కొత్త శ్రీనివాస్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాషాయం కండువా తీసేసి గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు శ్రీనివాస్‌రెడ్డి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఎప్పటి నుంచో బీజేపీలోని కొందరు నాయకుల తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన మంగళవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సు మారు నెల రోజులుగా బీజేపీకి చెందిన కీలక నేత టీఆర్‌ఎస్ గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగగా.. ఐదు రోజుల కిం దట ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొరివి వేణుగోపాల్ రాజీనామా ప్రకటించిన సస్పెన్స్‌కు తెరవేశారు.
ఎన్నికల సమయంలో తాజాగా మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారిం ది. ఇదిలా వుండగా బీజేపీకి రాజీనామా చేసిన శ్రీనివాస్‌రెడ్డితో సంప్రదింపులు జరిపిన కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గులాబీ దళపతి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడించినట్లు తెలిసింది. ఈ మేరకు బుధవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ప్రగతిభవన్‌లో కేసీఆర్, కేటీఆర్‌ల సమక్షంలో నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరా రు చేసుకున్నట్లు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల కు చెందిన కీలక నేతలను టీఆర్‌ఎస్ పార్టీలో చేర్పించడంలో కీలకంగా వ్యవహరించిన గంగుల కమలాకర్ బుధవారం శ్రీనివాస్‌రెడ్డి మరికొందరు నేతలు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
అధిష్టానంపై అసంతృప్తితోనే రాజీనామా..
విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో చురుగ్గా పనిచేసిన శ్రీనివాస్‌రెడ్డి భారతీయ జనతా పార్టీలో 25 ఏళ్లుగా వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి పాటుపడుతూ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అనేక మంది కార్యకర్తలను పార్టీలో చేర్పించి, పార్టీ అభివృద్ధికి కృషి చేసినా తనకు తగిన గుర్తింపు ఇవ్వకుండా రాష్ట్ర పార్టీ కక్ష్య సాధింపు ధోరణి అవలంబించిందని.. తీవ్ర మనస్థాపానికి గురయ్యానని అధిష్టానానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా పక్షపా త ధోరణి అవలంబించారని.. రాష్ట్ర సంఘటన వ్యవహారాలు చూసే వ్యక్తులు జిల్లా పార్టీలో ఉన్న నాయకుల మధ్య సమన్వయం చేసే బదులు కొందరు వ్యక్తులకే వత్తాసు పలకడంతో జిల్లా నాయకులతో నిరాశ నిస్పృహ నెలకొందన్నారు. పార్టీ సిద్ధాంతాల ఆధారంగా కాకుండా వ్యక్తుల ఆధారంగా రాష్ట్ర నాయకత్వానికి అనుగుణంగా పనిచేయగా మనోవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల వెల్లడించిన అభ్యర్థుల జాబితాలో చాలా మంది కొత్త వారికి ఆవకాశం కల్పించడం, రానున్న జాబితాలో కూడా కొత్త వారికి కేటాయిస్తారని వార్తలు రావడంపై బీజేపీ అనేక జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులలో అభద్రతాభావం నెలకొందని లేఖ లో స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, ప్రస్తుత కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నా పార్టీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఆపై స్థాయి నాయకులు అందరూ తన పేరును అభ్యర్థిగా ఖరారు చేయాలని చెప్పినా జాబితాలో తన పేరు లేకపోవడం, వచ్చే జాబి తాలో కూడా హుస్నాబాద్ అభ్యర్థిగా పేరును పరిగణలోకి తీసుకోవడం లేదనే తెలిసి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంతకాలం తనకు సహకరించిన, తనతోపాటు సాగిన నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment