
కొత్త శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బుధవారం మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి శ్రీనివాస్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ పాలన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితుడై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు వినోద్‌కుమార్, పొంగులేటి, తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు.