దివంగత మహానేత వైఎస్సార్ ఎవరెస్టు శిఖరంలాంటి వారని, ఆయనకు మరణం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ప్రజల గుండెలపై వైఎస్ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి బుధవారం షర్మిల కరీంనగర్ జిల్లాలోని మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండోరోజు పరామర్శ యాత్ర కొనసాగించారు.