ఆ జంబలకిడిపంబలా... | Jambalakidi Pamba first look released | Sakshi
Sakshi News home page

ఆ జంబలకిడిపంబలా...

Published Sun, Apr 15 2018 12:48 AM | Last Updated on Sun, Apr 15 2018 12:48 AM

Jambalakidi Pamba first look released - Sakshi

సిద్ది, నరేశ్, శ్రీనివాసరెడ్డి, మారుతి, ‘డార్లింగ్‌’ స్వామి, జేబీ మురళీకృష్ణ

‘జంబలకడిపంబ’ ఈ సినిమా చూసినవారు నవ్వు ఆపుకోలేరు.  ఆ రేంజ్‌లో కామెడీ ఉంటుంది. ఇప్పుడు అదే టైటిల్‌తో ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రాల్లో హీరోగా నటించిన కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి కథనాయకుడిగా సినిమా చేస్తున్నారు. ఇందులో సిద్ది ఇద్నాని కథానాయిక. జేబీ మురళీ కృష్ణ దర్శకత్వంలో రవి, జోజో, జోస్, శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను వీకే నరేశ్‌ రిలీజ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘మా ఈవీవీ సత్యనారాయణగారు సృష్టించిన ‘జంబలకిడిపంబ’ తెలుగు సినిమాల్లో ఆణిముత్యం లాంటిది.

ఇప్పుడు అదే టైటిల్‌తో శ్రీనివాసరెడ్డి చేస్తున్న సినిమా ఫస్ట్‌లుక్‌ను నేను రిలీజ్‌ చేయడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్‌కు మంచి సక్సెస్‌ రావాలి’’ అన్నారు. ‘‘జంబలకిడిపంబ’ టైటిల్‌ను మరలా పెట్టి సినిమా తీయడం సాహసమే. కానీ వీళ్లు చేస్తున్నారు. కథ చాలా కొత్తగా ఉంది. సినిమా సక్సెస్‌ అవుతుంది’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘ఇది రొమాంటిక్‌ కామెడీ సినిమా’’ అన్నారు నిర్మాతలు. శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్‌ బాగా కుదిరింది. మా చిత్రకథకు కరెక్ట్‌గా సరిపోయే టైటిల్‌ ఇది’’ అన్నారు దర్శకుడు. ‘‘ఆ ‘జంబలకిడిపంబ’ ఎంతో హిట్టయిందో ఈ సినిమా అంతే హిట్‌ సాధించాలి’’ అన్నారు అలీ. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement