హిందీలోనూ ఆనందో బ్రహ్మ... బట్‌! | Taapsee's Anando Brahma to be remade in Hindi | Sakshi
Sakshi News home page

హిందీలోనూ ఆనందో బ్రహ్మ... బట్‌!

Published Mon, Oct 30 2017 12:40 AM | Last Updated on Mon, Oct 30 2017 12:40 AM

Taapsee's Anando Brahma to be remade in Hindi

బీటౌన్‌లో బ్రహ్మ దేవుడు ఎవరెవరి పేర్లు రాశాడో మరి!? ఎందుకంటే... ప్రతి మెతుకు మీద తినేవాళ్ల పేరు రాసినట్టు, సినిమాలోని ప్రతి పాత్ర మీదా నటించబోయేవాళ్ల పేరు రాసి పెడుతుంటాడట బ్రహ్మ! ‘ఆనందో బ్రహ్మ’ హిందీ రీమేక్‌లో నటీనటులుగా ఎవరెవరి పేర్లు రాశాడో! ‘భయానికి నవ్వంటే భయం’.. దెయ్యాలు మనుషుల్ని చూసి భయపడితే? అనే కాన్సెప్టుతో వచ్చిన ‘ఆనందో బ్రహ్మ’ తెలుగు ప్రేక్షకులందర్నీ నవ్వించి, నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చింది.

హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని చిత్రదర్శకుడు మహి వి. రాఘవ్‌ అనుకుంటున్నారు. ‘గోల్‌మాల్‌’ తరహాలో మాంచి మల్టీస్టారర్‌ సిన్మాగా చేయాలనుకుంటున్నారట! తెలుగులో హాస్యనటులు శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. మరి, హిందీలో వాళ్ల పాత్రల్లో నటించే హీరోలు ఎవరెవరో? తాప్సీ పాత్రలో ఎవరు నటిస్తారో? ‘గోల్‌మాల్‌’ ఫ్రాంచైజీలో ఇటీవల వచ్చిన ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ కాన్సెప్ట్‌ హారరే.

ఆల్రెడీ ఈ సినిమా వందకోట్లు కలెక్ట్‌ చేసింది. సో, హిందీ స్టార్స్‌ ‘ఆనందో బ్రహ్మ’ చేసే చాన్సులు ఎక్కువే. అయితే... హిందీ ‘ఆనందో బ్రహ్మ’ కంటే ముందు తెలుగు ఓ సినిమా చేయాలని మహి వి. రాఘవ్‌ అనుకుంటున్నారట. ప్రస్తుతం కొత్త కథపై ఆయన వర్క్‌ చేస్తున్నారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement