మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్ అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రకటించిన సందర్భంగా దానిని వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్‌లో 11.77 శాతం మాత్రమే విద్యాంరంగానికి కేంటాయించడం ధారుణమైన అంశమన్నారు. నిధులు విద్యారంగ ఉద్యోగుల జీతాలకు మాత్రమే సరిపోతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి రాము, జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు కార్తీక్, నాయకులు చెన్నకేశవులు సదమ్, నర్సిములు, పాండు, వెంకటేశ్, ఒవేన్ పాల్గొన్నారు.