వీట్‌లో  పేర్కొన్నారు.  

మరో సంస్థ ఓరియో బిస్కెట్‌ స్థానంలో బ్రిటానియా 50-50 మస్కా చస్కాతో భర్తీ చేసింది అని ఒక ఉద్యోగి చెప్పగా.. మా ఆఫీస్‌లో టిష్యూ పేపర్లు లేవు. చేతి రూమాలు ఉపయోగించుకోవాలని చెప్పినట్లు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement