హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో అన్ని విభాగాల్లో కలిపి తయారయ్యాయి. వీటి విలువ అక్షరాలా రూ.8.7 లక్షల కోట్లు. ఈ విలువలో 57 శాతం వాటా (రూ.5 లక్షల కోట్లు) ప్యాసింజర్ వాహనాలదేనని మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ప్రైమస్ పార్ట్‌నర్స్ నివేదిక వెల్లడించింది. ప్యాసింజర్ కార్ల విభాగంలో మధ్య, పూర్తి స్థాయి ఎస్‌యూవీలు, ఉప విభాగాలు సగ భాగం కంటే అధికంగా కైవసం చేసుకున్నాయి.
విలువలో కాంపాక్ట్ ఎస్‌యూవీల వాటా 25 శాతం ఉంది. లగ్జరీ కార్లు 13 శాతం వాటాతో రూ.63,000 కోట్లు నమోదు చేశాయి. వినియోగదార్లు చవక చిన్న కార్లు, సెడాన్‌లను ఇష్టపడటం లేదు. అందుకే ఇటువంటి కార్ల వాటా మొత్తం విలువలో తక్కువగా ఉంది. తక్కువ ధరలో లభించే వాహనాల నుంచి ఫీచర్ రిచ్ వైపు కస్టమర్లు మళ్లుతున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనం. పరిమాణం కంటే విలువ పెరుగుదల వేగంగా జరుగుతోందని నమ్ముతున్నాము’ అని నివేదిక వివరించింది.
టూ–వీలర్లు 2 కోట్లు..
ప్రైమస్ పార్ట్‌నర్స్ నివేదిక ప్రకారం.. భారత్‌లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి దాదాపు చైనా స్థాయిలో ఉంది. ఇక్కడి తయారీ ప్లాంట్ల నుంచి ఏటా 2 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు వెలువడుతున్నాయి. ఉత్పత్తి అయిన మొత్తం వాహనాల్లో పరిమాణం పరంగా 77 శాతం వాటా టూ–వీలర్లదే. మొత్తం వాహనాల్లో కమర్షియల్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్లు ఉంటాయి.
వీటిలో 2 టన్నుల లోపు సామర్థ్యంగల నాలుగు చక్రాల చిన్న క్యారియర్లు, ట్రాక్టర్ ట్రైలర్స్, టిప్పర్స్ సైతం ఉన్నాయి. వీటి విలువ రూ.1.7 లక్షల కోట్లు. కమర్షియల్ వెహికిల్స్ వాటా మొత్తం పరిమాణంలో 4 శాతం, విలువలో 19 శాతం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఆటోమొబైల్ రంగం 1.9 కోట్ల మందికి ఉపాధి కల్పించింది’ అని వివరించింది.
భారీ పెట్టుబడులు..
భారత్‌లో ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల్లో ఈవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ‘భారతీయ ఈవీ పరిశ్రమ చైనా, యూఎస్, ఈయూ వంటి అగ్ర దేశాల కంటే వెనుకబడి ఉంది. దేశంలో భారీ పెట్టుబడులు జరిగాయి. రాబోయే కొద్ది సంవత్సరాలలో దేశం తన ఈవీ విభాగాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉందని ఇది గట్టిగా సూచిస్తుంది.
భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమలో అపూర్వమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక అంశాలు పరిశ్రమను పునర్నిర్మిస్తున్నాయి. ఈవీలు, ప్రత్యామ్నా య ఇంధనం, ఎలక్ట్రానిక్ విడిభాగాల వినియోగంలో పెరుగుదల, షేర్డ్ వెహికల్ రెంటల్స్/క్యాబ్ సర్వీస్‌ల వంటి అంశాలు భారతీయ ఆటోమొబైల్ రంగంలో పరివర్తనకు కారణమవుతున్నాయి’ అని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment