
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ సాయం చేయాలని నిర్ణయించిన కేంద్ర సర్కారు ఈ దిశగా బ్యాంకుల నుంచి తాజా ప్రణాళికలు సమర్పించాలని కోరింది. నిధుల సమీకరణకు గాను బ్యాంకుల బోర్డులు ఆమోదించిన రోడ్‌మ్యాప్‌లను నెలలోగా సమర్పించాలని సూచించింది.
బడ్జెట్ నుంచి సాయం, రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీ, వాటాల అమ్మకం ద్వారా ప్రభుత్వం బ్యాంకులకు నిధుల తోడ్పాటు అందించనుంది. భవిష్యత్తులో తాము ఏ విభాగాలపై దృష్టి సారించాలనుకుంటున్నదీ, నిధుల సమీకరణ ప్రణాళికలను బ్యాంకులు నెలలోగా తెలియజేయాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment