Harsh Goenka says there's a method to his madness, shows support to 'genius' Elon Musk - Sakshi

‘కాస్త సమయం ఇవ్వాలి.. ఎలాన్‌ మస్క్‌ పిచ్చికి’.. హర్ష గోయెంకా ట్విట్‌ వైరల్‌!

Nov 22 2022 1:37 PM | Updated on Nov 22 2022 2:49 PM

Harsh Goenka Supports Tweet On Elon Musk Says He Is Genius Over Twitter Issue - Sakshi

ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌పై భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త హర్ష్‌ గోయెంకా ప్రశంసల వర్షం కురిపించారు. మస్క్‌ నిర్ణయాలు ట్విటర్‌ను మరింత గందర గోళంలోకి నెట్టేయొచ్చు. అలా అని ఆయన్ను తప్పు పట్టలేం అంటూ హర్ష్‌ గోయెంకా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. 

బాస్‌గా మస్క్‌ ట్విటర్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి ఏదో ఒక నిర్ణయంతో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపు విషయంలో ఎక్కడ రాజీ పడడం లేదు. పైగా అందుకు సహకరించని మేనేజర్‌ స్థాయి ఉద్యోగుల్ని సైతం ఇంటికి పంపించేస్తున్నారు. మరోవైపు ట్విటర్‌ బ్లూ పేరు పెయిడ్‌ సబ్‌ స్క్రిప్షన్‌ను  అందుబాటులోకి తెచ్చారు. ఇలా వరుస నిర్ణయాలతో ఆ సంస్థను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

ఈ తరుణంలో మస్క్‌పై వస్తున్న విమర్శల్ని గోయెంకా సమర్ధిస్తున్నారు.‘ఎలాన్ మస్క్ లాంటి జీనియస్‌ని మనం తక్కువ అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం అతని (మస్క్‌ను ఉద్దేశిస్తూ) పిచ్చికి వెనక ఖచ్చితంగా ఏదో మర్మం ఉండే ఉంటుంది. పేపాలు,దిబోరింగ్‌ కంపెనీ, టెస్లా, స్పేస్ ఎక్స్ ఇలా సంస్థ ఏదైనా సరే..ఆయన ఎన్నో సార్లు కాలం కంటే చాలా ముందున్నారు. మస్క్‌ వద్ద కచ్చితంగా ట్విటర్ విషయంలోనూ ఏదో గేమ్ ప్లాన్ ఉంటుంది. ప్రస్తుతం అది మనకు అర్థం కాకపోవచ్చు, ఇప్పట్లో దాన్ని అంచనా కూడా వేయలేం. ట్విటర్ పని అయిపోయింది అనే ముందు ఆయనకు కొంత సమయం ఇవ్వాలి అని హర్ష్ గోయెంకా మస్క్‌పై వస్తున్న విమర్శల్ని కొట్టిపారేశారు. 

చదవండి: Twitter Hirings ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్‌: ఇండియన్‌ టెకీలకు గుడ్‌ న్యూస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement