సాక్షి,ముంబై: ప్రతీ నెల చివరి వారంలో తదుపరి నెలలోని పండుగలు, బ్యాంకు హాలిడేస్‌పై ఆసక్తి ఉంటుంది. అందులోనూ పెద్ద నోటు రూ.2 వేల రీకాల్ నేపథ్యంలో జూన్ నెలలో బ్యాంకుల సెలవులకు మరింత ప్రాధాన్యత నెలకొంది. జూన్‌లో ఏకంగా 12 రోజులు బ్యాంకులు మూతపడనుండటం ఒక విధంగా నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న ఖాతాదారులకు షాకింగ్ అనే చెప్పాలి. (ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్ల మార్పిడికి, డిపాజిట్లకు గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు , నాలుగు శనివారాలు, ఆదివారాలతో కలిపి జూన్ నెలలో మొత్తం 12 రోజుల సెలవుల వివరాలు మీకోసం..
జూన్ నెలలో బ్యాంకుల సెలవులు
జూన్ 4: ఆదివారం
జూన్ 10: రెండో శనివారం
జూన్ 11: ఆదివారం
జూన్ 15: రాజా సంక్రాంతి కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులకు సెలవు
జూన్ 18: ఆదివారం
జూన్ 20: రథయాత్ర ఒడిశా, మణిపూర్‌లో సెలవు
జూన్ 24: చివరి, నాలుగో శనివారం
జూన్ 25: ఆదివారం
జూన్26: త్రిపురలో మాత్రమే సెలవు
జూన్ 28: ఈద్ ఉల్ అజా, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, కేరళల బ్యాంకులకు సెలవు
జూన్ 29: బక్రీద్ దేశవ్యాప్తంగా సెలవు
జూన్ 30: రెమ్నా ఈద్-ఉల్-అజా మిజోరం, ఒడిశాలో సెలవు.
ఇదీ చదవండి: మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా?
Neuralink మనిషి మెదడులో చిప్ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్
Comments
Please login to add a commentAdd a comment