
గడుగు గంగాధర్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి బాటలోనే జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ ముఖ్యనేత కారెక్కనున్నారా.? త్వరలో వీరు టీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారా? ఇప్పుడు ఈ అంశంపై ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టికెట్ ఆశించారు.
ఈసారి కూడా జుక్కల్‌పై ఆశలు పెట్టుకున్నారు. వీలు కాని పక్షంలో అర్బన్‌లోనైనా తన పేరును పరిశీలించాలని పలుమా ర్లు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆయన పార్టీ మారాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సురేశ్‌రెడ్డి మాదిరిగానే గడుగు కూడా టీఆర్‌ఎస్ పార్టీలో చేరే అవకాశాలు న్నాయి. ఈవిషయమై ‘సాక్షి’ గడుగును సంప్రదించగా తాను పార్టీ మారే యోచన లేదని కొట్టిపారేశారు. అలాంటిదేమైనా ఉంటే చెబుతానని దాటవేశారు.
సీనియర్లే లక్ష్యంగా..
అభ్యర్థులను ప్రకటించి ముందస్తు ఎన్నికలకు దూకుడుగా వెళుతున్న టీఆర్‌ఎస్ ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే అనూహ్యంగా మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డిని కారెక్కించుకుని కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరో జిల్లా ము ఖ్య నేతను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేసిన సీనియర్ నేతలకు గులాబీ కండు వా కప్పడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేయడంతో పాటు, నైతికంగా దెబ్బతీసేందుకు పైఎత్తులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment