బిలియనీర్ ఎలాన్ మస్క్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ట్విటర్ ఉద్యోగులకు కంటిమీద కునకులేకుండా చేస్తున్నాయి. కొనుగోలు చేయక ముందు నుంచే.. మస్క్ బాస్ అయితే ట్విటర్‌లో ఉద్యోగుల తొలగింపు భారీగా ఉంటుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటిపై మస్క్ స్పందించారు. ఉద్యోగుల్ని ఫైర్ చేయడం లేదని తెలిపారు. కానీ మస్క్ నిర్ణయం మాటల వరకే పరిమితమైనట్లు తెలుస్తోంది.
మస్క్ ట్విటర్‌లో పనిచేసే 3700 మంది తొలగించనున్నట్లు బ్లూమ్ బెర్గ్ తెలిపింది. ఈ వారం ముగిసే సమయానికి మస్క్ వేలాది మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనున్నారంటూ బ్లూమ్ బెర్గ్ కథనం తన కథనంలో హైలెట్ చేసింది.
చదవండి👉 'హే డ్యూడ్'..అమ్మా..తల్లి నేను నీ బాస్‌ను..నన్ను అలా పిలవద్దు ప్లీజ్!
నో వర్క్ ఫ్రమ్ హోమ్
ట్విటర్‌లో ఉద్యోగుల తొలగింపుతో పాటు, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎత్తివేసే పనిలో మస్క్ ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. ఈ ఏడాది జూన్ నెలలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంశంలో టెస్లా ఉద్యోగులకు మస్క్ వార్నింగ్ ఇచ్చారు. అదే తరహాలో ట్విటర్ ఉద్యోగులకు వార్నింగ్ ఇవ్వనున్నారనే అనుమానం వ్యక్తం చేసింది.
‘ఆఫీస్‌కు రండి.. లేదంటే గెట్ ఔట్’
ఈ ఏడాది జూన్ నెలలో ఇకపై టెస్లా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కుదరదని తేల్చి చెప్పారు. కాదు కూడదు అంటే టెస్లాలో జాబ్ రిజైన్ చేసి వెళ్లి పోవచ్చంటూ ఉద్యోగులకు మెయిల్స్ పెట్టారు. Sam Nissim అనే టెస్లా ఉద్యోగి రివిల్ చేసిన మస్క్ మెయిల్స్‌లో ఉన్నట్లుగా... టెస్లా ఉద్యోగులు రిమోట్ వర్క్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే వారంలో కనీసం 40 గంటలు ఆఫీస్ నుంచి పనిచేయాల్సిందేనని ఆ మెయిల్స్‌లో చెప్పారు. 40 గంటలకు మించి ఎక్స్‌ట్రా వర్క్ చేసేటప్పుడు మాత్రమే రిమోట్ వర్క్ చేసుకోవచ్చని మస్క్ మెయిల్స్‌లో పేర్కొన్నారు.
సేమ్ టూ సేమ్
అప్పుడు టెస్లా ఉద్యోగులకు ఎలాంటి మెయిల్స్ పంపారో..ఇప్పుడు ట్విటర్ ఉద్యోగులకు మస్క్ ఆ తరహా బెదిరింపు మెయిల్స్ పంపనున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాల్ని ప్రచురించాయి. అయితే మెయిల్స్ పంపిన తర్వాత ట్విటర్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉందని మార్కెట్ నిపుణలు చెబుతున్నారు.
చదవండి👉 ట్విటర్‌లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?
Comments
Please login to add a commentAdd a comment