కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి బడ్జెట్ పాలమూరు జిల్లావాసుల ఆశలపై నీళ్లు చల్లింది. ఏటా కరువు కాటకాలతో అల్లాడే జిల్లాకు కేంద్రం నుంచి ....
కేంద్ర బడ్జెట్‌పై వేతనజీవుల అసంతృప్తి
సైనిక పాఠశాల ప్రతిపాదన హుళక్కే!
పరిశ్రమల రాయితీలో జిల్లాకు ఊతం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి బడ్జెట్ పాలమూరు జిల్లావాసుల ఆశలపై నీళ్లు చల్లింది. ఏటా కరువు కాటకాలతో అల్లాడే జిల్లాకు కేంద్రం నుంచి ఏమైనా ప్రత్యేకసాయం లేదా హోదా తదితర హామీలు లభిస్తాయోనని ఎదురుచూసిన వారికి భంగపాటు ఎదురైంది. ఆదాయ పన్ను పరిమితి పెంపు ఉంటుందేమోనని గంపెడాశతో ఎదురుచూసిన వారికీ నిరాశ తప్పలేదు. రాష్ట్ర విభజన సందర్భంగా జిల్లాలో సైనికపాఠశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీఇచ్చినా ప్రస్తుత బడ్జెట్‌లో అలాంటి ప్రస్తావన చేయలేదు. అయితే పరిశ్రమలకు రాయితీ ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కాస్త ఉపశమనం కలిగించింది.
మహబూబ్‌నగర్: కేంద్రబడ్జెట్ పట్ల ఉద్యోగవర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. జిల్లాలో మొత్తం 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. పదవీ విరమణ పొందిన 19,500 మంది పింఛన్లు అందుకుంటున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ పెంచడం ద్వారా జీతాలు ఆశించినస్థాయిలో పెరిగాయి. అయితే ఈ సారి కేంద్రప్రభుత్వం పన్నురాయితీని కాస్త పెంచే అవకాశం ఉందని అందరూ ఎదురుచూశారు. రూ.2.5లక్షల నుంచి రూ.మూడులక్షల వరకు పెరుగుతుందని భావించారు. కానీ అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ కేంద్రం యధావిధిగానే ఉంచింది. దీంతో చిన్న, మధ్యతరగతి ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. అంతేకాదు వెనకబడిన పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రోత్సాహం ఎలాంటి ప్రోత్సాహం ప్రకటించకపోవడం చాలామందిని నిరాశకు గురిచేసింది. అయితే సెల్‌ఫోన్లు, టీవీలు ధరలు తగ్గనుండటంతో సామాన్యులకు ప్రకటించకపోవడం చాలామందిని నిరాశకు కాస్త ఉపసమనం కలిగించే అంశమే. అదేవిధంగా గ్రామీణప్రజలకు ఎంతో ఉపయోగపడే ఉపాధిహామీ పథకానికి నిధులు భారీగా కేటాయించడంతో వలస కూలీలకు ఉపాధి దొరికే అవకాశం ఉంది.
పరిశ్రమలకు ఊతం: కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పరిశ్రమలకు పెద్దఎత్తున ఇవ్వనున్న ప్రోత్సాహం వల్ల జిల్లాకు కాస్త లబ్ధిచేకూరే అవకాశం ఉంది.ఈ బృహత్తర లక్ష్యం తో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు 15శాతం అదనపు పెట్టుబడి అలవెన్సులు, పన్నురాయితీ తదితరాల వల్ల భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. జిల్లాలో ఇదివరకే 7,664 చిన్న పరిశ్రమలు, 614 కాటేజీ పరిశ్రమలు, 593 పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ప్రోత్సాహం ద్వారా జిల్లాలో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఇదివరకే ప్రభుత్వం పెద్దఎత్తున భూములు గుర్తించింది. జిల్లాకు సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రమయం, జాతీయ రహదారి ఉండటంతో మరింత కలిసొచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో పాలమూరు జిల్లాలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.