హైదరాబాద్‌పై ఆప్షన్‌పెట్టి తెలంగాణ ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం జాప్యం చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, న్యూస్‌లైన్: హైదరాబాద్‌పై ఆప్షన్‌పెట్టి తెలంగాణ ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం జాప్యం చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. హైద రాబాద్‌ను కిరికిరి పెట్టి కాలయాపనలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలంగాణపై ఒక్కొక్కరు ఒక్కో ప్రకటనచేసి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు.
తెలంగాణకు అనుకూలంగా ప్రకటనచేసి రెండు నెలలు గడుస్తున్నా నేటివరకు ఇంకా నోట్ తయారుకాలేదని, కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుందన్నారు. సీఎం, బొత్సలు సీమాంధ్రుల ఉద్యమాన్ని ప్రోత్సాహిస్తూ తెలంగాణను అడ్డుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌నేతలు సంబరాలు మాని సోనియా, పీఎంలను ఒప్పించేందుకు కృషిచేయాలన్నారు. చంద్రబాబు ఢిల్లీలో తెరచాటున ఉండి తెలంగాణను అడ్డుకుంటున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక శక్తులతో బీజేపీ పోత్తుపెట్టుకోబోదని స్పష్టంచేశారు. సుష్మస్వరాజ్ ఈ నెల 28న పాలమూరులో జరిగే ప్రజాగర్జనలో తెలంగాణప్రజలకు భరోసా ఇవ్వనున్నారని తెలిపారు. ఉద్యోగ, కార్మిక, ప్రజా, కులసంఘాల జేఏసీ నాయకులు సభకు లక్షలాదిగా తరలొ చ్చి సభను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు బాలరాజు, కృష్ణవర్ధన్‌రెడ్డి, మంతటి రాములు తదితరులు పాల్గొన్నారు.