join TRS
-
కాషాయ గూటికి..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన అనూహ్య ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని విస్తరించాలని నిర్ణయించుకున్న బీజేపీ చూపు కరీంనగర్ ఉమ్మడి జిల్లాపై పడింది. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బండి సంజయ్‌కుమార్ ఘన విజయం నేపథ్యంలో ‘ఆపరేషన్ ఆకర్ష’ను ఈ జిల్లా నుంచే మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ జాతీయ నేత రాంమాధవ్ ఈ మేరకు హైదరాబాద్‌లో మకాం వేసి వ్యూహం రూపొందిస్తున్నారు. తొలుత కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతి నిధులను పార్టీలోకి తీసుకొనే ఆలోచనతో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశంలో మిగిలిన ఒకరిద్దరు ప్రముఖ నాయకులను పార్టీలోకి ఆహ్వానించే ఆలోచనతో బీజేపీ నాయకత్వం ఉంది. ఈ రెండు పార్టీల కథ ముగిసిన తరువాతే అధికార టీఆర్ఎస్పై గురి పెట్టనున్నారు. చారిత్రాత్మక తప్పిదంగా భావిస్తున్న వివేక్ పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానం మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు టికెట్టు ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో చెన్నూరు అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బొర్లకుంట వెంకటేశ్ నేతను టీఆర్ఎస్లోకి తీసుకొని పెద్దపల్లి టికెట్టు ఇచ్చారు. ఈ ప్రక్రియలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక పాత్ర పోషించగా, మిగతా ఎమ్మెల్యేలు సహకరించారు. అదే సమయంలో బీజేపీ వివేక్‌పై కన్నేసింది. జాతీయ నేత రాంమాధవ్ స్వయంగా వివేక్‌తో మాట్లాడి హైదరాబాద్ పిలిపించుకొని పెద్దపల్లి అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేయమని కోరారు. అప్పటికే జాతీయ నాయకత్వం పెద్దపల్లి టికెట్టును ఎస్.కుమార్‌కు ప్రకటించినప్పటికీ, వివేక్ కోసం బీఫారంను నామినేషన్ల చివరి రోజు వరకు ఆపారు. అయితే అప్పటివరకు టీఆర్ఎస్లో ఉన్న తాను బీజేపీ నుంచి పోటీ చేస్తే ఓట్లు పోలవుతాయో లేదోనని భయపడ్డ వివేక్ పోటీకి నిరాకరించారు. తనకు బదులు సోదరుడు వినోద్‌కు సీటివ్వమని కోరగా, అందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. చివరికి ఫలితాల్లో అనూహ్యంగా చివరి నిమిషంలో ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావు ఘన విజయం సాధించారు. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్‌లలో బీజేపీ విజయఢంకా మోగించింది. పెద్దపల్లి నుంచి పోటీ చేస్తే తాను కూడా గెలిచేవాడినని ఫలితాల అనంతరం ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బీజేపీ బలమైన శక్తిగా మారుతుందని భావించిన ఆయన ఆపార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఇటీవల రాంమాధవ్‌ను కలిసి తన అభీష్టాన్ని తెలియజేసినట్లు సమాచారం. వివేక్ చేరికను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ప్రోత్సహిస్తున్నారు. రాంమాధవ్‌ను కలిసిన రమ్యారావు కేసీఆర్ కుటుంబానికి చెందిన రేగులపాటి రమ్యారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో బుధవారం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో పార్టీ నేత రాంమాధవ్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ గత ఎన్నికల ముందు రాజీనామా చేసిన రమ్యారావు ఏ పార్టీలో చేరలేదు. వారం రోజుల్లో బీజేపీలో చేరనున్నట్లు ఆమె ధ్రువీకరించారు. రాష్ట్రంలో టీడీపీ ఉనికిలో లేకుండా పోవడంతో ఆ పార్టీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన పార్టీ అగ్రనేతలను కలిశారు. వీరితోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాయకత్వ లేమి ఉన్న కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నాయకులను చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో.. కరీంనగర్ ఎంపీగా విజయం సాధించిన బండి సంజయ్‌కుమార్ నేతృత్వంలోనే కొత్త చేరికలకు ముహూర్తం ఖరారు కానున్నట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సంజయ్ శుక్రవారం ఢిల్లీకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో బీజేపీలోకి ఎవరిని ఆహ్వానిస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే విషయాన్ని ఆయన అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ప్రజాబలం ఉన్న నాయకులను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్న ఆయన ఆ మేరకు ఓ జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ చేరికల తరువాత టీఆర్ఎస్కు చెందిన అసంతృప్తి వాదులు, మాజీలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. -
టీఆర్ఎస్లోకి సీతక్క?
ములుగు: కాంగ్రెస్ తరఫున ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన ధనసరి అనసూయ(సీతక్క) టీఆర్ఎస్లో చేరనున్నారనే ప్రచారం స్థానికంగా సాగుతోంది. ఈ విషయం రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి తోడు గురువారం ఓ ప్రధాన టీవీ ఛానల్లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో పాటు సీతక్క సైతం కారు ఎక్కనున్నట్లు స్క్రోలింగ్ రావడంతో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు హన్మకొండలోని సీతక్క నివాసానికి వెళ్లారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘోర పరాజయం పాలు కావడంతోనే ఆమె టీఆర్ఎస్ చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుండగా, అధికార పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. పార్టీలో చేరగానే పదవి.. ఆపై ఎమ్మెల్యే టీడీపీలో ఉన్న సీతక్క గత అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆమెకు ఏఐసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడం తో పాటు ములుగు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న పొదెం వీరయ్యను కాదని ఆమెకు అసెంబ్లీ టికెట్ కూడా ఇచ్చారు. ఆ ఎన్నికల్లో సీతక్క భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినా సీతక్క మాత్రం అలాగే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ములుగు నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతుండడంతో సీతక్క మరో వారం రోజుల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. అదంతా తప్పుడు ప్రచారమే.. కొంతమంది నాయకులు గతంలోనే టీఆర్ఎస్లో చేరాలని కోరినా తాను వెళ్లలేదని సీతక్క స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ నాయకులు ఇదే విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో నిజం లేదని, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. -
టీఆర్ఎస్లోకి సీపీఎం నేతలు
సాక్షి, సిద్దిపేట: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడటంతో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్‌ఎఎస్‌లోకి వలసలు జోరుగా కొనసాగుతుండగా తాజాగా సీపీఎం పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేశారు. శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అనంతరం టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... అందరం కలిసి పనిచేయడం ద్వారానే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పేదల ఎజెండానే మన ఎజెండాగా కలిసి పనిచేద్దామని ఆయన పిలుపు నిచ్చారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో సీపీఎం పార్టీ కనుమరుగు అయ్యింది. గత ఎన్నికల్లో సీపీఎం నుంచి ఒక్క ఎమ్మెల్యే అయినా ఉండేవారు కానీ ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలపడుతోందని చెప్పారు. ఎంపీ ఎలక్షన్స్ లో ప్రభాకర్ రెడ్డికి భారీ మెజార్టీ కోసం కష్టపడదామని పిలుపునిచ్చారు. రాష్టంలో పోలింగ్ శాతాన్ని పెంచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. -
టీఆర్ఎస్లో చేరికకు ముహూర్తం ఖరారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా వేసుకోనున్నారు. శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ మైదానంలో సాయంత్రం 6 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కార్తీక్‌రెడ్డి నిశ్చయించారు. ఇదే వేదికపై ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గులాబీ గూటికి చేరనున్నారు. వీరితోపాటు తమ వర్గంగా భావిస్తున్న పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పార్టీ మారనున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మంది టీఆర్ఎస్ శ్రేణులను ఈ సభకు సమీకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొంత ఆలస్యంగా సబిత.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాలని తొలుత భావించారు. ఈ మేరకు చేవెళ్ల లేదా శంషాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేపటి నుంచి ప్రారంభించనుండటంతో.. సమయం వీలుకాదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తనకు బదులు కుమారుడు కేటీఆర్‌ను జిల్లాకు పంపిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ సమక్షంలో కార్తీక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నారు. అయితే సబిత మాత్రం ఒకటి రెండు రోజులు ఆగనున్నట్లు తెలిసింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు. -
గులాబీ గూటికి సబితా ఇంద్రారెడ్డి!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే.. అదే జిల్లాకు చెందిన నాయకురాలు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.. గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సబిత, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భం గా కార్తీక్ రాజకీయ భవిష్యత్తుతో పాటు సబితకు మంత్రివర్గంలో స్థానంపై కేటీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్టు సమాచారం. దీంతో సోమవారం అనుచరులతో సమావేశం కానున్న సబిత త్వరలోనే నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది. పలు ప్రతిపాదనలపై చర్చ ఒవైసీ నివాసంలో కేటీఆర్‌తో జరిగిన భేటీలో సబితా ఇంద్రారెడ్డి కుటుంబం రాజకీయ భవిష్యత్తుపై టీఆర్ఎస్ నుంచి సంపూర్ణ హామీ లభించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించిన సబిత.. తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించే విధంగా సానుకూల చర్చలు వీరి మధ్య జరిగినట్టు సమాచారం. సబితకు మంత్రిపదవి ఇవ్వడం పట్ల కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నారని కేటీఆర్ సంకేతాలిచ్చారని సమాచారం. అయితే ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి ఎమ్మెల్సీనా, ఎంపీనా అన్న విషయంలో మాజీ మంత్రి, సబిత సన్నిహిత బంధువు పట్నం మహేందర్‌రెడ్డితో కూర్చుని మాట్లాడుకోవాలని ఆయన సూచించినట్టు సమాచారం. అవసరమైతే సబిత చేవెళ్ల ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేయొచ్చనే వార్తలు కూడా వినిపించాయి. అదే అనివార్యమైతే మహేశ్వరం ఎమ్మెల్యేగా కార్తీక్ ఉంటారని, ఈ మేరకు కూడా భేటీలో చర్చలు జరిగాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటి నుంచో అసంతృప్తి టీపీసీసీ నాయకత్వం పట్ల సబిత చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తనతో సంప్రదించకుండానే.. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై గుర్రుగా ఉన్నారు. తన కుమారుడి కోసం అడిగిన రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానాన్ని పొత్తు పేరుతో టీడీపీకి ఇచ్చి చేజేతులా అక్కడ ఓటమి పాలయ్యామనే భావనలో ఆమె ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పార్టీ నాయకత్వం వైఖరిలో మార్పు లేకపోవడంతో సబితలో అసంతృప్తి మరింత పెరిగింది. దీనికి తోడు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగం లేదని, రాజకీయంగా తనకు భవిష్యత్తులో ఇబ్బందులుంటాయని.. ఆమె కొంత కాలంగా సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. అసద్‌తో భేటీ అనంతరం కవిత నివాసానికి వెళ్లిన సబిత దాదాపు గంటపాటు భేటీ అయినట్టు సమాచారం. ఫలించని బుజ్జగింపు యత్నాలు తాజా పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ ప్రముఖుల సబితను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలు సబిత నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. పార్టీలోనే కొనసాగాలని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా.. ఈ బుజ్జగింపులు ఫలించలేదని తెలిసింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలూ.. ఆదివారం ఒక్క రోజే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో.. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వీరి బాటలోనే వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒక గిరిజన ఎమ్మెల్యేతో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరొకరు ఉన్నారని, వారు బుధవారం లోపు నిర్ణయాన్ని ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలతో వీరి సంప్రదింపులు పూర్తయ్యాయని, నేడో, రేపో లేఖలు కూడా వస్తాయంటున్నారు. వీరి తర్వాత మరో ఎమ్మెల్యే కూడా పార్టీని వీడి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్‌లు వెళ్లిపోనున్న నేపథ్యంలో.. పార్టీలో సీతక్క ఒక్కరే ఏకైక మహిళా ఎమ్మెల్యేగా మిగలనున్నారు. -
కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే హరిప్రియ గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను వీడుతున్న ఎమ్మెల్యేల జాబితాలో మరొకరు చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం సాయంత్రం ఓ లేఖ విడుదల చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాను సీఎం కేసీఆర్‌ను కలసి గిరిజన ప్రాంత అభివృద్ధిపై చర్చించానన్నారు. ఈ చర్చలో కేసీఆర్ మాట్లాడిన మాటలు స్వార్థ రాజకీయం కోసం కాకుండా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ప్రస్ఫుటించాయని, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఆయన విజన్, దాని కోసం ఆయన పడుతున్న తపన తనను మంత్రముగ్ధురాలిని చేశాయని లేఖలో హరిప్రియ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రూపొందించిన ప్రణాళికలు తనను ఆకర్షింపజేశాయని, శతాబ్దాల చరిత్రగల ఇల్లెందు ప్రాంతం అభివృద్ధి కావాలన్నా, గిరిజనం అభివృద్ధి చెందాలన్నా కేసీఆర్ బాటలో పయనించడమే శ్రేయస్కరమని, అందుకే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్‌తో కలసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నానన్నారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం సహకరించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు, వారికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని తెలిపారు. దీనిపై ఇప్పటికే పార్టీ శ్రేణులతో మాట్లాడానని, అందరినీ సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో హరి ప్రియ పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రమే తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అందరూ భావిస్తున్నారని, అందుకే అందరి నిర్ణయం మేరకు కేసీఆర్ బాటలో నడిచి బంగారు తెలంగాణలో భాగమవుతానని ప్రకటించారు. అవసరమైతే కాం గ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ బీఫారంపై పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమేనని లేఖలో హరిప్రియ వెల్లడించారు. -
గులాబీ గూటికి ఎమ్మెల్యే సక్కు
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గులాబీ గూటికి చేరడం ఖరారైంది. ఉమ్మడి జిల్లాలోని ఉన్న పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చెందిన ఏకైక ఎమ్మెల్యే ఆత్రం సక్కు టీఆర్ఎస్లో చేరికపై గత రెండు మాసాలుగా మంత్రాంగాలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్లో చేరునున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిదింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, ఆసిఫాబాద్‌లో 174 ఓట్ల స్వల్ప మెజార్టీతో సక్కు గెలుపొందారు. ఆదివాసీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. డీసీసీ అధ్యక్షుడి రేసులో జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఉన్నా.. ముందు జాగ్రత్తగా పార్టీ వీడకుండా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఈ పదవి సక్కుకే కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే సక్కు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆదివాసీ సమస్యలపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌కు వెళ్లిన ఆయన ఒక్కరే సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు సమాచారం. జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సక్కు టీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఆయన డీసీసీ అధ్యక్ష పదవితోపాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని, ఆదివారం రాజీనామా పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడికి అందజేసి త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. ఈ నెల 22న ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 1997 నుంచి ట్రైబల్ రైట్స్ ఆర్గనైజేషన్‌లో పని చేసిన సక్కు 2008లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. నవంబర్ 2008లో కాంగ్రెస్‌లో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ అ సెంబ్లీకి స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఎస్టీ వెల్ఫేర్ కమిటీ, ట్రైబల్ అడ్వయిజర్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ కార్యదర్శి, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా పని చేసిన సక్కు ఇటీవల ఎమ్మెల్యేగా గెలు పొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మిపై 174 ఓట్ల మెజార్టీతో విజ యం సాధించారు. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలోనూ సక్కు పాల్గొన్నారు. కేసీఆర్‌పై నమ్మకంతోనే.. ఇటీవల సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఆదివాసీ సమస్యలతోపాటు పోడు భూముల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాది సమస్యలతోపాటు ఇతర అంశాలపై చర్చించామని, సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ముఖ్య అధికారులందరినీ వెంటబెట్టుకొని వచ్చి ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని, ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కూడా అసెంబ్లీ సాక్షిగా ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ నాయకత్వంలోనే ఆదివాసీలు అన్ని రకాల అభివృద్ధి చెందుతారనే నమ్మకంతోనే టీఆర్ఎస్లో చేరడానికి నిశ్చయించుకున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్లో చేరే విషయంపై విధివిధానాలు రూపొందించుకుంటామని, అవసరమైతే శాసన సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి, తిరిగి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
నర్సంపేటలో టీడీపీకి దెబ్బ
నర్సంపేట: 30 ఏళ్లుగా క్రమశిక్షణకు మారుపేరయిన తెలుగుదేశం పార్టీలో పనిచేసి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీని వీడి పలువురు టీడీపీ ముఖ్య నాయకులు సైకిల్ దిగి కారెక్కబోతున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి ముఖ్య అనుచరులంతా టీఆర్ఎస్లో చేరుతుండడంతో పేటలో ఆ పార్టీకి కాలం చెల్లినట్లయింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నర్సంపేటలో పార్టీ బలంగా ఉండడంతో మహాకూటమి తరఫున నర్సంపేట అసెంబ్లీ అభ్యర్థిత్వం కోసం రేవూరి విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరి క్షణంలో మహాకూటమి పొత్తుల్లో భాగంగా రేవూరి వరంగల్ పశ్చిమ అభ్యర్థిత్వం దక్కడంతో ఆయన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని వదిలి వరంగల్ పశ్చిమకు వలస వెళ్లారు. అక్కడ అనూహ్యంగా రేవూరి ఓటమి పాలుకావడంతో టీడీపీ రాజకీయ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. రేవూరి నర్సంపేటను వదిలివెళ్లడంతో ఎన్నికలకు ముందే దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నారావుపేట, ఖనాపురం మండలాలకు చెందిన అనేకమంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వెళ్లారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో టీడీపీ ముఖ్య నాయకులు టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమమ్యారు. నర్సంపేట టీడీపీలో 1987 నుంచి పనిచేసి 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ముగించుకుని, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్‌రెడ్డి తన అనుచరులతో నేడు పెద్ది సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. రేవూరికి సన్నిహితులైన పుచ్చకాయల బుచ్చిరెడ్డి, కొయ్యడి సంపత్, రామగోని సుధాకర్, చిలువేరు కుమారస్వామి, కొమ్మాలు, మోతె సంపత్‌రెడ్డి, దొమ్మటి సత్యం, జనగాం వీరకుమార్, దేశిని సుదర్శన్, గోల్లెని రాజీరు, మహాదేవుని రాజవీరులు కారెక్కనున్నారు. టీడీపీ ప్రధాన నాయకులు, రేవూరి తర్వాత కార్యకర్తలకు అండగా నిలిచే నాయకులంతా టీడీపీని వీడడంతో ఇక ఆ పార్టీ నర్సంపేటలో ఖాళీ అయినట్లేనని పలువురు భావిస్తున్నారు. -
వారు కారెక్కుతారా..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు త్వరలోనే గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వారికి ప్రభుత్వపరంగా ఎటువంటి అవకాశాలు లభిస్తాయనే దానిపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ.. కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో సత్తుపల్లిలో తమ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను బరిలో నిలిపింది. ఆయన సుమారు 19వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా.. అశ్వారావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు 10వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు స్థానాల్లో విజయం సాధించడం.. వారిని టీఆర్ఎస్ గూటికి చేరిస్తే.. అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిధ్యమే ఉండ దన్న రాజకీయ వ్యూహంతో టీఆర్ఎస్ ప్రయ త్నిస్తోందని జిల్లాలో ప్రచారం హోరెత్తుతోంది. టీఆర్ఎస్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరే అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా సమావేశమై.. చర్చించినట్లు తెలుస్తోం ది. ఉమ్మడి జిల్లాలో అసలే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీలోని ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారి తే జిల్లాలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆ పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. జిల్లా నుంచి కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో మూడు స్థానాల్లో పోటీ చేసి, రెండు స్థానాలను గెలుచుకోవడంతో పార్టీకి నూతన జవసత్వాలు వస్తాయని భావించిన కొద్దిరోజులకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ పార్టీ జిల్లా నేతల్లోనూ.. ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ నెలకొంది. ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకటవీరయ్య, మూడుసా ర్లు సత్తుపల్లిలో టీడీపీ నుంచి విజయం సాధించడంతో ఆయన ‘కారెక్కితే’ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ నేతలు భరోసా ఇచ్చారని, అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బాబును కలిసిన మెచ్చా.. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జిల్లాలోని రాజకీయ పరిణామా లు, టీఆర్ఎస్ నుంచి అంది న ఆహ్వానం తదితర అంశాలను శనివారం అమరావతిలో చంద్ర బాబును కలిసి వివరించినట్లు తెలుస్తోంది. గతంలోనూ టీడీపీ ఎమ్మె ల్యేగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారుతారని పలుమార్లు ప్రచా రం జరిగింది. అయితే జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, ప్రభుత్వపరంగా అవకాశాలు అందిపు చ్చుకునే పరిస్థితి ఉందనే రాజకీయ వ్యూహం తో పార్టీ మారే అంశంపై టీడీపీ నేత లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాములునాయక్ టీఆర్ఎస్లో చేరారు. అయితే ఆ పార్టీలో చేరడం వల్ల కలిగే రాజకీయ అవకాశాలపై స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాలని టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేల ను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఇది జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నెలాఖరులోపు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్నా.. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం నర్మగర్భంగానే వ్యవహరిస్తుండడం విశేషం. ఇక పార్టీ మారే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తల తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని పార్టీ శ్రేణులకు వారు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. -
కారెక్కిన కాసాల బుచ్చిరెడ్డి
సాక్షి, సంగారెడ్డి జోన్: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాజీనామా చేసిన కాసాల బుచ్చిరెడ్డి శుక్రవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్, సీడీసీ చైర్మన్ విజేందర్‌రెడ్డి, గ్రంథా లయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండల్‌రెడ్డితో కలిసి కాసాల బుచ్చిరెడ్డి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లు పార్టీలో పని చేసి పార్టీని వీడడం బాధాకరంగా ఉందన్నారు. కార్యకర్తలు, ప్రజలకు సహాయం, సేవ చేయాలన్న లక్ష్యంతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. స్వతహాగా రైతుబిడ్డనైన తనను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగుకు పెట్టుబడి సాయం, రైతుబంధు పథకం, రైతుబీమాతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటివి ఆకట్టుకున్నాయన్నారు. ప్రశ్నార్థకమవుతున్న కులవృత్తులను ప్రోత్సహించి వాటి మనుగడ కోసం టీఆర్ఎస్ కృషి చేస్తోందన్నారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ గెలుపు కోసం తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, మంత్రి హరీశ్‌రావు ఏ పని అప్పగించినా ఉమ్మడి జిల్లాలో చేయడానికి సిద్ధంగా తరువాయిఉన్నట్లు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. బుచ్చిరెడ్డి చేరికతో పార్టీలో బలం పెరిగిందని అన్నారు. నమ్మకంతో పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుం దన్నారు. ఉమ్మడి జిల్లాలో పని చేసిన అనుభవం ఉండడంతో బుచ్చిరెడ్డి సేవలను వినియోగించుకుంటామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుచ్చిరెడ్డితోపాటు పార్టీలో చేరిన వారిలో విజయలక్ష్మి, చంద్రారెడ్డి, కృష్ణ, శమంత, విష్ణువర్థన్, ఉమారాణి, కవిత, మదుసూదన్, సుధీర్‌రెడ్డి, సాయికృష్ణ, బాబు, అశోక్, చారి ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
కారెక్కనున్న కాంగ్రెస్ మాజీ మంత్రి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఒకప్పుడు కాంగ్రెస్‌లో మంత్రి. ఇప్పుడు బహిష్కృత నేత. నిన్నటి వరకు కాంగ్రెస్ మళ్లీ తనను సాదరంగా ఆహ్వానిస్తుందని ఎదురుచూశారు. పార్టీ తాత్సారం చేయడం.. ఇంతలోనే కారెక్కేందుకు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరగడం.. అనుచరులతో సమావేశం జరపడం కూడా చకచకా జరిగిపోయాయి. దీంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ నుంచి తన చేరికకు సానుకూల సంకేతాలు రాకపోవడంతో రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నట్లు రాజకీయ వర్గాలు భావించాయి. అయితే అనూహ్య రీతిలో జలగం ప్రసాదరావుకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆహ్వానం అందడం, సాక్షాత్తూ మంత్రి కేటీఆర్.. ప్రసాదరావుతో భేటీ కావడం, ఇందులో జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కీలక భూమిక పోషించారనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే జలగం ప్రసాదరావు హుటాహుటిన పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలోని తన నివాస గృహానికి చేరడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లయింది. గురువారం జిల్లాలోని జలగం ప్రసాదరావు రాజకీయ శిబిరంలో సైతం మెరుపు వేగంతో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రసాదరావు కుప్పెనకుంట్లకు వచ్చినట్లు తన అనుచరులకు సమాచారం ఇవ్వడంతో గురువారం జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఆయన అనుచరులు, వివిధ పార్టీల్లో ఉన్న కార్యకర్తలు జలగంతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ నేతలు సైతం ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, సత్తుపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి.. జలగం ప్రసాదరావుతో కుప్పెనకుంట్లలోని ఆయన నివాసంలో భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా రాజకీయ అంశాలపై ఆచితూచి స్పందించి.. ఎప్పుడు నర్మగర్భ వ్యాఖ్యలు చేసి తన అంతరంగాన్ని తెలియకుండా రాజకీయ చతురత ప్రదర్శించే ప్రసాదరావు.. గురువారం జరిగిన తన అనుచర వర్గం భేటీలో, మీడియా సమావేశంలోనూ పలు అంశాలపై విస్పష్టంగా.. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులు, టీఆర్ఎస్ నుంచి అందిన ఆహ్వానాన్ని ఆయన అనుచరులకు వివరించారు. కాంగ్రెస్‌లో చేరడం కోసం ఇప్పటివరకు నిరీక్షించిన ప్రసాదరావుకు చేరికపై అధిష్టానం ఇదిగో.. అదిగో అంటూ వాయిదా వేయడంతో ఆయన వర్గీయుల్లో నెలకొన్న అసహనం సైతం ఆయన టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేందుకు పురిగొల్పిందన్న వాదన ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. సంప్రదింపుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. జలగం ప్రసాదరావును కాంగ్రెస్‌లోకి తిరిగి తీసుకునేందుకు మూడు నెలల క్రితం సమావేశమైన పీసీసీ సంప్రదింపుల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.. అయితే జిల్లా కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని.. ఆ సమావేశంలో ఒకరిద్దరు నేతలు అభిప్రాయపడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే జిల్లా కాంగ్రెస్ నేతల అభిప్రాయం ఏమిటో? ఆయనను చేర్చుకుంటున్నారో? లేదో? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ స్పష్టం చేయకపోవడం, పార్టీలో కొందరు నేతలు తన చేరికకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని భావించిన ప్రసాదరావు కొంతకాలం వేచి చూసే ధోరణి అవలంబించారు. పార్టీ నుంచి ఏ రకమైన స్పందన లేకపోవడం.. ఆయన అనుచర వర్గం నుంచి రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి వస్తున్న తరు ణంలో టీఆర్ఎస్ సంప్రదించడంతో కేటీఆర్ తనను పార్టీలో చేరాల్సిందిగా కోరిన అంశాన్ని తన అనుచరులు, అభిమానులతో చర్చించారు. మెజార్టీ అనుచరు ల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని, తన కు కొంత సమయం కావాలని కేటీఆర్‌కు చెప్పినట్లు తన తో సమావేశమైన అనుచరులకు ప్రసాదరావు వివరించారు. రానున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందులో మీకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రసాదరావుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తుందని అప్పుడే ఆయన వర్గీయులు అంచనాలు వేస్తుండడం విశేషం. మనోభావాలు తెలుసుకునేందుకే.. కాంగ్రెస్‌లో తన బహిష్కరణను రద్దు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నా.. జిల్లా నేతలు అడ్డుగా మారారని, ఈసారికి తనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారని, దీంతో రాజకీయంగా తన అవసరం ఉందని భావిస్తున్న టీఆర్ఎస్ అభిప్రాయంపై కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రసాదరావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటే జిల్లాలో రాజకీయంగా పలు పరిణామాలు సంభవించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికీ ఆయన అనుచరులు అనేక మంది కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారని, ప్రసాదరావు రాజకీయ నిర్ణ యాన్ని ప్రకటిస్తే వారందరూ ఆయన రాజకీయ అడుగులో అడుగు వేస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తు న్నాయి. జిల్లాలో టీఆర్ఎస్కు బలమైన రాజకీయ ప్రత్యర్థులుగా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతున్న నేతలను ఓడించేందుకు జలగం రాజకీయ వ్యూహాలు తమకు ఉపయోగపడతాయని టీఆర్ఎస్ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. 1999లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి సుధాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆ ఎన్నికల్లో పని చేశారన్న కారణంతో ప్రసాదరావుపై కాంగ్రెస్ అధిష్టానం ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. వాస్తవానికి ఆ గడువు 2005లోనే తీరినా.. జలగం కాంగ్రెస్‌లో చేరడానికి పెద్దగా సుముఖత చూపకపోవడం.. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరకుండా తటస్థంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. æఈ క్రమంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జలగం తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఆయన మినహా ఆ కమిటీ ఓకే చేసిన వారందరూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. ఈ పరిణామాలతో ఖిన్నుడైన జలగం ఇక కాంగ్రెస్ వైపు చూడడం వల్ల ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రసాదరావు 1983లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో తుమ్మల నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్నతరహా పరిశ్రమలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ అభ్యర్థి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయలేదు. జలగం కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగిన సమయంలో ఆయన పార్టీలో చేరి పాలేరు నుంచి పోటీ చేస్తారని, మంత్రి తుమ్మలకు దీటైన అభ్యర్థి అవుతారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ప్రసాదరావుకు జిల్లావ్యాప్తంగా అనుచరగణం ఉండడం.. మంచి పరిచయాలు ఉండడం.. పాలేరు నియోజకవర్గంలోనూ ఆయనకు అభిమానగణం ఉండడంతో జలగం చేరిక తన విజయానికి ఉపయోగపడుతుందన్న అభిప్రాయంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం.. ప్రసాదరావు చేరిక యోచన పట్ల సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రసాదరావు సోదరుడు జలగం వెంకట్రావు ఇప్పటికే టీఆర్ఎస్లో కొనసాగుతూ.. కొత్తగూడెం ఎమ్మెల్యేగా 2014లో ఎన్నికయ్యారు. మరోసారి అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఇద్దరు సోదరులు ఒకే పార్టీలో కొనసాగే పరిస్థితులు ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 3 లేదా 5న ముహూర్తం.. జిల్లాలో తన అనుచరగణం, అభిమానులతో చర్చించిన మీదట వారి నుంచి వచ్చే సానుకూలత మేరకు ఈనెల 3 లేదా 5వ తేదీన టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడాలని ఆయన అనుచరుల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం అనుచరులతో జరిగిన సమాలోచనల్లో అనేక మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో పార్టీ తీర్థం పుచ్చుకోవడమా? జిల్లాలో సభ నిర్వహించి.. సీఎంను ఆహ్వానించడమా? అనే అంశం సైతం భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. కార్యకర్తల అభీష్టం మేరకే టీఆర్ఎస్లో చేరతా.. పెనుబల్లి: ఈ ప్రాంత అభివృద్ధి కోసం.. కార్యకర్తల అభీష్టం మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరతానని మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు తెలిపారు. మండలంలోని తుమ్మలపల్లిలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్‌రావు మాట్లాడారు. మూడు నెలలుగా కాంగ్రెస్ పార్టీ తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని చెబుతూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మహాకూటమి వల్ల తనకు సీటు ఇచ్చే పరిస్థితి లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారని, తనకు సీటు ఇచ్చేందుకు రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్ అడ్డుకుంటున్నారని చెప్పారని, ఈ ఎన్నికల్లో పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో చూద్దామని దాటవేసే సమాధానం చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ తరుణంలో బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనను కలిసి టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి, ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి, అభ్యర్థుల గెలుపునకు తమతో కలిసి పనిచేయాలని కోరారన్నారు. టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుకట్టడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరగదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినా.. అది జాతీయ స్థాయి నిర్ణయమని వారు చెప్పి తమ గొయ్యి తామే తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ డబ్బులు తీసుకొని సీట్లు ఇస్తుందని, గెలిచే కార్యకర్తలకు అవకాశం లేకుండా మిత్రపక్షాలతో సీట్లు పంచుకుంటున్నారు తప్ప వీరు చేసేదేమీ లేదన్నారు. రేణుకా చౌదరి, భట్టి, సుధాకర్‌రెడ్డి, సంభానితో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని పది నియోజకవర్గాల్లో తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి టీఆర్ఎస్లో చేరతానన్నారు. రెండు మూడు రోజులపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తిరిగి కార్యకర్తల అభిప్రాయం మేరకు వారి అభీష్టంతో టీఆర్ఎస్లో చేరతానని ఆయన వివరించారు. -
టీఆర్ఎస్లో చేరిన కొత్త శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి శ్రీనివాస్‌రెడ్డిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ పాలన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితుడై టీఆర్ఎస్లో చేరుతున్నట్టు శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు వినోద్‌కుమార్, పొంగులేటి, తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. -
బీజేపీకి షాక్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాషాయం కండువా తీసేసి గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు శ్రీనివాస్‌రెడ్డి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఎప్పటి నుంచో బీజేపీలోని కొందరు నాయకుల తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన మంగళవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సు మారు నెల రోజులుగా బీజేపీకి చెందిన కీలక నేత టీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగగా.. ఐదు రోజుల కిం దట ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొరివి వేణుగోపాల్ రాజీనామా ప్రకటించిన సస్పెన్స్‌కు తెరవేశారు. ఎన్నికల సమయంలో తాజాగా మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారిం ది. ఇదిలా వుండగా బీజేపీకి రాజీనామా చేసిన శ్రీనివాస్‌రెడ్డితో సంప్రదింపులు జరిపిన కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గులాబీ దళపతి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడించినట్లు తెలిసింది. ఈ మేరకు బుధవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ప్రగతిభవన్‌లో కేసీఆర్, కేటీఆర్‌ల సమక్షంలో నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరా రు చేసుకున్నట్లు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల కు చెందిన కీలక నేతలను టీఆర్ఎస్ పార్టీలో చేర్పించడంలో కీలకంగా వ్యవహరించిన గంగుల కమలాకర్ బుధవారం శ్రీనివాస్‌రెడ్డి మరికొందరు నేతలు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అధిష్టానంపై అసంతృప్తితోనే రాజీనామా.. విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో చురుగ్గా పనిచేసిన శ్రీనివాస్‌రెడ్డి భారతీయ జనతా పార్టీలో 25 ఏళ్లుగా వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి పాటుపడుతూ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అనేక మంది కార్యకర్తలను పార్టీలో చేర్పించి, పార్టీ అభివృద్ధికి కృషి చేసినా తనకు తగిన గుర్తింపు ఇవ్వకుండా రాష్ట్ర పార్టీ కక్ష్య సాధింపు ధోరణి అవలంబించిందని.. తీవ్ర మనస్థాపానికి గురయ్యానని అధిష్టానానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా పక్షపా త ధోరణి అవలంబించారని.. రాష్ట్ర సంఘటన వ్యవహారాలు చూసే వ్యక్తులు జిల్లా పార్టీలో ఉన్న నాయకుల మధ్య సమన్వయం చేసే బదులు కొందరు వ్యక్తులకే వత్తాసు పలకడంతో జిల్లా నాయకులతో నిరాశ నిస్పృహ నెలకొందన్నారు. పార్టీ సిద్ధాంతాల ఆధారంగా కాకుండా వ్యక్తుల ఆధారంగా రాష్ట్ర నాయకత్వానికి అనుగుణంగా పనిచేయగా మనోవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల వెల్లడించిన అభ్యర్థుల జాబితాలో చాలా మంది కొత్త వారికి ఆవకాశం కల్పించడం, రానున్న జాబితాలో కూడా కొత్త వారికి కేటాయిస్తారని వార్తలు రావడంపై బీజేపీ అనేక జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులలో అభద్రతాభావం నెలకొందని లేఖ లో స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, ప్రస్తుత కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నా పార్టీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఆపై స్థాయి నాయకులు అందరూ తన పేరును అభ్యర్థిగా ఖరారు చేయాలని చెప్పినా జాబితాలో తన పేరు లేకపోవడం, వచ్చే జాబి తాలో కూడా హుస్నాబాద్ అభ్యర్థిగా పేరును పరిగణలోకి తీసుకోవడం లేదనే తెలిసి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంతకాలం తనకు సహకరించిన, తనతోపాటు సాగిన నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరు
షాద్‌నగర్ రూరల్: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తమ విజయాన్ని ఆపలేరని ఆపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని పీర్జాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, ఛత్రపతి యువజన సంఘం సభ్యులు ఆదివారం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యాన, మంత్రి సమక్షంలో గులాబీ కండువాలు వేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ శివారులోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని స్పష్టంచేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. టీఆర్ఎస్ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. మహాకూటమితో ప్రజలకు ఓరిగేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఉనికి కోసం పాకులాడుతోందని ఎద్దేవాచేశారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగ్‌రావు, కొందూటి నరేందర్, ఎంఎస్ నట్రాజ్, బాబురావు, ముస్తాఫా, హఫీజ్, మల్లయ్య, చెన్నయ్య, ఆంజనేయులు, శీలం శ్రీకాంత్, హన్మంతు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చేయిజారుతున్నారు..
సాక్షి, మెదక్: వలసలతో కాంగ్రెస్ సతమతం అవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్ వలసలను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి మరీ టీఆర్ఎస్ తమ పార్టీలో కలుపుకుంటోంది. నర్సాపూర్ నియోజకవర్గంలో ఎక్కువగా కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. చేయి జారిపోతున్న నాయకులు, కార్యకర్తలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ జోరుగా ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ను తిప్పికొట్టేందుకు ఆ పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ చేరికలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఏ పార్టీ నాయకుడు ఎప్పుడు కండువా మారుస్తున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ పోరు సాగుతోంది. ఈ క్రమంలో ఎదుటి పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ముఖ్య నేతలను, నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ రేసులో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు స్వయంగా మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ తరఫున ఎన్నికల వ్యూహాం అమలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలను ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి ఆపరేషన్ ఆకర్‡్షకు పదును పెడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఇది ఎక్కువ ఫలితాన్ని ఇస్తోంది. నర్సాపూర్ నియోజకవర్గంలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. నర్సాపూర్ మాజీ సర్పంచ్ రమణరావు, వెల్దుర్తి మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకుడు పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. శివ్వంపేట మాజీ ఎంపీపీ అధ్యక్షుడు గోవింద్‌నాయక్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. హత్నూర మాజీ ఎంపీపీ అధ్యక్షుడు ఆంజనేయులు సైతం టీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరింత మంది నాయకులు, కార్యకర్తలను చేర్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. వలసలతో పార్టీకి నష్టం జరుగుతుందని గుర్తించిన మాజీ మంత్రి సునీతారెడ్డి వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్లోకి వెళ్లిన నాయకులతో పార్టీకి నష్టం లేదని, అయితే ఇకపై ఎవ్వరూ పార్టీ వీడకుండా చర్యలు తీసుకుంటున్నామని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్‡్షకు దీటుగా సమాధానం ఇవ్వాలని మాజీ మంత్రి సునీతారెడ్డి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్కు చెందిన ముఖ్య నాయకులను పార్టీలోకి చేర్చుకునేందుకు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు సమాచారం. మెదక్, అందోల్ నియోజకవర్గాల్లోనూ.. మెదక్ నియోజకవర్గం కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నియోజకవర్గ, మండల స్థాయి నాయకులను టీఆర్ఎస్లో చేర్చకునేందుకు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడే కాంగ్రెస్ ఆశావహులను సైతం తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ ఇప్పటి నుంచే ఎత్తుగడలు వేస్తోంది. అందోల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్ మండలాల్లో సైతం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను చేర్చుకుంటోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ సమక్షంలో టేక్మాల్ మండలంలోని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి సైతం చేగుంట, నార్సింగి మండలాల్లోని కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరేలా పావులు కదుపుతున్నారు. -
మా గట్టుకొస్తావా..
ముందస్తు ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ వలసలు జోరందుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రధాన పార్టీలు ఆపరేషన్ ఆకర్షను ముమ్మరం చేశాయి. అవతలి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నియోజకవర్గ, మండల స్థాయి నేతలను తమవైపు తిప్పుకొనేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా జిల్లాలో కండువాలు మారుస్తున్న నాయకులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీ మనో ధైర్యాన్ని దెబ్బతీయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కాగా టీఆర్ఎస్లో వేర్వేరు కారణాలతో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు తిప్పుకొని రాజకీయంగా లబ్ధిపొందాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సాక్షి, మెదక్: జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమ వలసలు దోబూచులాడుతున్నాయి. గురువారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో నర్సాపూర్ మాజీ సర్పంచ్ రమణరావు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు టీఆర్ఎస్కు చెందిన జిల్లా పరిధిలోని అల్లాదుర్గం జెడ్పీటీసీ, కొద్ది మంది నాయకులతో కలసి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కింది స్థాయి కాంగ్రెస్ నాయకులను చేర్చుకోవడమేలక్ష్యంగా టీఆర్ఎస్ ముఖ్యులు పావులు కదుపుతున్నారు. మెదక్ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు గులబీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. మెదక్‌లో టికెట్ దక్కని వారే టీఆర్ఎస్ టార్గెట్..? మెదక్ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే టికెట్ ఆశించే వారు సైతం అనేక మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కని వారంతా పార్టీ అభ్యర్థికి వ్యతిరేఖంగా పని చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. దీంతో ఇప్పటి నుంచే కాంగ్రెస్‌లో టికెట్ దక్కే అవకాశాలు తక్కువగా ఉన్న నాయకులతో టీఆర్ఎస్ నేత దేవేందర్‌రెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలు టికెట్లు రాకుంటే టీఆర్ఎస్లో చేరేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పాపన్నపేట, చిన్నశంకరంపేట, మెదక్ మండలంలోని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు పలువురు త్వరలో టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. కాగా పాపన్నపేట మండలంలోని టీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్‌రెడ్డి, బాలాగౌడ్ మరికొంత మంది నాయకులు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. వీరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మెదక్ పట్టణంలో పలువురు అసంతప్తిగా ఉన్న టీఆర్ఎస్ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. నర్సాపూర్‌లో పోటాపోటీగా వలసలు నర్సాపూర్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా వలసలకు స్కెచ్‌లు వేస్తున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులను తమ వైపు లాగే ప్రయత్నం చేస్తుండగా, మాజీ మంత్రి సునీతారెడ్డి సైతం టీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల హత్నూర మాజీ ఎంపీపీ ఆంజనేయులు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. శివ్వంపేట మాజీ ఎంపీపీ గోవింద్ నాయక్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. నర్సాపూర్ మాజీ సర్పంచ్ రమణరావు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. కాగా నర్సాపూర్ మండలంలోని టీఆర్ఎస్కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు రాజునాయక్, మాజీ సర్పంచ్ వెంకటేశ్ పలువురు అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కౌడిపల్లి మండలం ధార్మసాగర్ మాజీ సర్పంచ్ రాంరెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరాగా ఆయన తమ్ముడు లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల వెల్దుర్తి మండలం ఆత్మ కమిటీ డైరెక్టర్ కర్రోల విజయ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇలా రెండు పార్టీలు ఎలాగైనా ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్న లక్ష్యంతో పోటాపోటీగా వలసలను ప్రోత్సహిస్తున్నాయి. ఈనెల 26న నర్సాపూర్‌లో టీఆర్ఎస్ సభ నిర్వహించనుంది. ఈ సభలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. టీఆర్ఎస్లో చేరిన టేక్మాల్ ఎంపీపీ మంత్రి సమక్షంలో గులాబీ గూటికి.. టేక్మాల్(మెదక్): టేక్మాల్ ఎంపీపీ అంజమ్మ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరారు. శనివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు సమక్షంలో అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై కాంగ్రెస్‌ని వీడుతున్నట్లు అంజమ్మ తెలిపారు. అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, పార్టీ సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డి, నాగభూషణం, భక్తుల వీరప్ప, పార్టీ మండలాధ్యక్షుడు యూసఫ్, సిద్ధయ్య, పులి హన్మంతు, అక్బర్ పాషా, సత్యం, రాజయ్య, భాస్కర్, విక్రం, రవి, సురేష్, కృష్టయ్య, శ్రీనివాస్, బాలకృష్ణ, ఓంకార్, మల్లేశం, భూమయ్య పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు గడుగు గుడ్ బై..!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి బాటలోనే జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ ముఖ్యనేత కారెక్కనున్నారా.? త్వరలో వీరు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారా? ఇప్పుడు ఈ అంశంపై ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టికెట్ ఆశించారు. ఈసారి కూడా జుక్కల్‌పై ఆశలు పెట్టుకున్నారు. వీలు కాని పక్షంలో అర్బన్లోనైనా తన పేరును పరిశీలించాలని పలుమా ర్లు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆయన పార్టీ మారాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సురేశ్‌రెడ్డి మాదిరిగానే గడుగు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు న్నాయి. ఈవిషయమై ‘సాక్షి’ గడుగును సంప్రదించగా తాను పార్టీ మారే యోచన లేదని కొట్టిపారేశారు. అలాంటిదేమైనా ఉంటే చెబుతానని దాటవేశారు. సీనియర్లే లక్ష్యంగా.. అభ్యర్థులను ప్రకటించి ముందస్తు ఎన్నికలకు దూకుడుగా వెళుతున్న టీఆర్ఎస్ ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే అనూహ్యంగా మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డిని కారెక్కించుకుని కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరో జిల్లా ము ఖ్య నేతను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేసిన సీనియర్ నేతలకు గులాబీ కండు వా కప్పడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేయడంతో పాటు, నైతికంగా దెబ్బతీసేందుకు పైఎత్తులు వేస్తోంది. -
కాంగ్రెస్‌కు ఉహించని షాక్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, కరీంనగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నారని తెలిసింది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ విషయాన్ని గులాబీ బాస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌లు జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ పదవుల్లో కొనసాగారు. ముందస్తు ఎన్నికల సమయంలో వారు పార్టీని వీడటం నష్టమే. కాగా.. ఈ ఇద్దరు నేతలు 12న తెలంగాణ భవన్లో తమ అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. కాగా.. రిటైర్డు ఆర్డీవో, ఉద్యోగసంఘాల నేత బైరం పద్మయ్య కూడా కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈయన చొప్పదండి టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. -
పథకాల అమలులో ముందంజ
కొత్తగూడెంఅర్బన్: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి, వారి అభివృద్ధికి పాటుపడడంలో తమ ప్రభుత్వం ముందంజలో ఉందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక రైటర్‌బస్తీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో పలు పార్టీల నుంచి 150 కుటుంబాల వారు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సరికొత్త సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నామన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఎంతోమంది కర్షకులకు మేలు జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాలన మెచ్చి..ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జేడి చంటి, పట్టణ పరిధి బర్లిఫిట్ ఏరియా కాంగ్రెస్ నాయకులు రామయ్య, బుడబుక్కల సంఘం జిల్లా నాయకులు గోపి, ఇల్లెందు నుంచి ప్రదీప్, సందీప్, సోహెల్, వేణు, శశాంక్, రాజేష్, అఫ్రోజ్‌తో పాటుగా రుద్రంపూర్ తదితర ఏరియాల నుంచి పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ కొదుమసింహ పాండురంగచార్యులు, టీఆర్ఎస్ నాయకులు గోపాలరావు, డాక్టర్ శంకర్‌నాయక్, ఆళ్ల మురళి, తూము చౌదరి, వార్డు కౌన్సిలర్లు దుంపల అనురాధ, సరోజ, నాయకులు కందుల సుధాకర్‌రెడ్డి, పులిరాబర్ట్ రామస్వామి, సోమిరెడ్డి, పురుషోత్తం, కృష్ణ ప్రసాద్, అక్రం పాష, కనుకుంట్ల శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇన్.. ఔట్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఏడాది కాలం ఉండగానే ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో రాజకీయాల్లో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలతో కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరేందుకు ఇప్పటికే స్పష్టత వచ్చింది. నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని కూచుకుళ్ల మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై అధిష్టానాన్ని కలిసినా ఫలితం లేకపోవడంతో.. మనస్తాపానికి గురైన తానే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అధిష్టానంపై కూచుకుళ్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలియగానే ప్రభుత్వంలో కీలక మంత్రి ఒకరు రంగంలోకి దిగారు. మరోవైపు నారాయణపేట నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంభం శివకుమార్ ఆ పార్టీని వీడనున్నారు. పేటలో బలమైన నేతగా గుర్తింపు పొందిన శివకుమార్ కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శివకుమార్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే.అరుణ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇలా టీఆర్ఎస్లో ఓ కీలక నేత చేరేందుకు, ఆ పార్టీ నుంచి మరో నేత కాంగ్రెస్‌లో వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు హాట్‌టాఫిక్‌గా మారాయి. నాగర్‌కర్నూల్‌లో ఉప్పు – నిప్పు ఇటీవలి కాలంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఉమ్మడి జిల్లాలో ఆసక్తికరంగా మారాయి. రాజకీయాల్లో అత్యంత సీనియర్‌గా గుర్తింపు పొందిన నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు ఎన్నికల బరిలో ఆరు సార్లు తలపడ్డారు. తద్వారా ఇరువురి మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. అయితే రాష్ట్రంలో, జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పునరేకీకరణలో భాగంగా నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలని భావించారు. అయితే నాగం రాకను దామోదర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ మంత్రి డీకే.అరుణ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారు. ఎట్టి పరిస్థితిలో నాగంను చేర్చుకోవద్దని గట్టిగా పట్టుబట్టారు. అయితే తెరవెనుక కాంగ్రెస్ కురువృద్ధుడు ఎస్.జైపాల్‌రెడ్డి చక్రం తిప్పడంతో నాగం చేరికకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు అధిష్టానం కూడా పార్టీలోకి వచ్చే వారిని నిలువరించొద్దని, టిక్కెట్ల విషయం తర్వాత చూద్దామని సర్ది చెప్పింది. అలా నాగం కాంగ్రెస్‌లో చేరడంతో దామోదర్‌రెడ్డి పూర్తిగా మౌనం దాల్చారు. గత కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న ఆయనను టీఆర్ఎస్లోకి లాగేందుకు ముమ్మర కసరత్తు చేసిన ఓ కీలక మంత్రి ఆ ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. వచ్చే ఎన్నికల్లో నాగంను నిలువరించేందుకు ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు కూచుకుళ్ల సంకేతాలు పంపించడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆయనను చేర్చుకునేందుకు అంగీకరించగా.. రెండు, మూడు రోజుల్లో చేరిక ఉండొచ్చని చెబుతున్నారు. శివకుమార్‌కు కాంగ్రెస్ గాలం నారాయణపేట నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న టీఆర్ఎస్ నేత కుంభం శివకుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న శివకుమార్ పేట నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ప్రస్తత ఎమ్మెల్యే, అప్పటి టీడీపీ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్.రాజేందర్‌రెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి శివకుమార్‌కు ప్రాధాన్యం తగ్గుతుండడంతో సైలెంట్ అయ్యారు. దీంతో ఇటీవలి కాలంలో జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్ సైతం శివకుమార్ బలాన్ని తెలుసుకుని పార్టీలో మంచి ప్రాధాన్యం ఇస్తామని అయితే నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు లేకపోవడంతో మాజీ మంత్రి డీకే.అరుణ రంగంలోకి దిగి శివకుమార్‌ను చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా ఎన్నికల్లో పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాకు స్థానం దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతానని డీకే.అరుణ అధిష్టానానికి గట్టి హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో శివకుమార్‌తో మంతనాలు జరపగా ఆయన నుంచి సానుకూలత వచ్చిందని.. వారం, పది రోజుల్లో శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్లేనని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌లో మళ్లీ ఆధిపత్యపోరు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో డీకే అరుణ, ఎస్.జైపాల్‌రెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఒకరు అవునంటే.. మరొకరు కాదంటూ పలు అంశాల్లో విబేధాలు వస్తుండడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్‌లో నాగం జనార్దన్‌రెడ్డి చేరికను వ్యతిరేకించిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి డీకే.అరుణ మద్దతుగా నిలిచారు. ఇక నాగంకు సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి మద్దతుగా నిలిచి పార్టీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో జైపాల్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు డీకే.అరుణ వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో తన పట్టు ఏ మాత్రం తగ్గకుండా చూసుకునేందుకు నారాయణపేటలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న శివకుమార్‌ను పార్టీలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే నాగం విషయంలో డీకే.అరుణ ఏ విధంగా అడ్డు తగిలారో... అదే మాదిరిగా శివకుమార్ విషయంలో కూడా జైపాల్‌రెడ్డి అడ్డుపడుతున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకు అనుగుణంగా నారాయణపేటలో జైపాల్‌రెడ్డి అనుచరులుగా గుర్తింపు ఉన్న సరఫ్ కృష్ణ, రెడ్డిగారి రవీందర్‌రెడ్డి ఇద్దరూ కూడా శివకుమార్‌ను పార్టీలో చేర్చుకోవద్దంటూ ఫిర్యాదులు చేశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా డీకే.అరుణ తన పంతం నెగ్గించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో గట్టిగా పట్టుబట్టారు. దీంతో శివకుమార్ చేరికకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద లైన్ క్లియర్ అయింది. ఇలా శివకుమార్ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
టీఆర్ఎస్ పార్టీలో చేరిక
నేరేడుచర్ల : పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌కు చెందిన ఐఎన్టీయూసీ మండల నాయకుడ, 9వ వార్డు సభ్యుడు కాటూరి శేషగిరి ఆదివారం టీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి కాసోజు శంకరమ్మ ఆధ్వర్యంలో రాష్త్ర విద్యుత్ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లచ్చిరాం నాయక్, జాన్‌పహాడ్ టీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు శ్రీను, జింకల భాస్కర్, గుమ్మడెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్లకే ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చారు
మిర్యాలగూడ : కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు టీఆర్ఎస్లో చేరారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల పీతాంబర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో నిధులు కేటాయించడం లేదని మాట్లాడిన ఎమ్మెల్యే పార్టీ పరువు తీశారని పేర్కొన్నారు. అవినీతి గురించి ఎమ్మెల్యే, ఎంపీపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చింతపల్లి గ్రామ శివారులో డాంబర్ మిక్సింగ్ ప్లాంట్ ఎవరితో నియోజకవర్గంలో అందరికి తెలుసని, అదే విధంగా బీటీ రోడ్ల నిర్మాణం ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఎవరికి అప్పగిస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. మినీ ట్యాంక్ బండ్ పనులలో కమీషన్ల కోసం బెదిరిస్తే కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడని ఆరోపించారు. అదే విధంగా సాగర్ రోడ్డు విస్తరణలో అధికంగా నిధులు మంజూరు చేయించి ఎవరి లబ్ధి చేకూర్చారో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. 2014 ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నానని బకల్వాడ పాఠశాలలో బహిరంగసభలో ఎమ్మెల్యే చెప్పాడనేది నిజం కాదా అని అన్నారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించేది ఎవరనేది ప్రతి ఒక్కరికి తెలుసని ఈ విషయాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు తలకొప్పుల సైదులు, దండ ప్రభాకర్‌రెడ్డి, గజ్జెల నర్సిరెడ్డి, కస్తూరి బాస్కర్, జంగిలి లింగయ్య, కురియ శ్రీనివాస్, సహదేవుని శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కారెక్కనున్న రాజ్యసభ ఎంపీ
-
టీఆర్ఎస్లో చేరనున్న డీఎస్?
-
టీడీపీకి గట్టి దెబ్బ
నేడు టీఆర్ఎస్లో చేరనున్న కీలకనేత తేరా చిన్నపరెడ్డి ఆయనతోపాటు గులాబీ దళంలోకి బడుగుల, రమణానాయక్ కూడా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతోసహా మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో.. త్వరలోనే మరికొందరు నేతల చేరిక సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నాగార్జునసాగర్ నియోజకవర్గ నాయకుడు తేరా చిన్నపరెడ్డి సోమవారం టీఆర్ఎస్లో చేరుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయనతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్, టీడీపీ రాష్ట్ర కమిటీలో పలు హోదాల్లో పనిచేసిన రమణానాయక్లు కూడా టీఆర్ఎస్లో చేరుతున్నారు. వీరితోపాటు జిల్లాకు చెందిన తెలుగుదేశం కేడర్, పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు కూడా గులాబీ దళంలో చేరుతున్నారు. వేలాది మంది కార్యకర్తల సమక్షంలో తేరా టీఆర్ఎస్లో చేరికకు ఆయన అనుచరగణం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, త్వరలోనే టీడీపీకి చెందిన మరికొందరు ముఖ్య నాయకులు కూ డా టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కుదేలైందని, త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు వస్తాయని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఆర్భాటపు ఏర్పాట్లు.. గతంలో ఏ నేత పార్టీలో చేరినప్పుడు జరగని విధంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించి భారీ కార్యక్రమం ద్వారా టీఆర్ఎస్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు చిన్నపరెడ్డి. రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో తన బలాన్ని నిరూపించుకోవాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి 1000 మంది చొప్పున కార్యకర్తలను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం నియోజకవర్గానికి 100 వాహనాల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. తన చేరిక జిల్లాలోనే టీఆర్ఎస్కు మంచి ఊపు తీసుకురావాలనే యోచనతో చిన్నపరెడ్డి ఉన్నారని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకుగాను వెళుతున్నందున ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అనుచరులంటున్నారు. తెలుగుదేశం పార్టీకి కీలకంగా పనిచేసినా పార్టీ చిన్నపరెడ్డికి అన్యాయం చేసిందని వారంటున్నారు. 2009 ఎన్నికల సందర్భంగా బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ నేత జానారెడ్డి లాంటి నాయకుడిని ఢీకొన్న వ్యక్తిగా తగిన ప్రాధాన్యం పార్టీలో లభించలేదని చెబుతున్నారు. గత ఎన్నికలలో నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసినప్పుడు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి ఎంతో సేవ చేశామని, ఆ సేవకు కూడా ఉపయోగం లేకుండా పోయిందని, తెలుగుదేశం పార్టీలో చిన్నపరెడ్డికి అన్యాయం జరిగిందని వారంటున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే ఆ పార్టీలోకి వెళుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధికోసం చేపడుతున్న వాటర్‌గ్రిడ్, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను కేసీఆర్‌కు నైతిక బలం ఇచ్చేందుకు ఆయన పార్టీ మారుతున్నారని చెబుతున్నారు. తన చేరికపై చిన్నపరెడ్డి ఆది వారం ‘సాక్షి’తో మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం టీఆర్ఎస్లో చేరుతున్నట్టు చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకోవాలన్న ఆలోచనతోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం టీఆర్ఎస్ నేతగా తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు.